Trending:


Moringa Laddu: మునగాకుల లడ్డూ... ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒకటి తినండి చాలు

Moringa Laddu: మునగాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయినా వీటిని తినేవారి సంఖ్య ఎక్కువే. మునగాకులతో ఒకసారి లడ్డూ చేసి పెట్టండి. దీని రుచి అదిరిపోతుంది.


భద్రాద్రి లో వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం.. తరించిన భక్తజనం..

అంతా రామ నామ జపం . ఎటు చూసినా భక్త జన సందోహం. శ్రీ సీతా రాముల వారి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ముత్యాల తలంబ్రాలను చేతబట్టిన అర్చక స్వాములు .. శ్రీ సీతా రాముల వారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో శ్రీరామ నామం తో భద్రాద్రి లోని రామాలయం మారుమ్రోగింది. భద్రాద్రి లో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవంను అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు.శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా భద్రాద్రికి తరలి వచ్చారు. మిధులా స్టేడియంలో సీతారాముల కళ్యాణం సంధర్భంగా భక్తులు భారీగా తరలి రాగా, భక్తులు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందుగా కళ్యాణ వేదికను వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య శుద్ది చేశారు. అనంతరం శ్రీ రాముల వారికి పచ్చలహారం , సీతమ్మ తల్లికి చింతాకు పతకం తో అలంకరించారు. అశేషంగా హాజరైన భక్త జనసందోహం శ్రీరామ నామాన్ని భక్తిశ్రద్దలతో పలుకుతున్న క్రమంలో సీతా రాముల కళ్యాణాన్ని వేద పండితులు ఘనంగా జరిపించారు. కళ్యాణం అనంతరం సీతారాముల వారికి వేద పండితులు ముత్యాల తలంబ్రాలను పోశారు. కాగా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరైన క్రమంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.


అయోధ్యలో అద్భుత ఘట్టం.. గర్భగుడిలో బాలరాముని నుదుటిపై సూర్యకిరణాలు

అయోధ్యలో అద్భుత ఘట్టం.. గర్భగుడిలో బాలరాముని నుదుటిపై సూర్యకిరణాలు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కంటే ఈ సారి జరిగే సీతారాముల కళ్యాణం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే అయోధ్యలో రామమందిరం నిర్మాణం ఎన్నో ఏళ్ల కల.. అది ఈఏడాది జనవరిలో జరిగింది. అయోధ్యలో ఈ నవమి దాదాపు 500 సంవత్సరాల తర్వాత జరుగుతున్న అతి పెద్ద వేడుక కావడంతో ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చే...


Today Horoscope in Telugu (18/04/2024) : ఈ రాశివారు ఈ రోజు మాజీ ప్రేమికులను కలిసే అవకాశం ఉంది - ఏప్రిల్ 18 రాశిఫలాలు!

Daily Horoscope for April 18th 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా రాశి ఫలితాలను చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.... ఈ రోజు ఏ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి...ఎవరికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి.... మేష రాశి ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు. పనిలో ప్రొఫెషనల్‌గా ఉండండి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు అనుకూలమైనది. విడిపోయిన కొన్ని బంధాలు మళ్లీ చేరువవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం వస్తుంది. ఖర్చులు తగ్గించండి....


Glowing Skin in Summer: ఎండకాలం మీ ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఇదే బెస్ట్‌ హోం రెమిడీ..

Glowing Skin in Summer: ఎండకాలం ముఖం ట్యాన్ అవ్వడం ఖాయం. దీనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. సూర్య కిరణాలు మన ముఖంపై పడి మఖం ట్యాన్ అయి నల్లగా మారిపోతుంది. దీంతో నేచురల్‌గా గ్లో పెరుగుతుంది.


నామినేషన్ ఏ రోజు వేస్తే మంచిది? శుభ ముహూర్తం ఎప్పుడు? పండితుల మాట తెలుసుకోండి

ఏపీ, తెలంగాణలో ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. అంటే 8 రోజులు అభ్యర్థులు నామినేషన్ వెయ్యవచ్చు. మధ్యలో ఆదివారం సెలవు కావడంతో.. 7 రోజులు నామినేషన్ వేసేందుకు వీలు ఉంది. ఐతే.. అభ్యర్థులు.. మంచి రోజుల కోసం చూస్తున్నారు. శుభ ముహూర్తాలు ఏ రోజు ఉన్నాయా అని పండితులను ఆశ్రయిస్తున్నారు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత బిజీగా ఉన్నవారిగా పండితులు, జ్యోతిష్కులు మారిపోయారు. వారికి వరుస కాల్స్ వస్తున్నాయి....


పెరుగులోకి ఉప్పు కలుపుకోవాలా లేక పంచదార.. ఆరోగ్యానికి ఏది మంచిది..

Curd With Sugar : ఏ సీజన్‌లో ఉన్నా, జనాలు పెరుగును ఆహారంతో పాటు తినడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే, వేసవి కాలంలో దీని డిమాండ్ మరింతగా ఉంటుంది. కొంతమంది పెరుగును చక్కెరతో, మరికొందరు ఉప్పుతో రుచి చూస్తారు. అదే సమయంలో, పెరుగులో ఏమీ కలపకుండా తినే వారు కూడా ఉంటారు. కానీ, అలా చేయడం తప్పు. ఎందుకంటే పెరుగు స్వభావం వేడిగానే కాకుండా ఆమ్లంగా ఉంటుంది. కాబట్టి ఏమీ కలపకుండా తినకూడదు. అలా చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.ఇక ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే...


Sriramanavami Vadapappu Recipe :శ్రీరామనవమి రోజు వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా? వడపప్పును ప్రాముఖ్యత ఇదే

Sriramanavami Naivedyam : శ్రీరాముడి పుట్టినరోజునే శ్రీరామనవమి(Srirama Navami 2024)గా పండుగా చేసుకుంటాము. ఈరోజు స్వామివారికి సీతమ్మతో అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేస్తారు. ఇంతటీ పుణ్యదినానా.. శ్రీరాముడికి నైవేద్యంగా పానకం, వడపప్పు పెడతారు. శ్రీరామనవమికి నైవేద్యంగా వడపప్పును ఎందుకు పెడతారు? దానిని ఎలా వండుతారు? వడపప్పును తయారు చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెసిపీని ఎలా తయారు చేయాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు...


Horoscope: ఏప్రిల్ 19 రాశిఫలాలు. వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (ఏప్రిల్ 19, 2024 శుక్రవారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):కష్టార్జితంతో సమానంగా వృథా ఖర్చులుంటాయి. వృత్తి, ఉద్యోగాల మీద ఎక్కువ సమయం పెట్టాల్సి వస్తుంది. ఆదాయానికి, ప్రతిఫలానికి లోటుండదు. వృత్తి జీవితం మూడు పువ్కులు ఆరు కాయలుగా ‍సాగిపోతుంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలను, కొత్త వ్యూహాలను అమలు చేసి, ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వృషభ రాశి (Taurus):ఆదాయం బాగానే ఉంటుంది. ఆదాయాన్ని మెరుగుపరచుకోవడానికి ఎంతో కష్టపడతారు. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటిస్తారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇల్లు, వాహనం కొనాలనే ఆలోచనలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. పిల్లల నుంచి ముఖ్యమైన శుభవార్తలు వింటారు. మిథున రాశి (Gemini):వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట బాగా చెలామణీ అవుతుంది. దాదాపు అధికారులుగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు సాఫీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. కర్కాటక రాశి (Cancer):ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఒడిదుడుకుల తప్పకపోవచ్చు. అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి రంగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మీ మనుసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సన్నిహితులతో వాదోపవాదాలకు దిగవద్దు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పరవాలేదు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సింహ రాశి (Leo):వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. వ్యాపారాల్లో కూడా లాభాలు నిలకడగా ముందుకు వెళ్తాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయాణాలలో, ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కన్య రాశి (Virgo):వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. స్వయం ఉపాధి, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. తుల రాశి (Libra):వృత్తి, ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో ఆస్తి వివాదాలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. వృశ్చిక రాశి (Scorpio):అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యయ ప్రయాసాలను లెక్క చేయరు. కుటుంబపరంగా కూడా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తి అవుతాయి. ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. అదనపు ఆదాయానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలలో వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాల పరిస్థితి నిలకడ గానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ధనస్సు రాశి (Sagittarius):వృత్తి, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చేపడతారు. కొత్త నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. ఆస్తి సంబంధమైన విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులు బాగా అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. మకర రాశి (Capricorn):వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వారితో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సేవ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. కుంభ రాశి (Aquarius):ఉద్యోగంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే సూచనలున్నాయి. అధికారుల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర బిజినెట్ రంగంలో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. మీన రాశి (Pisces):ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి గుర్తింపుతో పాటు డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సత్ఫలితాలనిస్తాయి. స్నేహితుల సహాయంతో అత్యవసర పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Keeradosa Chutney: కీరాదోస పెరుగు పచ్చడి వేసవిలో తిన్నారంటే శరీరానికి ఎంతో చలువ, దీన్ని వండాల్సిన అవసరమే లేదు

Keeradosa curd chutney: వేసవికాలంలో చలువచేసే ఆహారాలను తినాలి. అలాంటి వాటిలో కీరా దోసకాయ ఒకటి. కీరా దోసకాయను ఇలా పచ్చడి చేసుకుని తింటే చలువ చేయడం ఖాయం.


అయోధ్యలో అద్భుతం.. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు..

అయోధ్యలో అద్భుతం.. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు.. అయోధ్యలో అద్భుతం జరిగింది.. శ్రీరామ నవమి రోజు.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. గర్భ గుడిలో కొలువైన బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు తాకాయి.. సూర్య తిలకం ఆవిష్కృతం అయ్యింది.. 2024, ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం.. సరిగ్గా 12 గంటల 16 నిమిషాల నుంచి 12 గంటల 21 నిమిషాల మధ్య.. అయోధ్యలో ఈ అద్భుతం జరిగింది. ఈ ద...


అమ్మాయిలూ... చీప్ గా ప్యాజ్ దాలో అనకండి... ఎందుకంటే ఇవి బంగారు పానీపూరిలు..!

అహ్మదాబాద్ : మహిళలు మరీ ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు పానీపూరి అంటే పడిచస్తారు. వారికి హిందీ బాష రాకున్నా ఒక్కపదం మాత్రం బాగా వస్తుంది... అదే 'భయ్యా... ప్యాజ్ దాలో''. ఇది పానీపూరి పుణ్యమే. పానీపూరి వ్యాపారంలో ఎక్కువగా నార్త్ ఇండియా వాళ్లే వుంటారు... కాబట్టి వారికి తెలుగురాదు... మన తెలుగమ్మాయిలకు హిందీ రాదు. కానీ పానీపూరిపై ఇష్టంతో మన అమ్మాయిలు ఉల్లిపాయలను అడగడం మాత్రం సక్సెస్ ఫుల్ గా నేర్చుకున్నారు. కేవలం తెలుగమ్మాలకే కాదు దేశంలోని అమ్మాయిలందరూ...


Chaddannam Recipe: వేసవిలో పొట్టను హాయిగా ఉంచే పెరుగు చద్దన్నం రెసిపీ.. 2 నిమిషాల్లో తయారు చేసుకోండి..

Perugu Chaddannam Recipe: ప్రతిరోజు ఉదయం పూట పెరుగు చద్దన్నం తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయితే ఈ చద్దన్నం మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా?


Knowledge Story:భూమి తిరగడం ఆగిపోతే.. ఏం జరుగుతుందో తెలుసా.. ?

Knowledge Story: భూమి సూర్యుని చుట్టూ తన కక్ష్యలో తిరుగుతుంది. ఈ భ్రమణం కారణంగా భూమిపై పగలు ,రాత్రి ఏర్పాడతాయి. ఈ గమనం కారణంగా పగలు- రాత్రి మధ్య సమయ వ్యత్యాసం ఉంది. (File Photo) దీనివల్ల భూమిపై రుతువులు మారుతాయి. అయితే ఈ భూమి చలనం యొక్క ప్రభావాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకున్నందున భూమి తిరగడం ఆగిపోతే ఏమి జరుగుతుందో మీకు తెలుసా?(File Photo) భూమి తిరుగుతున్నప్పుడు మనం దానిని గ్రహించలేము. ఎందుకంటే మనం కూడా భ్రమణంలో ఉంటాము కాబట్టి. అందుకే భూమి భ్రమిస్తున్న విషయం మనకు అనుభవంలోకి రాలేదు. భూమి గంటకు ఎంత వేగంగా తిరుగుతుందో తెలుసా?(File Photo) దీనికి మంచి ఉదాహరణ న్యూటన్ యొక్క మొదటి గమన నియమం. భూమి గంటకు 1036 మైళ్లు లేదా గంటకు 1,667 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇది ధ్వని వేగం కంటే వేగంగా ఉంటుంది.(File Photo) భూమి తన అక్షం మీద తిరుగుతున్నందున రాత్రి -పగలు సృష్టించబడ్డాయి. ఇది దీర్ఘవృత్తాకార కక్ష్యలో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. భూమి స్పిన్ అక్షం దాని కక్ష్య యొక్క సమతలానికి సంబంధించి వంగి ఉంటుంది. రుతువుల మార్పు దీనికి కారణం. భూమి సూర్యునికి అభిముఖంగా ఉండే భాగాన్ని వేసవి అని, సూర్యుని నుండి దాగి ఉన్న భాగాన్ని శీతాకాలం అని అంటారు.(File Photo) పగలు ఉన్నచోట విపరీతమైన వేడి, రాత్రి ఉన్నచోట చలి ఉంటుంది. సాధారణంగా భూమి ఒక విప్లవాన్ని పూర్తి చేయడానికి 24 గంటలు పడుతుంది. 2020 తర్వాత ఈ సమయం 0.5 సెకన్లు తగ్గింది.(File Photo) భూమి తిరగడం ఆగిపోతే మనుషుల జీవితాలు కూడా చాలా మారిపోతాయి. అప్పుడు సగం మంది ప్రజలు 6 నెలలు చీకటిలో గడుపుతారు. ఇది అన్ని రకాల జీవనశైలిని మార్చగలదు. మొక్కల స్వభావం మారుతూ ఉంటుంది. మరోవైపు ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతారు.(File Photo) భూభ్రమణ వేగం ముఖ్యంగా భూమిపై అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది. ఆ భ్రమణ వేగం తగ్గితే అయస్కాంత క్షేత్రం ఉత్పత్తి కాదు. ఇది భూమిపై అనేక విషయాలను మారుస్తుంది.(File Photo)


Friday Motivation: మీరు ఆనందంగా ఉండాలంటే మీ భాగస్వామితో ఆరోగ్యకరమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడం ఒక్కటే దారి

Friday Motivation: అన్ని విహారయాత్రలు చేసినా, బయట ఎంత తిరిగినా... చివరికి ఇంటికి వెళ్ళాకే మనసుకు సేద తీరినట్టు అనిపిస్తుంది. ఇల్లు ఆనందవనంలా ఉండాలంటే మీరు జీవిత భాగస్వామితో అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి.


Mahabharat and Ramayan: రామాయణం - మహాభారతం రెండింటిలోనూ కామన్ గా కనిపించే ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇవే!

Mahabharat and Ramayan: మహాభారతం - రామాయణం రెండింటిలోనూ కనిపించే పాత్రలివే.... హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకడు హనుమంతుడు. అంటే ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు...త్రేతాయుగంలో శ్రీరాముడి వెంటే ఉండి సీతమ్మ జాడ తెలియజేయడంతో పాటూ రావణుడి లంకపై దండెత్తి వెళ్లేందుకు శ్రీరాముడి సైన్యాన్ని ముందుండి నడిపించాడు ఆంజనేయుడు. ఆ తర్వాత మహాభారత యుద్ధంలో..అర్జునుడి రథంపై కూర్చుని తనని విజయం వరించేలా సహాయం చేశాడు... పరశురాముడు రామాయణంలో సీతా స్వయంవరంలో శివధనస్సు...


మామిడి పండ్లు కెమికల్స్ లేకుండా పండాయో లేదో తెలుసుకోవడం ఎలా..?

దాదాపు ఎక్కువగా మామిడి కాయలు తొందరగా పండటానికి కాల్షియం కార్బైడ్ వాడుతూ ఉంటారు. ఇది మార్కెట్లో చాలా చీప్ గా దొరుకుతుంది. అందుకే.. ఎక్కువగా దీనిని వాడడుతూ ఉంటారు. ఎండాకాలం ఎండలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే.. ఇంత ఎండల్లోనూ ఊరటనిచ్చే విషయం ఏదైనా ఉంది అంటే.. అది మామిడి పండ్లే. ఎందుకంటే.. మామిడి పండ్లు మనకు సమ్మర్ లో తప్ప.. మరే సీజన్ లోనూ దొరకవు. అందుకే.. ఈ సీజన్ లో మామిడి పండ్లు కనపడగానే... కొనేసి.. తింటూ ఉంటాం. అయితే.. మార్కెట్లో దొరికిన...


భద్రాచలంలో కన్నుల పండువగా రాముని లగ్గం

భద్రాచలంలో కన్నుల పండువగా రాముని లగ్గం వైభవంగా రాములోరి కల్యాణం ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు  సమర్పించిన సీఎస్​ శాంతికుమారి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సురేఖ భక్తుల రామనామ స్మరణతో మార్మోగిన భద్రాచల పురవీధులు నేడు మహాపట్టాభిషేకం.. హాజరుకానున్న గవర్నర్ శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం భద్రాచలంలో సీతారాముల ...


Surya Tilak: రామనవమి వేళ అయోధ్యలో అద్భుతం.. బాలరాముడి నుదుటిని ముద్దాడిన సూర్య కిరణాలు

Surya Tilak: శ్రీరామనవమి వేళ.. అయోధ్యలో అద్భుతం చోటు చేసుకుంది. గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదుటిని సూర్యుడి కిరణాలు ముద్దాడాయి. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. అయోధ్య రామ మందిరం నిర్మించే సమయంలోనే.. ప్రతీ శ్రీరామనవమికి మధ్యాహ్నం 12 గంటలకు రాముడి విగ్రహంపై సూర్యుడి కిరణాలు పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అసలు ఈ ప్రత్యేక ఏర్పాట్లు ఎలా చేశారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


Chicken Biryani: కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ వండి చూడండి, రుచికి దాసోహం అయిపోవాల్సిందే

Chicken Biryani: కొబ్బరిపాలతో టేస్టీ చికెన్ బిర్యానీ ఒకసారి చేసి చూడండి. ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. దీని రెసిపీ కూడా చాలా సులువు.


Hyderabad Non Veg Shops close : నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్, వచ్చే ఆదివారం హైదరాబాద్ లో మాంసం షాపులు బంద్

Hyderabad Non Veg Shops close : హైదరాబాద్ లో నాన్ వెజ్ ప్రియులకు జీహెచ్ఎంసీ ఓ చిన్న బ్యాడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఆదివారం నగరంలో మీట్, బీఫ్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.


Guru Gochar 2024: బృహస్పతి రాశి ప్రవేశం..మే 1 నుంచి ఈ రాశులవారికి లాభాలే, లాభాలు!

Jupiter Transit 2024: బృహస్పతి సంచారం కారణంగా మే 1వ తేది నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో సింహ రాశితో పాటు కన్యా ఇతర రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.


Find Sweet Mangoes: మామిడిపండు తీయ్యగా ఉన్నది ఇలా గుర్తించి కొనుగోలు చేయండి..

Find Sweet Mangoes: ఎండకాలం వచ్చేసింది మార్కెట్లో మామిడిపండ్లు కనిపిస్తున్నాయి. మామిడిపండు అంటే ఇష్టం లేని వారు ఉండరు. మన దేశంలో రకరకాల మామిడిపండ్లు అందుబాటులో ఉన్నాయి.


ఈ లాభాల కోసమైనా కచ్చితంగా దోసకాయ తినాల్సిందే..

సమ్మర్‌లో డైట్‌పై కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. శరీరానికి కచ్చితంగా హైడ్రేషన్ అందించాలి. దీంతో పోషకాలు అందుతున్నాయో లేదో చూసుకోవాలి. అలాంటి సమ్మర్ సీజనల్ ఫుడ్ గురించి తెలుసుకోండి.


Rama Navami Guru Graha: శ్రీరామ నవమి వేళ అరుదైన శుభ యోగాలు.. ఈ 5 రాశులకు రామయ్య ప్రత్యేక ఆశీస్సులు..!

Rama Navami 2024: జ్యోతిష్యం ప్రకారం, శ్రీరామ నవమి వేళ కొన్ని అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి రామయ్య ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో తెలుసుకోండి...


Oranges: ఆయుర్వేదం ప్రకారం భోజనం చేశాక నారింజ పండ్లను తినకూడదు, ఎందుకో తెలుసా

Oranges: నారింజ పండ్ల వాసన చూస్తేనే తినేయాలనిపిస్తుంది. నారింజ జ్యూస్‌ని ఇష్టపడే వారు ఎక్కువే. అయితే భోజనం చేశాక నారింజ పండ్లను తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది.


Women Beauty : టమాటాలతో మీరు అందంగా.. మిలామిలా మెరిసిపోతారు.. !

Women Beauty : టమాటాలతో మీరు అందంగా.. మిలామిలా మెరిసిపోతారు.. ! సాధారణంగా చాలా కూరల్లో టమాటాలు వేస్తుంటాం. కానీ, ప్రత్యేకంగా టొమాటో కూర వండడం చాలా అరుదు. టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టొమా టాల్లో లికోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అందుకే ఎండాకాలంలో తినే ఆహారంలో టమాటాలు ఎక్కువగాచేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇది శరీరానికి సన్ స్క్ర...


Eggs: వేసవికాలంలో గుడ్లు ఎక్కువగా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త!

Eggs side effects : గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ అలా అని గుడ్లు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం మెరుగు పడటానికి బదులు ఇంకా పాడైపోతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. గుడ్లు ఎక్కువ తినడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో కూడా మనం తెలుసుకోవాలి.


Sesame Oil Uses: షుగర్‌ లెవల్స్‌ను కొంట్రోల్‌ చేయడంలో నువ్వుల నూనె ప్రయోజనాలు ఇవే..!

Benefits Of Sesame Oil: నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల చర్మం, గుండె సంబంధిత వ్యాధులు జుట్టు, ఇతర ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీని వల్ల కలిగే ఇతర లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


Happy Ram Navami 2024: ఎవరినైనా పొగిడినప్పుడు 'సాక్షాత్తు రామచంద్రుడే' అంటాం - రాముడిలో అంత గొప్పదనం ఏంటి!

Happy Ram Navami 2024: తాను దేవుడిని అని చెప్పలేదు..విశ్వరూపం చూపించలేదు..జీవితంలో అడుగడుగునా కష్టాలు ఎదురైనా ఎక్కడా తొణకలేదు. తెల్లారితే సింహాసనంపై కూర్చోవాల్సిన శ్రీరాముడు...నారవస్త్రాలు ధరించి అడవికి ప్రయాణం అవ్వాల్సి వచ్చింది. తండ్రిని కడసారి చూసే అదృష్టం కూడా దక్కలేదు.. వనవాసంలో ఉన్నప్పుడు రావణుడు సీతను ఎత్తుకుపోయాడు...అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రావణ సంహారం చేశాడు. రావణ సంహారం వరకూ ఎన్నో కష్టాలు పడ్డాడు. పోనీ వనవాసం పూర్తై వచ్చిన...


మెదడును ఆరోగ్యంగా ఉంచే సింపుల్ చిట్కాలు!

మెదడును చురుకుగా ఉంచుకునేందుకు సహాయపడే కొన్ని చిట్కాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. ఈ చిట్కాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి.


శనగపిండిలో వీటిని కలిపి ప్యాక్ వేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది..

చర్మాన్ని కాంతివంతంగా కనిపించేందుకు ఫేషియల్స్ హెల్ప్ చేస్తాయి. ఇంట్లోనే తయారుచేసే ఓ ఫేషియల్ గురించి తెలుసుకోండి.


Apple Juice: సమ్మర్‌లో తప్పకుండా తీసుకోవాల్సిన యాపిల్ జ్యూస్..తయారీ విధానం

Apple Juice Recipe: యాపిల్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని నేరుగా తీసుకోవడానికి ఇష్టపడని పిల్లలు మీరు జ్యూస్‌ లా చేసి వారికి తినిపించవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేయాలి.. దీంతో కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


Good News : ఇలా చేస్తే.. మీరు రోజూ సంతోషంగా ఉంటారు.. ఒక్కసారి చేసి చూడండి..!

Good News : ఇలా చేస్తే.. మీరు రోజూ సంతోషంగా ఉంటారు.. ఒక్కసారి చేసి చూడండి..! కొందరు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా నిరాశలో ఉంటారు. ఇతరులతో పోల్చుకుని బాధపడిపోతుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. పాజిటివ్ ఆలోచనలు చేసేందుకే ప్రాధాన్యమివ్వండి. అలాగే మీకు ఆనందం కలిగించిన సందర్భాలను కుదిరినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవాలి. చి...


ఫ్రిజ్ వీటిని పెట్టకూడదు తెలుసా?

ఫ్రిడ్జ్ లో మనం ఎన్నో పెడుతుంటాం. కానీ ఫ్రిడ్జ్ లో కొన్నింటిని పొరపాటున కూడా పెట్టకూడదు. ఒకవేళ మీరు వాటిని పెడితే మీకు ఎన్నో వ్యాధులు వస్తాయి. ఇంతకీ ఫ్రిజ్ లో ఏం పెట్టకూడదంటే? చాలా మంది వారం రోజులకు సరిపడా కూరగాయలను ఒకేసారి కొనేసి ఫ్రిజ్ లో పెడుతుంటారు. అసలు వీటిని ఫ్రిజ్ లో పెట్టొచ్చా? లేదా? అనేది ఆలోచన చేయకుండా ఫ్రిజ్ ను నింపడమే పనిగా పెట్టుకుంటారు కొంతమంది. కానీ దీనివల్ల మనం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్రిజ్ లో పెట్టాల్సినవి...


Viral Video: మీకు అవతార్ బిర్యానీ గురించి తెలుసా? భలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది - మీరూ ట్రై చేయండి

Avatar Biryani Viral Video: బిర్యానీల్లో చాలా రకాలున్నాయి. కానీ అవతార్ బిర్యానీ (Avatar Biryani) గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. జనరల్‌గా బిర్యానీ అంటే ఎల్లో కలర్‌లో ఉంటుంది. కానీ ఓ చెఫ్‌ దీన్ని బ్లూ కలర్‌లో వండేశాడు. ఇది అచ్చం అవతార్‌లోని పాండా గ్రహంలో ఉండే కలర్‌ ఇది. అందుకే దీనికి అవతార్ బిర్యానీ అని పేరు పెట్టేశారు నెటిజన్లు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బిర్యానీ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ...


శ్రీశైలం శివయ్య క్షేత్రంలో వైభవంగా రామయ్య కళ్యాణం..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవశక్తి పీఠం రెండవ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండవకొనసాగాయి. తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు.దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయోధ్య రాజు దశరథ...


రాజన్న సన్నిధిలో రాములవారి కళ్యాణం.. లక్షమంది భక్తులు హాజరు

రాజన్న సన్నిధిలో రాములవారి కళ్యాణం.. లక్షమంది భక్తులు హాజరు సీతారాముల కల్యాణానికి హాజరైన లక్షదాకా జనం       ఆకర్షణగా నిలిచిన శివ పార్వతులు, జోగినులు, హిజ్రాలు      వైభవంగా రథోత్సవం వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణం తిలకించడానికి లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్...


Bitter Gourd Side Effects: వీరు కాకరకాయ అస్సలు తినకూడదు.. !

కాకరకాయ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో దోరగా వేగించిన కాకరకాయల నుంచి ఉడకబెట్టిన కాకరకాయల వరకు తినే ట్రెండ్ ఇళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కాకారకాయ సబ్జీ ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రజాదరణ పొందిన వంటకం. Bitter Gourd (Karola) Side Effects: మనందరికీ తెలిసినట్లుగా, ఈ పచ్చి కూరగాయ మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దాని వినియోగం తీవ్రంగా హాని కలిగించే కొన్ని సమస్యలు ఉన్నాయి. కాకరకాయ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం. ఈ కూరగాయను ఎవరు తినకూడదు? Bitter Gourd (Karola) Side Effects: పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాకరకాయ నిస్సందేహంగా పోషకమైన కూరగాయ. ఈ కూరగాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అయితే కాకరకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల డయాబెటిస్‌తో సహా వివిధ వ్యాధులను నివారించవచ్చు. Bitter Gourd (Karola) Side Effects: లైఫ్ స్టైల్ కోచ్ , న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖోపాధ్యాయ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలా రాశారు, చేదు కొన్నిసార్లు మీకు చెడుగా మారుతుందని తెలిపారు. కాకరకాయ విషం కంటే తక్కువ కాదనే కొందరు వ్యక్తులు ఉన్నారు. ఏయే వ్యక్తులకు, ఏయే సమస్యలలో కాకరకాయ వినియోగం హానికరమో తెలుసుకుందాం. Bitter Gourd Side Effects: తక్కువ షుగర్ ఉన్నవారు కాకరకాయను నివారించాలి. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, కాకరకాయ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి, ఈ చేదు కూర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. కానీ, మీకు షుగర్ లెవెల్ తగ్గే సమస్య ఉంటే పొరపాటున పొట్లకాయ తినకండి. అలాగే, మధుమేహంలో దీని అధిక వినియోగం హెమోలిటిక్ అనీమియా ప్రమాదాన్ని పెంచుతుంది. Bitter Gourd (Karola) Side Effects: మీరు గర్భవతిగా ఉన్నట్లయితే, కాకరకాయ మీకు హానికరం. నిజానికి, కాకరలో ఉండే మెమోర్‌కారిన్ భాగం పిండం ఆరోగ్యానికి హానికరం. అటువంటి పరిస్థితిలో, గర్భధారణ సమయంలో కాకరకాయను వీలైనంత తక్కువగా తినడానికి ప్రయత్నించండి. కాలేయానికి హానికరం : కాలేయం మన శరీరంలో ముఖ్యమైన భాగం. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ మీరు ప్రతిరోజూ చేదు లేదా దాని రసాన్ని తీసుకుంటే, అది కాలేయ ఆరోగ్యానికి హానికరం. నిజానికి, కాకరకాయలో ఉండే లెక్టిన్లు కాలేయంలో ప్రోటీన్ల ప్రసరణను నిరోధిస్తాయి, ఇది కాలేయ వ్యాధికి దారితీస్తుంది. అతిసారం: చాలా మంది ప్రజలు తమ రోజువారీ ఆహారంలో చేదును చేర్చుకుంటారు ఎందుకంటే దాని బహుముఖ ప్రయోజనాలు. కానీ రోజూ తీసుకోవడం వల్ల తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. నిజానికి, కాకరకాయను ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు , వాంతులు పెరుగుతాయి. కాబట్టి ప్రతిరోజు దీనికి దూరంగా ఉండాలి. కడుపునొప్పి : రోజూ కాకర తింటే కడుపునొప్పి సమస్య వస్తుంది. అంతే కాదు, కాకరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మందికి జ్వరం లేదా తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రోజూ కాకరకాయను తినడం హానికరం.


టీలో కాస్తా ఉప్పు వేసి చేస్తే ఈ లాభాలన్నీ అందుతాయి..

టీ చేసేటప్పుడు సాధారణంగా అందరూ పంచదార కలుపుతారు. కానీ, ఉప్పు వేయడం వల్ల చాలా లాభాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.


శ్రీరామనవమి రోజు చదవాల్సిన శ్లోకాలు ఇవే....

శ్రీరామనవమి రోజు చదవాల్సిన శ్లోకాలు ఇవే.... రామ నామంతో సకల పాపహరణం. శ్రీరామ నవమి ( ఏప్రిల్​ 17) సందర్భంగా రామ నామ స్మరణ చేసేందుకు శక్తివంతమైన రామనామ శ్లోకాలను తెలుసుకుందాం. . . శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం.. రామరాజ్యం రమణీయం. శ్రీరాముని పట్టాభిషేకం సకల జనులను పరవశింపజేసే ఓ అద్భుతఘట్టం.ఆ అద్భుతమైన రోజు ... . భారతదేశంలో హిందువులంతా చైత్ర శుద్ధ నవమి ...


Today Panchangam: ఏపైనా ఈ అమృత ఘడియల్లోనే మొదలుపెట్టండి..!

తెలుగు పంచాంగం ప్రకారం.. 19 ఏప్రిల్ 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 19 ఏప్రిల్ 2024 శ్రీ క్రోథి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుక్లపక్షం శుక్రవారం తిథి:- ఏకాదశి రాత్రి 08:14ని॥ వరకు నక్షత్రం:- మఘ ఉ॥ 11:55ని॥ వరకు యోగం:- వృద్ధి రాత్రి02:30ని॥ వరకు కరణం:- వణిజి ఉ॥07:50భద్ర రాత్రి08:44 ని॥ వరకు వర్జ్యం:- రాత్రి08:46ని॥ల10:32ని॥వరకు అమృత ఘడియలు:-...


Rasi Phalalu 19-4-2024: ఆ రాశి వారికి ప్రమోషన్‌ రావచ్చు

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 ఏప్రిల్ 19వ తేదీ, శుక్రవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):థ్రిల్లింగ్ ఎన్‌కౌంటర్ లేదా ఊహించని కనెక్షన్‌లో మీరు పొరపాట్లు చేయవచ్చు. వర్క్‌లో వివిధ ప్రాజెక్ట్‌లను మేనేజ్‌ చేస్తున్నప్పుడు, ఆర్గనైజ్డ్‌, ఫోకస్డ్‌గా ఉంటే విజయం సాధిస్తారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని గుర్తుంచుకోండి. బిజీనెస్ మధ్య విశ్రాంతి తీసుకోండి. యోగా లేదా మెడిటేషన్ వంటి మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్‌లు జీవితంలో సమతుల్యతను తీసుకొస్తాయి. ఆకస్మిక ప్రయాణ అవకాశాలు లభిస్తాయి, అవి సర్‌ప్రైజ్‌లను అందిస్తాయి. అదృష్ట సంఖ్య: 7. అదృష్ట రంగు: రాయల్ బ్లూ. అంతర దృష్టి, సృజనాత్మకతను పెంచడానికి ఆక్వామారిన్ ధరించండి. వృషభం (Taurus):మీ ప్రేమ జీవితంలో లోతైన ఎమోషనల్‌ కనెక్షన్‌ పొందుతారు. మీ భాగస్వామి నుంచి సాన్నిహిత్యం, బలమైన నిబద్ధతను ఆశించవచ్చు. పనిలో, సహనం, పట్టుదలతో విజయాలు, లక్ష్యాలు సాధిస్తారు. బ్యాలెన్స్‌డ్‌ డైట్‌, రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌ ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తోటపని లేదా పెయింటింగ్ వంటి కార్యకలాపాల ద్వారా అంతర్గత శాంతిని కనుగొనడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రకృతిని అన్వేషించడం లేదా ప్రశాంతమైన ప్రదేశాలను సందర్శించడం పరిగణించండి. అదృష్ట సంఖ్య: 2. అదృష్ట రంగు: స్కై బ్లూ. అంతర్గత బలం, స్పష్టతను మెరుగుపరచడానికి లాపిస్ లాజులీని ధరించండి. మిథునం (Gemini):ఉత్తేజకరమైన రొమాంటిక్‌ ఆపర్చునిటీలు పొందుతారు. అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఓపెన్ మైండెడ్‌గా ఉండండి. కెరీర్‌లో కొత్త అవకాశాలు, కొలాబరేషన్‌లు ఉంటాయి. ఎక్సర్‌సైజ్‌, బాగా తినడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి. మానసిక స్పష్టత, శాంతి కోసం జర్నలింగ్ లేదా రీడింగ్‌ వంటి కార్యకలాపాల్లో పాల్గొనండి. కొత్త నగరాలను అన్వేషించండి లేదా చిన్న ప్రయాణాలు చేయండి. అదృష్ట సంఖ్య: 5. అదృష్ట రంగు: మణి. కమ్యూనికేషన్ స్కిల్స్‌ మెరుగుపరచడానికి, సామరస్యాన్ని ప్రోత్సహించడానికి బ్లూ లేస్ అగేట్ ధరించండి. కర్కాటకం (Cancer):రొమాంటిక్‌ లైఫ్‌లో హార్మనీ, ఎమోషనల్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ లభిస్తుంది. ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత లోతుగా మారవచ్చు, కొత్త కనెక్షన్లు ఏర్పడవచ్చు. వర్క్‌లో వృద్ధి అవకాశాలు అందుకోవడానికి స్కిల్స్‌ పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. మీ ఆరోగ్యం కోసం మానసిక శ్రేయస్సు, సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి వంట చేయడం లేదా ప్రియమైన వారితో గడపడం వంటివి ఆస్వాదించండి. బీచ్‌ల సందర్శన లేదా కుటుంబ సభ్యులతో మళ్లీ కనెక్ట్ అవ్వడాన్ని పరిగణించండి. అదృష్ట సంఖ్య: 3. అదృష్ట రంగు: బేబీ బ్లూ. అంతర దృష్టి, అంతర్గత శాంతిని మెరుగుపరచడానికి మూన్‌స్టోన్ ధరించండి. సింహం (Leo):మీ రొమాంటిక్‌ లైఫ్‌లో ఉత్సాహం వేచి ఉంది. వర్క్‌లో మీ సృజనాత్మక, నాయకత్వ నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్‌ అందుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం, ఆరోగ్యం కోసం మీ శరీర అవసరాలను వినడంపై దృష్టి పెట్టండి. డ్యాన్స్ లేదా పెయింటింగ్ వంటి కార్యకలాపాలతో విశ్రాంతి తీసుకోండి. పెద్ద నగరాలు లేదా ఈవెంట్‌లు మీ ప్రయాణ ప్రణాళికలలో భాగం కావచ్చు. అదృష్ట సంఖ్య: 1. అదృష్ట రంగు: నేవీ బ్లూ. విశ్వాసాన్ని పెంచడానికి, విజయాన్ని ఆకర్షించడానికి నీలిరంగు పుష్పరాగాన్ని ధరించండి. కన్య (Virgo):రొమాన్స్‌లో స్థిరత్వం, సామరస్యం మీ కోసం వేచి ఉన్నాయి. ఇప్పటికే ఉన్న రిలేషన్‌లు మరింతగా పెరగవచ్చు, అయితే కొత్త కనెక్షన్లు ఏర్పడవచ్చు. డీటైల్స్‌పై ఫోకస్‌ ఉంచండి, ఆర్గనైజ్డ్‌గా ఉండంటం ద్వారా పనిలో విజయం సాధిస్తారు. వ్యాయామం, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రశాంతమైన డెస్టినేషన్‌లు, సుందర ప్రదేశాలను అన్వేషించండి. అదృష్ట సంఖ్య: 6. అదృష్ట రంగు: పాస్టెల్ బ్లూ. నీలమణిని ధరించడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్‌ మెరుగుపడతాయి. తుల (Libra):రొమాంటిక్‌ లైఫ్‌లో ఆనందం ఉంటుంది. ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత లోతుగా మారవచ్చు, కొత్త కనెక్షన్లు వికసించవచ్చు. కొలాబరేషన్‌లు, పార్ట్‌నర్‌షిప్‌లతో వర్క్‌లో విజయం అందుకుంటారు. ఆరోగ్యం, మానసిక క్షేమం కోసం సెల్ఫ్‌కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. అంతర్గత శాంతిని కనుగొనడానికి ధ్యానం లేదా కళ వంటి మైండ్‌ఫుల్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనండి. మనోహరమైన పట్టణాలను అన్వేషించడం లేదా సోషల్‌ ఈవెంట్స్‌కి హాజరుకావడాన్ని పరిగణించండి. అదృష్ట సంఖ్య: 4. అదృష్ట రంగు: పెరివింకిల్ బ్లూ. సృజనాత్మకత, అంతర్గత శాంతిని మెరుగుపరచడానికి అజురైట్ ధరించండి. వృశ్చికం (Scorpio):మీ కోసం ఇంటెన్స్‌, ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఎక్స్‌పీరియన్స్‌లు వేచి ఉన్నాయి. మీ భావోద్వేగాలను స్వీకరించండి, ప్రక్రియపై నమ్మకం ఉంచండి. వర్క్‌లో మీ సంకల్పం, ప్యాషన్‌ విజయాన్ని అందిస్తాయి. మీ లైఫ్‌స్టైల్‌ బ్యాలెన్స్‌ చేసుకోండి, మీ ఆరోగ్యానికి అవసరమైన విరామాలు తీసుకోండి. ఆధ్యాత్మిక ప్రదేశాలను అన్వేషించడం లేదా ప్రకృతిలో ఏకాంతాన్ని కోరుకోవడం గురించి ఆలోచించండి. అదృష్ట సంఖ్య: 8. అదృష్ట రంగు: మిడ్‌నైట్‌ బ్లూ. అంతర దృష్టిని మెరుగుపరచడానికి, శక్తిని రక్షించడానికి అబ్సిడియన్ ధరించండి. ధనస్సు (Sagittarius):అడ్వెంచరస్‌, స్పాంటేనియస్‌ రొమాంటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌లు పొందుతారు. కొత్త కనెక్షన్‌లను స్వీకరించండి, మీ ప్రేమ జీవితంలో ఉత్సాహాన్ని పొందండి. పనిలో మీ ఆశావాద, ఉత్సాహభరితమైన విధానం వృద్ధి అవకాశాలను ఆకర్షించవచ్చు. శారీరక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. మీ శ్రేయస్సు కోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్‌ చేయండి. థ్రిల్లింగ్ అడ్వెంచర్‌లను ప్రారంభించడం లేదా మీ ప్రయాణాల కోసం ఫారిన్‌ కంట్రీలు సందర్శించడం గురించి ఆలోచించండి. అదృష్ట సంఖ్య: 9. అదృష్ట రంగు: ఎలక్ట్రిక్‌ బ్లూ. సమృద్ధిని ఆకర్షించడానికి నీలిరంగు పుష్పరాగాన్ని ధరించండి. మకరం (Capricorn):మీకిది స్థిరమైన, సురక్షితమైన రొమాంటిక్‌ ఫేజ్‌. మీ రిలేషన్‌లో బలమైన పునాదిని నిర్మించడంపై దృష్టి పెట్టండి. పనిలో మీ క్రమశిక్షణతో లక్ష్యాలను సాధిస్తారు. సమతుల్య దినచర్యను నిర్వహించాలని గుర్తుంచుకోండి. మీ ఆరోగ్యం కోసం విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. చారిత్రక ప్రదేశాలను సందర్శించడం లేదా ప్రియమైన వారితో మళ్లీ కనెక్ట్ అవ్వడాన్ని పరిగణించండి. అదృష్ట సంఖ్య: 10. అదృష్ట రంగు: స్టీల్‌ బ్లూ. అంతర దృష్టి, స్పష్టతను మెరుగుపరచడానికి అజూరైట్ లేదా నీలమణి ధరించండి. కుంభం (Aquarius):ఉత్తేజకరమైన, అసాధారణమైన రొమాంటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌లు వేచి ఉన్నాయి. మీ ప్రత్యేక లక్షణాలను స్వీకరించండి, కొత్త కనెక్షన్‌లను స్వాగతించండి. పనిలో మీ వినూత్న ఆలోచనలు విజయం, గుర్తింపుకు దారితీయవచ్చు. మీ శ్రేయస్సు కోసం వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లను మీ దినచర్యలో చేర్చుకోండి. ఆఫ్‌బీట్ డెస్టినేషన్‌లు సందర్శించడం లేదా మేధోపరమైన సమావేశాలకు హాజరుకావడాన్ని పరిగణించండి. అదృష్ట సంఖ్య: 11. అదృష్ట రంగు: మణి. సృజనాత్మకత, అంతర దృష్టిని మెరుగుపరచడానికి ఆక్వామారిన్ లేదా బ్లూ అవెన్చురిన్ ధరించండి. మీనం (Pisces):మీ దయగల స్వభావాన్ని స్వీకరించండి, ప్రేమ ప్రవాహంపై నమ్మకం ఉంచండి. వర్క్‌లో మీ అంతర దృష్టి, ఆర్టిస్టిక్‌ ఎబిలిటీస్‌తో విజయం సాధిస్తారు, సంతృప్తి పొందుతారు. ఆరోగ్యం కోసం పని, విశ్రాంతి మధ్య సమతుల్యతను మెయింటైన్‌ చేయండి. మీ ప్రయాణ ప్రణాళికల్లో భాగంగా నదులు, సముద్ర తీర ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించండి. అదృష్ట సంఖ్య: 12. అదృష్ట రంగు: సీ బ్లూ. అంతర దృష్టిని మెరుగుపరచడానికి, హీలింగ్‌ కోసం లారిమార్ ధరించండి. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Empty Stomach Foods: ఖాళీ కడుపుతో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..

Empty Stomach Foods In Telugu: రోజంతా యాక్టివ్ గా ఉండడానికి మనం తీసుకునే అల్పాహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం పూట పోషకాలు ఫైబర్ అధిక మోతాదులో ఉండే ఆహారాలకి తీసుకోవడం ఎంతో మంచిది. ఇటీవలే అధ్యయనాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ కింది ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


Air Conditions: ఈ టిప్స్ పాటిస్తే చాలు, ఏసీలు వాడినా కరెంటు బిల్లులు తగ్గించుకోవచ్చు

Air Conditions: వేసవి వచ్చిందంటే చాలు కరెంటు బిల్లులు మోత మోగిస్తుంటాయి. నిరంతరం తిరిగే ఫ్యాన్లు, ఏసీల కారణంగా బిల్లు భారీగా వస్తుంటుంది. ఏసీలు వాడకుండా ఉండలేని పరిస్థితి. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే విద్యుత్ బిల్లుల మోత ఉండదంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..


Auspicious Plants for home: వాస్తు ప్రకారం ఈ 10 మొక్కలు మీ ఇంట్లో ఉంటే డబ్బును మ్యాగ్నెట్‌లా ఆకర్షిస్తాయి.

Auspicious Plants for home: వాస్తు ప్రకారం కొన్ని పూల మొక్కలు మన ఇంటి గార్డెన్లో ఉండాల్సిందే ఇవి ఇంటి అందాన్ని రెట్టింపు చేయడంతో పాటు వాస్తు పరంగా పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకువస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు


Mercury Retrograde 2024: బుధుడి తిరోగమనం ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి నష్టాలు తప్పవా?

Mercury Retrograde In Telugu: బుధుడి తిరోగమనం ఎఫెక్ట్‌ కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో అనేక ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


Mobile Tips: సమ్మర్‌లో మీ మొబైల్ వేడెక్కుతుందా? అయితే ఈ టిప్స్ గుర్తుంచుకోండి

ఎండాకాలం రానే వచ్చింది.. ఈ నేపథ్యంలో భానుడు భగభగ మండుతున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. దాదాపు ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారంటూ ఉండక పోవచ్చు. ఎండాకాలం రానే వచ్చింది.. ఈ నేపథ్యంలో భానుడు భగభగ మండుతున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. దాదాపు ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారంటూ ఉండక పోవచ్చు. అదేవిధంగా సమ్మర్ లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పేలిపోయే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. దీనిపై లోకల్ 18 ప్రత్యేక కథనం. వివరాల్లోకెళ్తే.. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని మూసిరోడ్ లో సోనోస్ మొబైల్ సర్వీసింగ్, సేల్స్ దుకాణాన్నిగత 15 సంవత్సరాల నుండి మొబైల్ షాప్ జలీల్ పాషా నడిపిస్తున్నారు. పాషా చెప్తున్న ప్రకారం ప్రస్తుతం ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు కొనసాగుతుంది. సూర్యుడు ఏ విధంగా బాగా మండుతున్నాడో అదేవిధంగా మొబైల్ ఫోన్లు సైతం హీటెక్కి మనల్ని భయానికి గురి చేస్తుంటాయి. దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరణించే అవకాశాలు ఉన్నాయట. ఈ సమస్య పైన కస్టమర్లు ప్రతిరోజు తమను సంప్రదిస్తున్నారన్నారు. చాలా మంది ఎక్కువగా నైట్ మొత్తం చార్జింగ్ పెట్టి ఉంచడం వల్ల బ్యాటరీ లో ఉన్నటువంటి బక్లింగ్ హీట్ అవ్వడం వల్ల మొబైల్ ఫోన్ పేలే అవకాశాలు చాలా ఉన్నాయన్నారు . ప్రస్తుత ఆధునిక కాలంలో అందరూ ఫాస్ట్ ఛార్జింగ్ హై వోల్టేజ్ వాట్స్ తో ఛార్జింగ్ పెడుతున్నారన్నారు. అదేవిధంగా నైట్ టైం లో కరెంటు ఫీడర్ చేంజ్ చేయడంలో ఒక ఫేజ్రెండు ఫేజ్ లుగా మారుతున్న క్రమంలో కూడా బ్యాటరీ దెబ్బతింటుందన్నారు. చార్జింగ్ ఎప్పుడైనా కంటిన్యూషన్ గా పెట్టకూడదన్నారు. ఎప్పుడు తదేకంగా ఛార్జింగ్ పెట్టరాదన్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో 5జి నెట్వర్క్ రావడం తో పైన సర్వర్లు సమస్యలు వస్తున్నాయి. దీనితో మొబైల్ ఫోన్లు హీట్ అవుతున్నాయన్నారు . హీట్ అయినప్పుడు 5 నుండి 4g లకి కన్వర్ట్ అయితే హీటింగ్ తగ్గుముఖం పడుతుందన్నారు. కొంత సమయం తర్వాత 5జి నెట్వర్క్ కొనసాగించవచ్చని, ఫోర్ జి నెట్వర్క్ కి కన్వర్ట్ కానీ ఎడల అలానే కొనసాగిస్తే మొబైల్ బాగా హీట్ తో పేలిపోయే అవకాశాలున్నాయన్నారు.


Money Astrology: ఏప్రిల్ 18 ధన జ్యోతిష్యం. వారు వ్యాపార ఒప్పందాల్లో లాభాలు గడిస్తారు

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. ఏప్రిల్ 18వ తేదీ, గురువారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన పనుల గురించి ఆందోళన ఉంటుంది, కానీ కాలక్రమేణా పనులు ప్రారంభమవుతాయి. నిలిచిపోయిన డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ డబ్బును ఇంటి ఖర్చులకు ఉపయోగించకండి, సరైన సలహా తీసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టండి. భవిష్యత్తులో మీకు పెద్ద లాభాలు వస్తాయి. పరిహారం: ఆవుకు పచ్చి మేత తినిపించండి. వృషభం (Taurus):ఆర్థికంగా మీకు ఈ రోజు కలిసి రాదు. డబ్బు సంబంధిత విషయాల్లో సమస్యలు ఉండవచ్చు. అకస్మాత్తుగా ఏదైనా పని చేయడానికి అప్పు తీసుకోవలసి రావచ్చు. ఆఫీసులో మోసం జరిగే అవకాశం ఉంది. ఏదైనా డాక్యుమెంట్‌పై సంతకం చేసే ముందు, దానిని జాగ్రత్తగా చదవండి. పరిహారం: సూర్యునికి నీటిని సమర్పించండి. మిథునం (Gemini):ఆఫీసులో పని శారీరక అసౌకర్యం కారణంగా ప్రభావితం కావచ్చు, దీని కారణంగా అధికారుల దృష్టిలో మీ ప్రతిష్ట మసకబారుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ధన లాభం కలిగే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. పరిహారం: కృష్ణుని ఆలయంలో వేణువును సమర్పించండి. కర్కాటకం (Cancer):మీరు అదృష్టం కోసం అవకాశాలు పొందవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ అందుకుంటారు. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ఏదైనా విషయంలో మీతో విభేదాలు పెరగవచ్చు. డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించండి, లేకపోతే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించండి. రిహారం: పసుపు ఆహార పదార్థాలను దానం చేయండి. సింహం (Leo):వ్యాపార విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పష్టమైన ఆలోచనతో వ్యవహరించాలి. చాలా సమస్యలను సులువుగా, త్వరగా పరిష్కరిస్తుంది. పైకి ఎదగడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేయండి. అనవసరమైన పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. అలా చేయడం వల్ల డబ్బు నష్టం వాటిల్లుతుంది. అదే సమయంలో మీకు వచ్చే అవకాశాలను కోల్పోవచ్చు. పరిహారం: శివునికి నీటిని సమర్పించండి. కన్య (Virgo):ఆర్థిక విషయాల్లో ఈ రోజు అదృష్టవంతులు. ప్రారంభించిన వ్యాపారం విస్తరిస్తుంది. వనరులను పెంచడం ద్వారా మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవాలి. పని ప్రదేశంలో దొంగతనం జరిగే అవకాశం ఉంది. మీరు ఆన్‌లైన్ మోసానికి గురికావచ్చు. పరిహారం: భైరవ దేవాలయంలో కొబ్బరికాయ సమర్పించండి. తుల (Libra):పనుల్లో విజయం సాధించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. స్వీయ చర్చలు పెరగవచ్చు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సానుకూల శక్తి ఉంటుంది. పరిహారం: శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. వృశ్చికం (Scorpio):ఆఫీసులో చాలా శ్రమ ఉంటుంది. దాని ఫలితాలు భవిష్యత్తులో పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. పాత వ్యాధి నుంచి బయటపడవచ్చు. మీతో ఏదైనా వివాదం తీవ్రమవుతుంది. పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. ధనస్సు (Sagittarius):చిన్న వ్యాపారులకు మంచి రోజు, మంచి ఒప్పందాలు లభిస్తాయి. మరోవైపు ఉద్యోగస్తులకు సమయం అనుకూలంగా ఉండదు, ఆర్థిక నష్టం ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. తెలివిగా ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వండి. పరిహారం: ఓం నమః శివాయ 108 సార్లు జపించండి. మకరం (Capricorn):సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. ఖర్చు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి, అనుకోని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి విషయం ఏమిటంటే కుటుంబం నుంచి సపోర్ట్‌ ఉంటుంది. పరిహారం: రామ మందిరంలో కూర్చుని రామరక్షా స్తోత్రాన్ని పఠించండి. కుంభం (Aquarius):అందరినీ వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నించండి. మార్పు గురించి ఆందోళన ఉండవచ్చు. సోదరుల మధ్య ఏదో విషయంలో టెన్షన్ పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును సులభంగా తిరిగి పొందవచ్చు. పరిహారం: ఆంజనేయస్వామికి నేతి దీపం వెలిగించండి, హనుమాన్ చాలీసా పఠించండి. మీనం (Pisces):వ్యాపార ఒప్పందాల్లో లాభాలు గడిస్తారు. ఆగిపోయిన ధనం లభించినందుకు సంతోషిస్తారు. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ఒకేసారి రెండు పనులు చేయవద్దు. కుటుంబంలో వేడుకల వాతావరణం ఉంటుంది. పరిహారం: ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Peanut Chikki: ఎంతో ఈజీగా పల్లి పట్టిని తయారు చేసుకోండి ఇలా..!

Peanut Chikki Recipe: పల్లి పట్టి చిన్న పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఆహారం. ఇది భారతదేశంలో ఎంతో పేరు పొందిన స్నాక్‌. అయితే వీటిని మనం ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా మనం తెలుసుకుందాం.