టీ షర్ట్‌పై మీ బొమ్మ కావాలా? జస్ట్ 10 నిమిషాల్లో ప్రింట్ వేసిస్తారు
బర్త్ డే , అలాగే మ్యారేజస్, పుట్టినరోజు వేడుకలకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మంచి గిఫ్ట్స్ వినూత్న రీతిలో డిజైన్చేసి ఇస్తున్నారు. ఫ్యామిలీ ఫొటో ఆల్బమ్ డిజైన్చేయడం నుండి మనం టీ, కాఫీ తాగే కప్ పై ఫొటోస్ వేయడం టీ షర్ట్స్ పైన ఫొటోస్ వేయడం కీ చైన్స్ పైన మనకు నచ్చిన ఫొటోస్ ఇవ్వడం ఇలా ఏ వస్తువు అయితే ఆ వస్తువు పైన ఫొటోస్ వేయడం ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది యువతీ, యువకులు కూడా ఇలాంటివి గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ కూడా అలానే వెలిశాయి. ఇందులో భాగంగా కరీంనగర్‌కు చెందిన శివ అనే వ్యక్తి బహుమతి గిఫ్ట్ గ్యాలరీ షాప్‌తో అనేక విధాలుగా ఫొటోస్ ప్రేమ్స్ మనకు నచ్చిన స్టైల్లో డిజైన్వేసి కరీంనగర్ ప్రజలకు తక్కువ ధరలోనే అందిస్తున్నారు. వీరి దగ్గర టీ కప్పు ప్రింటింగ్, టీ షర్ట్, ప్రింటింగ్ స్వయంగా సొంత మిషనరీ పైన వేసి పదే పది నిమిషాల్లో కస్టమర్‌కు అందిస్తున్నారు. వీరి దగ్గర రూపాయలు 100 నుండి మొదలుకొని 3000 రూపాయల వరకు అతి తక్కువ ఖర్చుతో కరీంనగర్ లో ఎవరు ఇవ్వని ధరలకు వీటిని ఇస్తున్నారు. కస్టమ్మర్స్ అభిరుచులకు తగ్గట్టు వివిధ డిజైన్లలో ఫోటో పెయింటింగ్ చేసి తక్కువ సమయంలోనే వారికి అందిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ బహుమతి గిఫ్ట్ ఆర్టికల్ నడుపుతున్నామని కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల వారికి తక్కువ ధరలకే ఈ సౌకర్యాలు అందించాలని, మేము స్వయంగా అన్ని మిషనరీలు తెచ్చుకొని మేమే ప్రింట్ చేసి తక్కువ సమయంలో ఇస్తున్నామని బహుమతి గిఫ్ట్ ఆర్టికల్ నిర్వాహకులు శివ లోకల్ 18 కు తెలిపారు. కాలేజీ ఈవెంట్స్, అలాగే పండగలకు మ్యారేజెస్‌కు స్పెషల్ అట్రాక్షన్ కోసం వీరి దగ్గర టీ షర్ట్స్పై ఎక్కువగా ఫోటో ప్రింట్ వేసి ఇస్తున్నారు. ఆన్లైన్లో దొరికే ప్రతి ఫోటో గ్యాలరీ కావచ్చు, అలాగే మగ్ ప్రింటింగ్ కావచ్చు ఏదయినా ఇక్కడ తక్కువ ధరలోనే ఉంటాయట. మీరు మీకు నచ్చిన ఫొటోస్ టీ షర్ట్స్పై వేసుకోవాలనుకుంటున్నారా ఐతే వీరిని సంప్రదించండి.. ఇంకెందుకు లేటు మీకు నచ్చినగర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫెండ్స్, వైఫ్, పిల్లలకు, మంచి గిఫ్ట్ బహుమతి ఇవ్వాలనుకుంటే వీరిని సంప్రదించండి వీళ్ళ అడ్రస్స్ వచ్చేసి బస్టాండ్ టూ గీతబావన్ రోడ్.జోయాలూకాస్ పక్కన కరీంనగర్
2024-04-24T06:00:58Z
Horoscope Today: ఈ రాశి వారు ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది
Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు ఏప్రిల్ 25న గురువారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)ఇంటా బయటా మీ మాటకు ఎదురుండదు. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి,వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ఆదాయం ఆశించినస్థాయిలో పెరుగుతుంది. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. తోబుట్టువులతో ఆస్తివివాదం పరిష్కారం అవు తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలుఏర్పడతాయి. జీవిత భాగస్వామికి ప్రాధాన్యం పెరుగుతుంది. విలాస జీవితం మీదబాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది.ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది.వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామికికెరీర్ పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిల కడగా ముందుకుసాగుతాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలుఏర్పడతాయి. విదేశాల్లో ఉంటున్న పిల్లలు, బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) రోజంతా విజయవంతంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుపూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలు ఆశాజనకంగా, సాను కూలంగా సాగిపోతాయి. ఆదాయ మార్గాలువిస్తరిస్తాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. జీవితభాగస్వామికి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ఆస్తిపాస్తుల విలువపెరిగే అవకాశముంది. గృహ, వాహన యోగాలకు అవకాశముంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీఉండదు. కర్కాటకం (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులుఅనుకూలంగా ఉంటాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ తిప్పట ఉంటాయి.ఉద్యోగాల్లో అధికారులు ఎక్కువగా ఆధార పడతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమఎక్కువగా ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చుల్నితగ్గించుకోవాల్సి ఉంటుంది. మిత్రులు మిమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలువింటారు.. సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఎటువంటిసమస్య లైనా పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవమర్యాదలకు లోటుండదు. ఆకస్మిక ధనలాభా నికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు ఎదురుండదు.వ్యాపారాలు అను కూలంగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవితభాగస్వామి ఉద్యోగపరంగా రాణిస్తారు. బంధుమిత్రుల సహాయంతో ముఖ్యమైనవ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. కన్య (Virgo):(ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)వ్యక్తిగత వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు. కొద్ది ప్రయత్నంతో ఒక వ్యక్తిగతసమస్య పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి.వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.కొన్నిముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కొద్దిగా తిప్పటతప్పకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అవనసర ఖర్చు లతో ఇబ్బందిపడతారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే అవకాశంఉంది. తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. చాలా కాలంగా పూర్తి కాని పనుల్నిపూర్తి చేస్తారు. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ జీవితంప్రోత్సాహకరంగా సాగిపోతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు కూడా ఒకకొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. అనుకోకుండాఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృశ్చికం(Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. అన్ని వైపుల నుంచిఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆదాయంపరవాలేదనిపిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైనవ్యవహారాలు వ్యయ ప్రయాస లతో పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతిసాధిస్తారు. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. కీలక నిర్ణయాల్లో జీవితభాగస్వామిని సంప్రదించడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ధనుస్సు(Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలంగా, లాభసాటిగా సాగిపోతాయి. ఏప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించిసత్ఫలితాలనిస్తాయి. సొంత ఆలోచనల వల్ల ఆశించిన ఫలితాలను సాధిస్తారు.ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశంఉంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు శుభ వార్తలు అందుతాయి. పిల్లలువృద్ధిలోకి వస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా అనుకున్నవి సాధిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగతసమస్యలు కొద్ది ప్రయత్నతో పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లోకొన్ని కీలక మార్పులు చేస్తారు. ఉద్యో గంలో పనిభారం, బరువు బాధ్యతలుపెరుగుతాయి. పెళ్లి సంబంధమైన శుభవార్తలు అందు తాయి. నిరుద్యోగుల ఉద్యోగప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారంఅందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది. కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలనుపంచుకో వాల్సి వస్తుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైనవ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల వాతావరణం ఉత్సాహంగా,అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు అందుకుంటారు. స్వల్పఅనారోగ్య సూచనలున్నాయి. ప్రస్తుతానికి ప్రయా ణాలు చేయకపోవడం మంచిది.విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మీనం(Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) రోజంతా అనుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నవిధంగా పూర్తవుతాయి. మీ ఆలోచనలు, సలహాలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి.వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యాపారాలు లాభాలబాటపడతాయి. జీవిత భాగ స్వామికి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆరోగ్యంమెరుగ్గా ఉంటుంది. విహార యాత్రకు వెళ్లే అవ కాశం ఉంది. దైవ కార్యాల్లోఎక్కువగా పాల్గొంటారు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)
2024-04-24T21:33:04Z
Wash Room Doors: మాల్స్, థియేటర్లలో.. బాత్ రూం డోర్లు కింద గ్యాప్ ఎందుకు ఉంటాయో తెలుసా ?
సినిమా హాలు, షాపింగ్ మాల్, ఆసుపత్రి లేదా ఏదైనా పబ్లిక్ టాయిలెట్‌కి వెళితే, మీరు ఒక విషయం గమనించవచ్చు, టాయిలెట్ తలుపు చిన్నదిగా పైన కింద ఓపెన్‌గా ఉంటుంది. కానీ ఇంట్లో లేదా హోటల్ గదిలో అలా ఉండదు. అయితే సినిమా హాల్ లేదా మాల్స్‌లో టాయిలెట్ తలుపులు ఎందుకు అలాం ఉంటాయో? కారణం తెలుసుకుందాం ఇల్లు లేదా హోటల్ గదిలో టాయిలెట్ లేదా వాష్‌రూమ్ తలుపు పై నుండి క్రిందికి ఉంటుంది. కానీ షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, ఆసుపత్రులు వంటి పబ్లిక్ టాయిలెట్లలో, టాయిలెట్‌కు ఫ్లోర్ వరకు పూర్తి డోర్ ఉండదు, కాబట్టి ఫ్లోర్ వైపు అడుగు భాగం చిన్నగా ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్ దిగువన గ్యాప్ ఉంచడం వల్ల దానిని శుభ్రం చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. టాయిలెట్లోకి ప్రవేశించకుండా నీరు లేదా మురికిని దిగువ నుండి శుభ్రం చేయవచ్చు. దిగువ భాగం క్లోజ్ కాకుండా ఉండటం వల్ల టాయిలెట్‌లోని చెడు వాసనలు కూడా త్వరగా బయటపడతాయి. టాయిలెట్ లోపల ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా శారీరక సమస్య వచ్చినా లేదా కొన్ని కారణాల వల్ల పడిపోయినా, అది క్రింది భాగం నుండి కనిపిస్తుంది. తలుపు పూర్తిగా మూసి ఉంటే లోపల ఏం జరుగుతోందో తెలుసుకోవడం అసాధ్యం. రెండవది, ఈ తలుపును పగలు , రాత్రి నిరంతరం ఉపయోగించడం వల్ల తలుపు యొక్క దిగువ భాగం దెబ్బతినే ప్రమాదం కూడా ఉండదు. అందుకే పబ్లిక్ టాయ్ లెట్స్ తలుపుల్ని ఈ విధంగా తయారు చేస్తారు.
2024-04-24T13:32:11Z