HOROSCOPE TODAY 03 JUNE 2023 ఈరోజు వృషభరాశి వారికి శత్రువుల నుంచి ఇబ్బందులు...! మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...

horoscope today 03 June 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈరోజు మేషం, మిధునంతో సహా నాలుగు రాశుల వారికి ప్రయోజనాలు రానున్నాయి. ఈ రాశిచక్రాల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

horoscope today 03 June 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు వృశ్చికరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో సూర్యుడు, చంద్రుడు కలిసి సంసప్తక యోగాన్ని ఏర్పరచనున్నారు. ఈరోజు ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి అన్ని రంగాల్లో మంచి అవకాశాలొస్తాయి. కన్య రాశి వారు విహారయాత్రకు ప్లాన్ చేయొచ్చు. మీన రాశి విద్యార్థులకు సీనియర్ల నుంచి సహాయం అవసరం అవుతుంది. ఈ సందర్భంగా ఈరోజున మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు పనులన్నీ సజావుగా సాగుతాయి. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. మీరు కుటుంబ సభ్యులందరి అవసరాలను సులభంగా తీర్చగలుగుతారు. ఈరోజు కొంత డబ్బు కూడా ఖర్చు చేస్తారు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు స్నేహితుడికి సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. దీని వల్ల మీ గౌరవం పెరుగుతుంది.

ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు శని దేవుడిని దర్శించుకుని ఆవ నూనెతో దీపం వెలిగించాలి.

June Horoscope 2023 జూన్ మాసంలో కొందరు వ్యక్తుల దశ తిరగనుంది... 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...!

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు శత్రువుల నుంచి కొంత ఇబ్బంది పడొచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా పని చేయాలి. మీ ఇంట్లో వాతావరణం కొంత ఉద్రిక్తంగా మారొచ్చు. మరోవైపు రాజకీయ రంగంలో ఉండే వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దీని వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు మీరు కొన్ని శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 67 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు మీరు అవసరమైన వారికి అన్నం దానం చేయాలి.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించొచ్చు. దీని వల్ల మీరు భవిష్యత్తులో మంచి విజయాన్ని పొందుతారు. సోదరుల సహకారంతో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఈరోజు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఏదైనా ఒప్పందం చేసుకోవాలనుకుంటే, జాగ్రత్తగా అడుగులు ముందుకేయాలి. లేదంటే మీరు భవిష్యత్తులో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు.

ఈరోజు మీకు 87 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు గోమాతకు తొలి రొట్టెని తినిపించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ కుటుంబంలోని తోబుట్టువుల వివాహం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారికి అద్భుతమైన విజయావకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు ఈరోజు కొన్ని మంచి ఆఫర్లను పొందొచ్చు. ఈరోజు మీరు ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి. మీ జీవిత భాగస్వామిని ఎక్కడికైనా ట్రిప్ కోసం తీసుకెళ్లొచ్చు.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు హనుమంతుడిని పూజించి, సుందరకాండ పఠించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ కారణంగా మీ పనులన్నీ విజయవంతంగా మారతాయి. సమాజ మెరుగుదల కోసం కొన్ని పనులు చేస్తారు. ఈరోజు మీ కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ సమయం గడుపుతారు. మీ మనసు మతపరమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో విభేదాలన్నీ తొలగిపోతాయి.

ఈరోజు మీకు 62 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు శని దేవుని గుడిలో మీ సామర్థ్యం దానధర్మాలు చేయాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు సహోద్యోగుల సహాయంతో ఒక ప్రాజెక్టును పూర్తి చేస్తారు. ఈ కారణంగా మీ పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ కుటుంబంలో ఏవైనా కలహాలుంటే పెద్దల జోక్యంతో పరిష్కారమవుతాయి. ఈరోజు ఏదైనా విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు తల్లిదండ్రులతో విహారయాత్రకు ప్లాన్ చేయొచ్చు.

ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు తులసి చెట్టుకు నీరు సమర్పించి, దీపం వెలిగించాలి.

June Born People Secrets జూన్ మాసంలో జన్మించిన వారు త్వరగా ప్రేమలో పడతారా? వీరి లక్షణలు ఎలా ఉంటాయంటే...

తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు కొన్ని సంబంధాల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. బయటి ఆహారం తీసుకోవడం మానుకోవాలి. మీ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చేస్తారు. ఈరోజు సాయంత్రం మీ ఇంటికి అతిథి రావొచ్చు. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో చాలా బిజీగా గడుపుతారు.

ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు శునకానికి రోటీ తినిపించాలి.

వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు శారీరకంగా, మానసికంగా కొంచెం ఇబ్బంది పడొచ్చు. అయితే ధైర్యం కారణంగా మీరు చేసే పనిలో అద్భుతమైన విజయాన్ని పొందుతారు. ఉద్యోగులు ఈరోజ సహోద్యోగుల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఈరోజు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. మీ బంధువుల నుంచి ధనలాభం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో కొంత సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు శని దేవుడికి ఆవాల నూనె, నువ్వులు సమర్పించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. లేదంటే రాబోయే కాలంలో సమస్యలు రావొచ్చు. ఏదైనా సమస్య ఎక్కువైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మరోవైపు ఈరోజు భవిష్యత్తు కోసం కొంత డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీ పనులు కొన్ని అసంపూర్తిగా ఉంటాయి. అయితే మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉపాధి కోసం ప్రయత్నించే వారికి ఈరోజు అద్భుతమైన అవకాశాలొస్తాయి.

ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు జీవితంలో కొన్ని పెద్ద మార్పులు ఉండొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో కొంత సమయం కష్టంగా గడపొచ్చు. కెరీర్ పరంగా కొన్ని శుభవార్తలు వింటారు. విదేశీ సంబంధిత వ్యాపారం చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. మీకు బంధువుల నుంచి కొంత వివాదం ఉండొచ్చు. మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి పొందుతారు.

ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు హనుమంతుడితో పాటు శని దేవుడిని ఆరాధించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు తమ మనసుకు నచ్చిన పనిని చేస్తారు. మీరు మంచి విజయాలను సాధిస్తారు. వ్యాపారులు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామిపై కొంత నిఘా ఉంచాలి. మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవచ్చు.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు హనుమాన్ చాలీసా పఠించి, 5 మల్లెపువ్వుల నూనె దీపాలు వెలిగించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఏదో ఒక విషయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు ఈరోజు ఊహించినంత లాభాలను అందుకోలేక పోవడం వల్ల మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో తమ మాటతీరు, ప్రవర్తన రెండింటిపై సంయమనం పాటించాల్సి ఉంటుంది. విద్యార్థులకు సీనియర్ల సహాయం అవసరం అవుతుంది. మీ కుటుంబ సభ్యులతో సాయంత్రం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు శని దేవుని ఆలయంలో దానం చేయాలి.

గమనిక :

ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Read

Latest Astrology News

and

Telugu News

2023-06-02T18:34:05Z dg43tfdfdgfd