UV CREATIONS | యువీ క్రియేషన్స్ విడిపోయిందా.. తెర వెనుక అసలు నిజాలు ఇవే..!

UV Creations | పదేండ్ల కింద తన స్నేహితులు వంశీ, ప్రమోద్, విక్కీ కోసం ప్రభాస్ ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్. ఈ పదేండ్లలో వాళ్ళు ఎన్నో సినిమాలు నిర్మించారు. అందులో కొన్ని సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. 2013లో కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాతో ఈ బ్యానర్ ప్రారంభమైంది. ఆ తర్వాత మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, ఎక్స్‌ప్రెస్‌ రాజా, భాగమతి లాంటి అద్భుతమైన సినిమాలను ఈ బ్యానర్ అందించింది. అలాగే యూవీ కాన్సెప్ట్స్‌ పేరుతో మరో బ్యానర్ మొదలు పెట్టి చిన్న సినిమాలను కూడా నిర్మించారు. అందులో కూడా ఏక్ మినీ కథ లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి.

ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి ఆదిపురుష్‌తో పాటు అనుష్క శెట్టి నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా వస్తుంది. అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్న సమయంలో యువీ క్రియేషన్స్ లో ఉన్న విక్కీ.. సడన్‌గా రామ్ చరణ్‌తో కలిసి వి మెగా పిక్చర్స్ అనే మరో బ్యానర్ మొదలు పెట్టడంతో అసలు సమస్య మొదలైంది. వంశీ, ప్రమోద్, విక్కీ మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలు వచ్చాయని.. అందుకే విక్కీ సొంతంగా తన స్నేహితుడు చరణ్ తో కలిసి మరో బ్యానర్ మొదలుపెట్టారు అంటూ వార్తలు మొదలయ్యాయి. దానికి తోడు గతంలో మాదిరి యువీ క్రియేషన్స్ నుంచి వరుస సినిమాలు రాకపోవడంతో వాళ్లు కూడా యాక్టివ్‌గా లేరనే ప్రచారం జోరందుకుంది.

అన్నింటికీ మించి ఆదిపురుష్ సినిమా తెలుగు రైట్స్ యువీ క్రియేషన్స్ కాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ప్రభాస్ దగ్గరుండి ఇప్పించాడు. దాంతో నిజంగానే ఈ బ్యానర్ లో గొడవలు మొదలయ్యాయని.. యువీ క్రియేషన్స్ రెండుగా చీలిపోయిందనే ప్రచారం మరింత ఎక్కువైంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని.. ఇప్పటికీ వాళ్లందరూ కలిసే ఉన్నారని.. కేవలం బిజినెస్ యాంగిల్ లోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ప్రభాస్ సినిమా హక్కులు ఇచ్చారు అని తెలుస్తోంది. ఆదిపురుష్ తెలుగు రైట్స్ 175 కోట్లకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అక్కడ ఏదైనా తేడా జరిగితే వెంటనే వాళ్లకు మరొక సినిమా చేయడానికి ప్రభాస్‌కు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక రామ్ చరణ్‌తో వి మెగా పిక్చర్స్ మొదలు పెట్టడం కూడా విక్కీ సొంత నిర్ణయమే తప్ప.. యూవీ క్రియేషన్స్ పై అది ఎలాంటి ప్రభావం చూపించబోదని.. ఎప్పటికీ వాళ్లంతా ఒకటే అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.

Read More :

Al Pacino | 29 ఏళ్ల ప్రేయసితో.. నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్న 83 ఏళ్ల స్టార్‌ నటుడు

2023-05-31T06:07:21Z dg43tfdfdgfd