ముఖంపై మచ్చలు ఉన్నాయా.. ఇలా చేయండి..

ముఖంపై మచ్చలు ఉంటే చూడ్డానికి అంత బాగోదు. ఈ సమస్యని తగ్గించేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో తెలుసుకోండి.

ముఖంపై నల్ల మచ్చలు అందాన్ని పాడు చేస్తాయి. చూడ్డానికి అంత బాగోవు. వయసు పెరిగే కొద్దీ కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో పాటు సన్ టాన్. ఇలా ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. వీటిని సహజంగా దూరం చేసేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో నారింజ పండ్లతో కూడా సమస్యని దూరం చేసుకోవచ్చు. అదెలానో చూద్దాం.

​ఆరెంజెస్‌తో బెనిఫిట్స్..

నారింజ పండ్లు ఆరోగ్యానికే కాదు. అందానికి కూడా చాలా మంచిది. మెరిసే చర్మాన్ని అందించడంలో దీనిలోని విటమిన్ సి చాలా బాగా పనిచేస్తుంది. చర్మంపై మృతకణాలను కాంతివంతంగా మార్చేందుకు హెల్ప్ చేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సాయపడే ఫేస్ మాస్క్. నారింజ, నారింజ తొక్కలు ముఖంపై బ్లీచింగ్‌లా పనిచేస్తాయి. దీనిని తేనె, చక్కెరతో కలిపి అప్లై చేస్తే స్కిన్‌ని అందంగా చేస్తుంది.

97765083

చక్కెర..

చక్కెరని వాడడం వల్ల సన్ బర్న్ వంటి చర్మ సమస్యలు, వడదెబ్బ, పిగ్మంటేషన్, నల్ల మచ్చల్ని తొలగిస్తుంది.

డెడ్ స్కిన్ సెల్స్‌ని స్టిమ్యులేట్ చేసి ముఖంపై మురికిని, దుమ్ముని దూరం చేసేందుకు ఇది సాయపడుతుంది. అదే విధంగా చర్మ రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది. మొటిమల్ని దూరం చేస్తుంది.

Also Read : Lipstick : లిప్‌స్టిక్ ఇలా పెడితే ఎక్కువసేపు ఉంటుందట..

తేనె..

తేనె ఆరోగ్యంతో పాటు అందానికి కూడా మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే తేనె ముఖంపై ముడతల్ని తగ్గించి ముఖాన్ని యవ్వనంగా మార్చుతుంది. ముఖానికి మంచి మాయిశ్చరైజర్ ఇది. దీనిని వాడడం వల్ల డార్క్ స్పాట్స్‌ని పోగొట్టి, ముఖాన్ని కాంతి వంతంగా మార్చేందుకు బాగా హెల్ప్ చేస్తుంది. తేనెను ముఖంపై రాయొచ్చు. ఫేస్‌ప్యాక్‌లా వాడొచ్చు.

Also Read : Pre bridal skin care : పెళ్ళిలో మీ స్కిన్ నేచురల్‌గానే మెరవాలంటే ఇలా చేయండి..

నల్లటి మచ్చలు..

ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు పోగొట్టేందుకు ఆరెంజ్‌ని సగానికి కట్ చేసి చక్కెరలో డిప్ చేయండి. దానిపై కొద్దిగా తేనె అద్దండి. ముఖాన్ని క్లీన్ చేసి నారింజని సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత మీరు దీనిని చర్మంపై నల్లగా ఉన్న ఏ ప్రాంతంలో అయినా అప్లై చేయొచ్చు. మెల్లిగా మసాజ్ చేసి 10 నిమిషాల తర్వాత కడగాలి. నల్లని మచ్చలు పోగొట్టేందుకు ఇది బాగా పనిచేస్తుంది.

గమనిక:

నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

​​​​​​Read More :

Beauty News

and

Telugu News

2023-05-26T05:58:09Z dg43tfdfdgfd