ఎసిడిటీ ఉన్నవారు పుచ్చకాయ జ్యూస్ ను తాగితే..!

ఎండాకాలంలో తినడానికి పర్ఫెక్ట్ పండు ఏదైనా ఉందా అంటే అది పుచ్చకాయే. ఎందుకంటే ఈ పండు మనల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దాహాన్ని తగ్గిస్తుంది. హెల్తీగా ఉంచుతుంది. అంతేకాదు..

 

పుచ్చకాయ ఒక్క ఎండాకాలంలోనే లభిస్తుంది. అందుకే ఇది ప్రసిద్ధ వేసవి పండుగా పరిగణించబడుతుంది. నిజానికి ఈ పండు చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తిన్నా, జ్యూస్ గా చేసుకుని తాగినా మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ పుచ్చకాయ పొట్టకు కూడా మంచిదని చాలా మందికి తెలియదు. ఇది మూత్ర మార్గాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే పుచ్చకాయ జ్యూస్ ఎసిడిటీ సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఎసిడిటీ ఉన్నవారు పుచ్చకాయ జ్యూస్ ను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

యాసిడ్ రిఫ్లక్స్ ను తగ్గిస్తుంది

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ మొదటి లక్షణాలలో యాసిడ్ రిఫ్లెక్స్ ఒకటి. అన్నవాహిక అడుగు భాగంలో ఉన్న స్పింక్టర్ సరిగ్గా పనిచేయనప్పుడు, అలాగే కడుపు నుంచి ద్రవం అన్నవాహికలోకి ప్రవేశించడానికి వీలులేనప్పుడు ఇది వస్తుంది. దీనివల్ల పుల్లని త్రేన్పులు, కడుపు మంటతో పాటుగా ఇతర సమస్యలు కూడా వస్తాయి. అయితే ఇలాంటి సమయంలో పుచ్చకాయ జ్యూస్ ను తాగడం వల్ల ఈ లక్షణాలు తగ్గుతాయి. అలాగే ఆహారం కూడా జీర్ణమవుతుంది.

 

పొటాషియం ఎక్కువగా ఉంటుంది

పొటాషియం ఎక్కువగా ఉండే పుచ్చకాయ రసం కడుపు ఆమ్లాన్ని తటస్తం చేయడానికి సహాయపడుతుంది. ఇది జీవక్రియ రేటును బాగా పెంచుతుంది. ఆ తర్వాత ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి ఎసిడిటీ ఉంటే ఈ జ్యూస్ లో కొద్దిగా బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి తాగండి.

మూత్రవిసర్జన

పుచ్చకాయ రసం మూత్రవిసర్జనగా కూడా పనిచేస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా పనిచేస్తుంది. పుచ్చకాయ జ్యూస్ మూత్రపిండాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. పుచ్చకాయ జ్యూస్ టాక్సిన్స్ ను బయటకు పంపడానికి అద్బుతంగా సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇది ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. ఆమ్లతను తగ్గించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

2023-06-03T01:49:02Z dg43tfdfdgfd