భారతదేశంలో చాలామంది ప్రధాన ఆహారం వరి అన్నం. అయితే కార్బొహైడ్రేట్లు, గంజి (స్టార్చ్) ఎక్కువగా ఉండటం వల్ల అన్నం తినకూడదని తీర్మానించుకుంటారు. కానీ, మితంగా తింటే అన్నం కూడా అమృత సమానం అంటున్నారు పోషకాహార నిపుణులు. అన్నాన్ని రుచికరంగా వండుకోవచ్చు కూడా..
పులియబెట్టిన అన్నం
అన్నాన్ని పులియబెట్టడం వల్ల అందులో పొట్టకు మేలుచేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. పులియబెట్టిన అన్నాన్ని ఇడ్లీ, దోశలుగా చేసుకోవచ్చు. పెరుగు కలుపుకొని తినొచ్చు. వివిధ కూరగాయలతోపాటు రాత్రంతా పులియబెట్టుకుని పొద్దున్నే ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
బీన్స్, బఠాణీ పులావ్
బఠాణీలు, బీన్స్‌లో తేలికగా జీర్ణమయ్యే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయులను మెరుగుపరుస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అన్నంతో బీన్స్, బఠాణీలను మేళవిస్తే కార్బొహైడ్రేట్లకు ప్రొటీన్లు తోడవుతాయి. అంతేకాదు శరీరానికి అవసరమైన తొమ్మిది అత్యవసర అమైనో ఆమ్లాలు కూడా అందుతాయి. ఇంట్లో చేసిన నెయ్యితో వండుకుంటే బీన్స్, బఠాణీ పులావ్ మరింత ఆరోగ్యకరం. ఇది అన్నం పోషక విలువను పెంచి శరీరంలో
ైగ్లెసిమిక్ ఇండెక్స్‌ను మెరుగుపరుస్తుంది.
చేపలు, చికెన్, కూరగాయలతో
పళ్లెంలో పావు భాగం అన్నం, సగం భాగం ఉడికించిన పాలకూర, మిగిలిన పావుభాగం గ్రిల్డ్ చేపలు లేదంటే చికెన్ చేర్చుకున్నా మంచిదే. ఎన్నో పోషక పదార్థాలతో సమృద్ధమైన ఈ అన్నం తృప్తిగా తినేందుకు నాలుకను నిలవనీయదు.
వన్ పాట్ మీల్స్
కందులు, శనగలు, పెసర్లు పోషకాలతో సమృద్ధమై ఉంటాయి. వీటిలో ఏ పప్పుధాన్యాన్ని అయినా అన్నంతో కలుపుకొని తినొచ్చు. పప్పుల్లో ఉండే ప్రొటీన్లు చాలాసేపటి వరకు కడుపు నిండిన భావనలో ఉంచేస్తాయి. ఈ వంటకం డయాబెటిస్, గుండెరోగులకు కూడా మంచిదే.
2023-03-27T19:00:39Z dg43tfdfdgfd