ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వాడొద్దు అన్నందుకు భర్తను వదిలేసి వెళ్లిన భార్య - ఇదేం గొడవరా బాబు

Newly Married Woman: 

బిహార్‌లో ఘటన..

బిహార్‌లోని హాజీపూర్‌లో కొత్తగా పెళ్లైన జంటను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ విడదీశాయి. సోషల్ మీడియా విషయంలో వచ్చిన గొడవతో మహిళ..తన భర్తను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. 15 రోజుల క్రితమే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే ఇలా విడిపోవాల్సి వచ్చింది. అంతే కాదు. ఆ మహిళ తన అన్నను రెచ్చగొట్టి భర్త మీదకు పంపింది. ఆ వ్యక్తి గన్ పట్టుకుని వచ్చి మరీ బావను బెదిరించాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాక కానీ అసలు విషయం బయటపడలేదు. కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా గంటల కొద్ది ఫోన్ పట్టుకుని కూర్చుంటోందని అత్తమామలు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కి అడిక్ట్ అయిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భార్య, భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ మహిళ అంతటితో ఆగకుండా ఇంట్లో వాళ్లకు చెప్పడం, వాళ్లు వచ్చి దాడి చేయడం వల్ల వివాదం కాస్త ముదిరింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వచ్చి ఆ గొడవకు చెక్ పెట్టారు. కొత్త పెళ్లి కూతురు సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే...అటు అమ్మాయి తరపున బంధువులు మాత్రం తమ వాదన వినిపిస్తున్నారు. అత్తమామలు అమ్మాయి ఫోన్ లాక్కున్నారని, కనీసం తమతో మాట్లాడటానికి కూడా అనుమతించడం లేదని ఆరోపించారు. చివరకు పోలీసుల జోక్యంతో కొంత వరకూ వివాదం సద్దుమణిగింది. ఆ అమ్మాయి మాత్రం అత్తమామలతో కలిసి ఉండేందుకు అంగీకరించలేదు. అంతే కాదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాడకుండా ఉండలేనని తేల్చి చెప్పింది. రాజీ కుదరక...ఆ అమ్మాయి తల్లిగారింటికి వెళ్లిపోయింది. 

2023-06-01T08:19:55Z dg43tfdfdgfd