జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

Horoscope Today 3rd June 2023: జూన్ 3 శనివారం మీ రాశిఫలితాలు

మేష రాశి

మేష రాశి వారు ఈరోజు అనుకున్నదానికంటే ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. మీకు తప్పుడు సలహా ఇచ్చే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. రాజకీయ సమస్యలపై చర్చలకు దూరంగా ఉండండి. కొందరు వ్యక్తులు మీ బలహీనతను తప్పుగా ఉపయోగించుకోవచ్చు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.

వృషభ రాశి

వృషభ రాశికి చెందిన వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా బాగుంటుంది. శుభ కార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచిసహకారం లభిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే కెరీర్లో మరో అడుగు ముందుకేస్తారు

మిధున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఈ రాశి విద్యార్థులు చదువులో మంచి విజయం సాధించగలరు. అనుకున్న పనులన్న నెరవేరుతాయి. గృహ జీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల సలహాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆశక్తి ఉంటుంది. 

Also Read: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ఈ రోజు ఆధ్యాక్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. కార్యాలయంలోని సీనియర్లు మిమ్మల్ని అభినందిస్తారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందగలరు. ప్రయాణాన్ని చాలా ఆనందిస్తారు. స్నేహితులను కలుస్తారు.

సింహ రాశి

సింహ రాశి వారు ఈరోజు కొంత విసుగ్గా ఉంటారు. పాత విషయాలను ఎక్కువగా ఆలోచిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే   అనుభవజ్ఞుల సలహా తీసుకున్న తర్వాతే చేయడం మంచిది.  కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించండి. 

కన్యా రాశి

కన్యా రాశి వారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఇంట్లో ప్రశాంతవాతావరణం ఉంటుంది.  వ్యాపారంలో మీ నైపుణ్యాలను ప్రదర్శించండి. ప్రభుత్వ ఉద్యోగులకు రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లల ప్రవర్తన మీలో సంతోషాన్ని పెంచుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. 

తులా రాశి

తులా రాశివారు ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన పనుల్లో నిమగ్నమై ఉంటారు. వాతావరణంలో మార్పులవల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. రోజంతా బిజీగా ఉంటారు. భూమి-ఆస్తి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. స్నేహితులు , బంధువులతో సత్సంబంధాలు కొనసాగించండి. మీ ప్రవర్తనను మెరుగుపరచడానికి ప్రయత్నించండి. 

Also Read: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు ఈరోజు అనుభవజ్ఞుల సలహాలను సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సంబంధాలు బలపడతాయి. మీరు విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీరు విజయం పొందవచ్చు. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా ​​ఉంటుంది. 

ధనుస్సు రాశి

ఈ రాశికి చెందిన ఎగుమతి-దిగుమతి వ్యాపారులు చేసేవారు అద్భుతమైన లాభాలను పొందుతారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచండి. అధిక పనిభారం వల్ల కొంత సమస్య ఉంటుంది. విదేశాల్లో పనిచేసే వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు చదువులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మకర రాశి

మకర రాశి వారు ఈరోజు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బావుంటాయి. మీలో విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. ప్రేమ జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కొత్త పథకాలలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. 

కుంభ రాశి

కుంభరాశివారు ఈ రోజు మీ మనసు చెప్పింది వినండి. పెండింగ్ పనులు పూర్తిచేసేందకు ప్రయత్నించండి. మీ ప్రవర్తనలో సంయమనం ఉండేలా చూసుకోండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే ఉత్సాహం ఉంటుంది. సీనియర్ సభ్యుల సలహాలు పాటించండి.

మీన రాశి

మీనరాశివారికి తమ పిల్లల భవిష్యత్తు గురించి కొంత ఆందోళన ఉండవచ్చు. అధిక పని కారణంగా కొంచెం చికాకుగా ఉంటుంది. మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి. వివాదాస్పద అంశాలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. 

2023-06-03T00:20:33Z dg43tfdfdgfd