BENEFITS OF CUTTING OUT SUGAR: వారం రోజులు చక్కెర తినడం మానేస్తే.. ఈ అద్భుతాలు జరుగుతాయ్..!

​Benefits Of Cutting Out Sugar: చక్కెర అధికంగా తింటే.. తీవ్ర ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని నిపుణుల హెచ్చరిస్తున్నారు. వారం రోజుల పాటు చక్కెర తినకపోతే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి డైటీషియన్‌ మాన్స్‌ వివరించారు.

​Benefits Of Cutting Out Sugar: కొంతమంది తీపి పదార్థాలంటే.. అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. స్వీట్లు, లడ్డులు, చాక్లెట్స్‌.. అన్నింటినీ ఎంతో ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. టీ, కాఫీలలోనూ చక్కెర ఎక్కువగా వేసుకుని ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. అయితే, చక్కెర ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వైట్‌ పాయిజన్‌తో సమానం. చక్కెర అధిక మొత్తంలో తీసుకుంటే.. బరువు పెరుగుతారు. NCBI నివేదిక ప్రకారం, స్వీట్లు ఎక్కువగా తింటే.. అధిక బరువు, గుండె సమస్యలు, డయాబెటిస్‌, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ముప్పును పెంచుతాయి. స్వీట్స్‌ ఎక్కువగా తింటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక వారం రోజులు చక్కెరకు దూరంగా ఉండే.. మన శరీరంలో అద్భుతాలు జరుగుతాయని డైటీషియన్‌ మాన్స్‌ అంటున్నారు. ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యము మెరుగుపడుతుందని అంటున్నారు.

ముఖం వాపు తగ్గుతుంది..

మీకు టోన్డ్‌ ముఖం, షార్ప్‌ జా లైన్‌ కావాలనుకుంటే వెంటనే చక్కెర తినడం మానేయాలని డైటీషియన్‌ మాన్స్‌ అన్నారు. చక్కెర మన శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను పెంచుతుంది దీని కారణంగా ముఖం వాపును పెంచుతుంది. దీని కారణంగా ముఖం ఉబ్బినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. వారం రోజులు చక్కెరకు దూరంగా ఉంటే.. ముఖం ఉబ్బు తగ్గి.. చక్కగా, అందంగా మారుతుంది.

97744642

రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు..

చక్కర తిన్న తర్వాత బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ అమాంతంగా పెరుగుతాయి, అది తగ్గినప్పుడు శరీరంలో శక్తి కూడా అమాంతంగా పడిపోతుంది. మీరు చక్కెరను పూర్తిగా దూరం పెడితే.. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది మన శక్తి, ఫోకస్‌, ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. (image source - pixabay)​

Fish Health Benefits: చేపలు తింటే.. గుండెకు మంచిదా..

స్పష్టమైన చర్మం మీ సొంతం..

చక్కెర అధికంగా తింటే.. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ పెరుగుతుంది. ఇది మొటిమలు, బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌, డార్క్‌ స్పాట్స్‌కు కారణం అవుతుంది. అందుకే షుగర్ ఫ్రీ డైట్ తీసుకుంటే.. ఈ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. మీ చర్మం మచ్చలు, మొటిమలు లేకుండా అద్భుతంగా మారుతుంది.​

ఈ 5 అలవాట్లతో.. మీ లైఫ్‌లోని 80 శాతం సమస్యలు పరిష్కారం అవుతాయ్..!

రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

చక్కెర ఎక్కువగా తీసుకుంటే.. దీర్ఘకాలక ఇన్ఫ్లమేషన్‌కు కారణం అవుతుంది. ఇన్ఫ్లమేషన్‌ కారణంగా రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. మీరు ఇన్ఫెక్షన్లకు, అనారోగ్యాలకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. మీరు చక్కెరకు దూరంగా ఉంటే.. రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి మీకు రక్షణ లభిస్తుంది.

(image source - pixabay)​

Thyroid Issues: థైరాయిడ్‌లో వచ్చే.. 4 సాధారణ సమస్యలు ఇవే..!

కడుపుకు మంచిది..

చాలా వ్యాధులు కడుపు నుంచి ప్రారంభం అవుతాయి. షుగర్ గట్‌లో ఇన్‌ఫ్లమేటరీ ప్రొఫైల్‌ను ప్రోత్సహిస్తుంది. ఇది మైక్రోబయోమ్‌ను దెబ్బతీస్తుంది. చక్కెర కారణంగా.. మంచి బ్యాక్టీరియా మరణించి, చెడు బ్యాక్టీరియా అధికం అవుతుంది. దీని కారణంగా పేగుల ఆరోగ్యం క్షీణిస్తుంది. చక్కెర ఎక్కువగా తీసుకుంటే.. అపానవాయువు, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. మీ డైట్‌లో చక్కెరను స్కిప్‌ చేస్తే ఈ కడుపు ఆరోగ్యంగా ఉంటుంది.

గమనిక:

ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

2023-06-02T05:30:57Z dg43tfdfdgfd