Constipation Treatment At Home: అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తినడం వల్ల చాలా మందిలో పొట్ట సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోతే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల సులభంగా మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం పొదవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు, నెయ్యి సహాయంతో మలబద్ధకానికి చెక్: పాలు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది. అయితే మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ రాత్రిపూట ఒక గ్లాసు పాలలో ఒక చెంచా నెయ్యి కలుపుకుని తాగితే సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే నెయ్యిలో సహజ కొవ్వు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
పాలు, నెయ్యి కలిపి తాగడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు: 1. ఎముకలు దృఢంగా మారుతాయి: ప్రస్తుతం చాలా మందిలో ఎముకలు బలహీనంగా తయారవుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ రాత్రిపూట పాలలో నెయ్యి కలిపి తాగితే..ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా తీవ్ర ఎముకల వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
2. ప్రశాంతమైన నిద్ర కోసం: రాత్రిపూట పాలు, నెయ్యి కలుపుకుని తాగడం వల్ల శరీరం ప్రశాంతంగా మారుతుంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ప్రతి రోజూ ఈ పాలను తాగడం వల్ల 8 గంటల ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఇందులో ఉండే గుణాలు చాలా వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
3. స్టామినా పెరుగుతుంది: స్టామినా పెంచుకోవడం శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నెయ్యి కలిపిన పాలను తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
2023-03-26T09:52:53Z dg43tfdfdgfd