DURGA ASHTAMI 2023: మరో 24 గంటల్లో గ్రహాల 'గొప్ప యాదృచ్చికం'.. ఈ 4 రాశుల వారికి అపారమైన డబ్బు! వ్యాపారంలో లాభం

These 4 Zodiac Signs will get Profit in business due to Durga Ashtami 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... గ్రహాల యొక్క శుభ యోగం మొత్తం 12 రాశి చక్రాల యొక్క స్థానికుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈసారి దుర్గాష్టమి (మహాష్టమి) నాడు అరుదైన గ్రహ కలయిక జరుగుతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 30 సంవత్సరాల తర్వాత చైత్ర నవరాత్రులలో శని తన స్వంత రాశి అయిన కుంభ రాశిలోకి ప్రవేశించింది. అదే సమయంలో 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి తన రాశి చక్రం మీన రాశిలో ఉన్నాడు.

ఈ ప్రత్యేక సందర్భంలో మరికొన్ని గ్రహాల స్థానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దీని కారణంగా మహాష్టమి రోజున కేదార్, హన్స్, మానవీయ మరియు మహాభాగ్య వంటి గొప్ప రాజయోగాల కలయిక ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితిలో ఈ గొప్ప యాదృచ్చికం కొంతమందికి చాలా ఆహ్లాదకరంగా, శుభప్రదంగా ఉంటుంది. ఈసారి చైత్ర మహాష్టమి మార్చి 29న వస్తుంది. ఈ గొప్ప యాదృచ్చికం ఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. 

కర్కాటక రాశి:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి కూడా ఈ రాజయోగం వృత్తి జీవితంలో ప్రయోజనాలను అందిస్తుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం వస్తుంది. కొత్త ఉద్యోగానికి ఇది మంచి సమయం.

మిధున రాశి:

ఈసారి చైత్ర అష్టమి నాడు అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. మిథున రాశి వారికి ఈ సమయం శుభప్రదం మరియు ఫలప్రదంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో పురోగతికి అవకాశం ఉంది. మిధున రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారవేత్తలకు పెద్ద ఒప్పందం రావొచ్చు.

మీన రాశి:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం మీన రాశి వారికి అనేక ప్రయోజనాలను ఇస్తుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులు పెద్ద పదవిని పొందవచ్చు. రాజకీయాల్లో చురుకైన వ్యక్తులు ప్రయోజనాలు పొందుతారు. నిలిచిపోయిన పనులు పూర్తి చేయబడతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి.

కన్యా రాశి:

కన్యా రాశి యొక్క స్థానికులకు గ్రహాల మహా సంయోగం భారీ ప్రయోజనాలను తెస్తుంది. నిరుద్యోగులు ఈ కాలంలో కొత్త ఉద్యోగం పొందవచ్చు. వ్యాపారస్తులు ప్రయాణానికి వెళ్ళవచ్చు. ఈ సమయంలో ప్రయాణం నుంచి శుభ ఫలితాలు లభిస్తాయి. అధిక లాభాలను ఆర్జించడంలో ప్రయోజనం ఉంటుంది. ఈ సమయం పెట్టుబడికి అనుకూలం. విద్యార్థులు గొప్ప విజయాలు సాధిస్తారు.

Also Raed: Horoscope April 2023: 3 రోజుల తర్వాత ఈ రాశి వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్.. ఊహించని ప్రయోజనాలు! ప్రేమకు అంగీకారం   

Also Read: Guru ki Mahadasha: 16 సంవత్సరాల పాటు గురు మహాదశ.. ఈ వ్యక్తులకు డబ్బే డబ్బు! రాజు లాంటి జీవితం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

2023-03-28T09:24:07Z dg43tfdfdgfd