HONEY FOR DIABETES : తేనె తీసుకుంటే షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుందా..

Honey For Diabetes : షుగర్ ఉన్నవారు ఆహారం విషయంలో ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించాకే తినాలి. అదే విధంగా వీరు చక్కెరని అస్సలు తీసుకోకూడదు. మరి దాని బదులు తేనె తీసుకోవచ్చా.. తెలుసుకుందాం.

షుగర్ వచ్చిదంటే చాలా మంది చక్కెరకి దూరంగా ఉంటారు. దీని బదులు వారి స్వీట్స్, టీ వంటి డ్రింక్స్‌లో బెల్లం, తేనె వంటి ఆల్టర్నెటివ్ స్వీటనర్స్ వేసుకుంటారు. అయితే, వీటి వల్ల నిజంగానే వారు హెల్దీగా ఉంటారా.. తేనె తీసుకోవడం షుగర్ పేషెంట్స్‌కి మంచిదేనా.. దీనిని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ పెరగవా. తీసుకుంటే ఎలా తీసుకోవాలి. నిపుణులు ఏం చెబుతున్నారు. పూర్తి వివరాలన్నీ ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

​తేనె పాడైందంటే..

యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా స్డడీ ప్రకారం, తేనె అస్సలు పాడవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. స్వచ్ఛమైన తేనెలో తేమ శాతం ఉండదు. దీని కారణంగా అందులో బ్యాక్టీరియా పెరగదు. ఉండదు. తేనె ఎక్కువకాలం పాడవ్వకుండా ఉండడానికి ఇదే కారణం. అయితే, కొన్నిసార్లు తేనె పాడైనట్లుగా అనిపిస్తుంది. దీనికి కారణం అందులో కల్తీ జరిగిందని చెప్పొచ్చు.

​షుగర్ అనేది..

నేడు డయాబెటిస్ రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. సరైన జీవన శైలి లేని కారణంగా ఇది వస్తుంది. దీనిని కంట్రోల్ చేసుకోవాలంటే మంచి లైఫ్‌స్టైల్‌ని పాటిస్తూ.. సరైన ఆహారాన్ని తీసుకుంటూ, శారీరక శ్రమ చేయాలి.

Also Read : Water Bottles : వాటర్ బాటిల్స్‌లో నీరు తాగుతున్నారా.. ఇలా చేయకపోతే డేంజర్..

​ఎలాంటి ఫుడ్ తినాలి..

డాక్టర్ ప్రియంవద త్యాగి(Consultant - Endocrinology, Max Hospital, Patparganj) ప్రకారం.. ఆహారం మూడు పోషకాలుగా ఉంటాయి. అవి కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, ప్రోటీన్స్. అయితే, షుగర్ కంట్రోల్ అవ్వాలంటే కార్బోహైడ్రేట్స్‌ని కంట్రోల్ చేసుకోవడం ముఖ్యం. షుగర్ ఉన్నవారు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న చక్కెర బదులు తేనె తీసుకోవడం మంచిదని చెబుతారు. మరి దీని గురించి డాక్టర్స్ ఏమంటున్నారంటే..

​తేనె తీసుకోవచ్చా..

తేనె, చక్కెరలోని గుణాలను పరిశీలిస్తే.. చక్కెరలో కంటే తేనెలో గ్లూకోజ్ కంటే ఫ్రక్టోజ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా తేనెలో కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా చక్కెర కంటే ఎక్కువగానే ఉంటుంది. అయితే, తేనె తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే.. ఇది తక్కువ గ్లైసెమిక్ లెవల్స్‌ని కలిగి ఉంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర తక్కువగా పెరుగుతుంది.

​దీంతో పాటు..

అయితే, తక్కువ పరిమాణంలోనే తేనెని తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచిది.

Also Read : Heart Problems in Women : ఆడవారిలో ఈ హార్మోన్ తగ్గితే గుండెపోటు వస్తుందట..

మరిన్ని పరిశోధనలు..

అయితే, చక్కెర బదులు తేనె వాడకంపై మరిన్ని పరిశోధనలు అవసరమని చెబుతున్నారు నిపుణులు. రక్తంలో ఎప్పటికప్పుడు చక్కెర స్థాయిలను అబ్జార్బ్ చేస్తూ తక్కువ మొత్తంలో తేనె తీసుకోవడం మంచిదని డాక్టర్ ప్రియంవద చెబుతున్నారు.

​ఇది ముఖ్యం..

ఆరోగ్యకరమని తేనెని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు డాక్టర్. ఏదైనా సరే ఆరోగ్యకరమైనప్పటికీ వాటిని తక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి మంచిదని ఆమె సూచిస్తున్నారు. దీంతో పాటు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని సూచిస్తున్నారు.

గమనిక:

ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More :

Relationship News

and

Telugu New

2023-03-27T09:02:37Z dg43tfdfdgfd