LIVE IN RELATIONSHIP : పెళ్ళికి ముందే నా బాయ్‌ఫ్రెండ్ కలిసి ఉందామంటున్నాడు..

Live in Relationship : పెళ్ళికి ముందే కలిసి ఉండడాన్నే లివ్ ఇన్ రిలేషన్ షిప్ అంటారు. దీని గురించి ఓ కపుల్ మధ్య చిన్న సమస్య వచ్చింది. అదేంటో తెలుసుకోండి.

ఆమె సమస్య.. హాయ్, నేను గత కొన్ని రోజులుగా ఓ వ్యక్తిని లవ్ చేస్తున్నాను. మేము మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. మేము కాలేజ్ నుంచే లవ్ చేసుకుంటున్నాం. దాదాపు 9 సంవత్సరాల నుంచి ఒకర్నొకరం ఇష్టపడుతున్నాం. నా బాయ్ ఫ్రెండ్‌కి పెళ్ళికి ముందు లివి ఇన్ రిలేషన్‌లో ఉండాలని ఉంది. కానీ, నాకేమో ఇష్టం లేదు. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో జరుగుతున్న కేసులను చూస్తూనే ఉన్నాం.

లివ్ ఇన్ రిలేషన్ టైమ్‌లో తప్పు జరుగుతుందని నాకు భయంగా ఉంది. అందుకే నాకు ఇష్టం లేదు. ఇది అతనికి ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఈ విషయంలో మీరు నాకు హెల్ప్ చేయాలి. విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పండి.

​అతని సమస్య..​

హాయ్ ఇప్పుడు నా ప్రాబ్లమ్ వినండి. నా గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం. తనే నా సర్వసం. ఆమెను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా. అయితే, పెళ్ళికి ముందు తనతో కొన్ని రోజులు లివిన్‌లో ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఇలా పెళ్ళికి ముందు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండి పెళ్ళి చేసుకున్నారు. నేను కూడా తనతో అలానే ఉండాలనుకుంటున్నా. ఇది తనకి చెప్పగానే ఆశ్చర్యపోయింది. తను భయపడుతోంది. నాకు అది నచ్చట్లేదు. దీంతో పెళ్ళి చేసుకోవాలా వద్దని అనిపిస్తోంది. చాలా కన్ఫ్యూజన్‌గా ఉంది. దయచేసి నాకు హెల్ప్ చేయండి.

నిపుణుల సలహా..​

ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఒకర్నొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు వాస్తవాన్ని గమనించాలి. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఆన్‌లైన్ షాపింగ్ కాదు. ఇక్కడ మీరు సరైన విషయాన్ని గమనించాలి. ఆపై అందమైన ఫ్యూచర్‌ని ఊహించాలి.

ఆమె కోసం..

లివ్ ఇన్ అనేది కాస్తా డౌట్‌గా ఉండే వ్యవహారమే. అయితే, మీరు అందులో నెగెటీవ్ మాత్రమే ఎందుకు చూస్తున్నారు. ఈ టైమ్‌లో మీరు మీ బాయ్‌ఫ్రెండ్‌ని మారింత అర్థం చేసుకునే సమయం అనుకోవచ్చు. కలిసి ఉన్నప్పుడు మీలోని మంచి, అతనిలోని మంచి విషయాలను తెలుసుకోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. ఓ సారి తనవైపుగా కూడా ఆలోచించండి. 9 సంవత్సరాల కలయిక కాల పరీక్షకు లొంగదు. కాబట్టి, ముందుగానే లివ్ ఇన్‌లో ఎలాంటి హద్దులు దాటొద్దని తనకి ముందుగానే చెప్పి ఆ నిర్ణయం తీసుకోవచ్చు.

అతని కోసం..

హాయ్..లివ్ ఇన్ అనే రిలేషన్‌ని సమస్యకి పరిష్కారంగా మీరు భావించొద్దు. ఎందుకంటే, రిలేషన్‌లో సమస్యలు అనివార్యం. డిఫరెంట్ మైండ్‌సెట్ ఉన్న ఇద్దరు ఒకేదగ్గర చేరినప్పుడు వారి మధ్య గొడవలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకావం ఉంటుంది. అందుకే మనం నైతికంగా ఆలోచించాలి. లివ్ ఇన్ అనేది మంచిదే అయినప్పటికీ.. దానిని విడిపోవడానికి ఆయుధంగా వాడొద్దు. ఈ విషయంలో మీకు ఎంత ఇష్టం ఉందో.. ఆమెకు అంతే భయం ఉంటుందని గుర్తుంచుకోండి. ఇద్దరి భావాలను గమనించి ముందుకు వెళ్ళడం మంచిదని గుర్తుపెట్టుకోండి. ఆల్‌ ది బెస్ట్.

2023-03-17T14:26:45Z dg43tfdfdgfd