Maskne: కొవిడ్ సమయంలో అందరికీ మాస్క్‌లు(Masks) పరిచయం అయ్యాయి. అంతకు ముందు వీటి వినియోగం చాలా తక్కువ. కరోనా సమయంలో దగ్గు, తుమ్ము, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి వివిధ రకాల మాస్కులను ప్రజలు వాడారు. అయితే వీటిని ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతింటుంది. ఫలితంగా దద్దుర్లు లేదా ‘మాస్క్నే’(Maskne) అనే మొటిమలు ఏర్పడతాయి. ఈ సమస్య నుంచి ఎలా భయటపడాలో వివరిస్తున్నారు బెంగళూరులోని ఆస్టర్ CMI హాస్పిటల్, మెడికల్ & కాస్మెటిక్ డెర్మటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ షిరీన్ ఫుర్టాడో.
* మాస్క్నే అంటే ఏంటి?
ఎక్కువ గంటలు మాస్క్‌లను ఉపయోగించడం, వాటిని తిరిగి ఉపయోగించడం వంటి కారణాలతో మాస్క్నే వస్తుంది. సర్జికల్ మాస్క్‌లను ఒకసారి ఉపయోగించిన తర్వాత పారేయాలి. అయితే కొందరు వ్యక్తులు వాటిని పదే పదే వినియోగిస్తున్నారు. దీని కారణంగా మొటిమలు వస్తాయి. ఉపయోగించిన మాస్క్ గాలిలోని బ్యాక్టీరియాను గ్రహిస్తుంది. ఇలా పాత మాస్క్‌ను తిరిగి ఉపయోగించిన ప్రతిసారీ చర్మంపై ఈ బ్యాక్టీరియా, ఫంగస్ సంఖ్య పెరుగుతుంది. దీర్ఘకాలిక లేదా ఆకస్మిక మొటిమల వంటి చర్మ సమస్యలకు దారితీస్తుంది.
సర్జికల్ మాస్క్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మొటిమలు పెరగడాన్ని మాస్క్నే అంటారు. ఈ మాస్క్‌ల సింథటిక్ పదార్థం జిడ్డు చర్మంపై రుద్దడం వల్ల మాస్క్ చర్మాన్ని తాకే ప్రదేశాలలో మొటిమలు ఏర్పడతాయి.
* మాస్క్నేని ఎలా నివారించవచ్చు?
- మాస్క్ మార్చాలి
ఒకసారి మాస్క్ ఉపయోగించిన తర్వాత దాన్ని మరోసారి వాడకూడదు. చర్మాన్ని మొటిమల నుంచి రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన మాస్క్ ధరించాలి. రోజంతా డిస్పోజబుల్ మాస్క్‌లను మార్చడం వల్ల వాటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. చర్మంపై దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవచ్చు. అదనంగా గుడ్డ లేదా ఫాబ్రిక్ మాస్క్‌లను ఉపయోగిస్తుంటే, వాటిని ప్రతిరోజూ ఉతకాలి. అప్పుడే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
* స్కిన్ కేర్
చర్మం శుభ్రంగా ఉంటే మొటిమల సమస్య చాలావరకు తగ్గుతుంది. అందుకే స్కిన్ కేరింగ్ కోసం సాలిసిలిక్ యాసిడ్ ఉండే సున్నితమైన క్లెన్సర్‌లను రోజుకు రెండుసార్లు ఉపయోగించవచ్చు. ఇది చర్మం సహజ నూనెను కోల్పోకుండా కాపాడుతుంది.
* మచ్చలను తాకొద్దు
మొటిమలు చికాకు కలిగిస్తున్నాయని, చాలా మంది వాటిని తాకడం, గిల్లడం వంటివి చేస్తుంటారు. ముఖాన్ని తాకడం లేదా మొటిమలను తీయడం ద్వారా, అనుకోకుండా మురికి, నూనె, అదనపు బ్యాక్టీరియా చేతుల ద్వారా ముఖంపైకి చేరుతుంది. క్రమంగా రంధ్రాలు మూసుకుపోయి, మొటిమల రూపాన్ని ముదురు రంగులో కనిపించేలా చేస్తుంది. కాబట్టి మొటిమలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలంటే వాటిని తాకకూడదు.
* యాక్నే ప్యాచ్
మొటిమలు లేదా మొటిమల మచ్చలు కాలుష్యం బారిన పడకుండా చూసుకోవాలి. చేతి వేళ్లను కూడా దూరంగా ఉంచాలి. ఇందుకు హైడ్రోకొల్లాయిడ్ ప్యాచ్‌లు ఉపయోగపడతాయి. మొటిమపై అభివృద్ధి చెందిన తెల్లటి ప్రాంతం నుంచి చీము తీయడానికి యాక్నే హీలింగ్ ప్యాచ్‌ను ఉంచవచ్చు. 6-8 గంటల్లో ఫలితాలను చూడవచ్చు.
* నో మేకప్
మొటిమల సమస్య ఉన్న సమయంలో మేకప్‌ను ఉపయోగించకూడదు. మాస్క్‌లతో హెవీ మేకప్ వేసుకోవడం వల్ల చర్మంపై రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఏర్పడతాయి. అందువల్ల ముఖ్యంగా వర్షాకాలంలో ఎలాంటి మేకప్ వేసుకోవద్దు. దీనికి బదులుగా బేసిక్ మాట్ మాయిశ్చరైజర్ లేదా సన్‌స్క్రీన్ బ్లాక్ ఉపయోగించవచ్చు. ముఖాన్ని ఫోమింగ్ ఫేస్‌వాష్ లేదా తేలికపాటి క్లెన్సర్‌తో రోజుకు రెండుసార్లు కడగాలి. ఈ చిట్కాలతో మాస్క్నేని నిర్మూలించడమే కాకుండా, జిడ్డు చర్మం, రంధ్రాలు మూసుకుపోవడం వంటి సమస్యలను అధిగమించవచ్చు.
2023-03-28T08:02:10Z dg43tfdfdgfd