PINK SALT BENEFITS: పింక్ సాల్ట్ అంటే ఏంటి, సాధారణ ఉప్పుతో పోలిస్తే కలిగే 5 ప్రయోజనాలేంటి

Pink Salt Benefits: ఇటీవలి కాలంలో పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ ప్రాధాన్యత పెరుగుతోంది. కారణం ఆరోగ్యపరంగా అత్యధిక ప్రయోజనాలుండటమే. సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్ చాలా రెట్లు మెరుగైంది. అసలు పింక్ సాల్ట్ అంటే ఏంటి, ఎలా తయారౌతుంది, ప్రయోజనాలేంటి..

సేంథా నమక్ లేదా పింక్ సాల్ట్‌ను ఎక్కువగా నవరాత్రుల్లో వినియోగిస్తారు. కానీ ఇటీవలి కాలంలో వంటల్లో, అన్నింటా వినియోగం ఎక్కువౌతోంది. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పింక్ సాల్ట్ అనేది సముద్రం లేదా సరస్సు నీరు ఆవిరైన తరువాత సోడియం క్లోరైడ్ పింక్ రంగు క్రిస్టల్స్‌లా ఏర్పడుతుంది. ఇవి కాకుండా హిమాలయన్ రాక్ సాల్ట్ వంటి ఇతర రకాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం పింక్ సాల్ట్‌ను అనాదిగా వివిధ వైద్య విధానాల్లో ఉపయోగిస్తున్నారు. పింక్ సాల్ట్‌ను సాధారణ దగ్గు, జలుబు, కంటి దృష్టి, జీర్ణక్రియ మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది.

1. పింక్ సాల్ట్‌లో ఐరన్, జింక్, నికెల్, మాంగనీస్ ఇతర మినరల్స్ చాలా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. అయితే ఈ న్యూట్రియంట్లు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.

2. తక్కువ సోడియం ఉండటం వల్ల సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్ శరీరంలో సోడియం స్థాయిని రెగ్యులేట్ చేస్తుంది. ఎందుకంటే సోడియం ఎక్కువైతే ఆరోగ్యానికి ప్రమాదకరం.

3. ఎలక్ట్రోలైట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మజిల్ క్రాంప్స్, నాడీ వ్యవస్థ పనితీరులో ఉపయోగపడుతుంది. అయితే మజిల్ క్రాంప్స్, నాడీ వ్యవస్థ పనితీరులో పింక్ సాల్ట్ వినియోగం, అవసరంపై ఇంకా మరింతగా అధ్యయనం జరగాల్సి ఉంది.

4. ఆయుర్వేదం ప్రకారం పింక్ సాల్ట్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడుతుంది. చర్మాన్ని రిజ్యువనేట్ చేసేందుకు ఉపయోగపడుతుంది.

5. ఆయుర్వేదం ప్రకారం పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ అనేది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. గట్ హెల్త్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడేందుకు, డయేరియా నియంత్రణకు పింక్ సాల్ట్ అద్బుతంగా ఉపయోగపడుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే పింక్ సాల్ట్ అనేది ఆరోగ్యానికి ప్రత్యామ్నాయం. ఇందులో ఉండే న్యూట్రియంట్లు శరీర ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పింక్ సాల్ట్ ప్రయోజనాలు, శాస్త్రీయతపై ఇంకా మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉన్నా..సాధారణ ఉప్పుతో పోలిస్తే మాత్రం మెరుగైనదే. ఆరోగ్యపరంగా అధిక ప్రయోజనాలు కలిగిందే. ఎందుకంటే ఇది సహజసిద్ధంగా ఏర్పడిందే తప్ప ప్రోసెస్ చేసింది కాదు. అయితే ఉప్పు ఎప్పుడూ పరిమితంగానే ఉండాలి. అది పింక్ అయినా సాధారణమైనా. లేకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

Also read: Cholesterol Tips: కాకరకాయ టీ ఏంటని నోరెళ్లబెట్టవద్దు, కొలెస్ట్రాల్ తగ్గించే అద్భుత ఔషధమిది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2023-03-27T05:23:30Z dg43tfdfdgfd