ప్రతి ఒక్కరూ పెళ్ళిలో అందంగా కనిపించాలనుకుంటారు. అందుకోసం ఎన్నో అలంకరణలు కూడా చేసుకుంటారు. అయితే, అందంగా కనిపించేందుకు అలంకరణ మాత్రమే కాదు చర్మం లోపల నుంచి కూడా మెరిసేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది పెళ్ళికి ముందు కొన్ని రోజుల నుంచి చేస్తే మంచి బ్యూటీ మీ సొంతమవుతుంది.
ఎన్ని రోజుల నుంచి..
అయితే, అందంగా కనిపించాలంటే అది ఒకటి రెండ్రోజుల నుంచే కాదు. కనీసం నెలల ముందు నుంచే చేయాలి. అప్పుడే మీ స్కిన్ అందంగా కనిపిస్తుంది. ఎంత ముందు నుంచి కేరింగ్ తీసుకుంటే అంత అందంగా కనిపిస్తారు.
97765461
డైట్..చర్మాన్ని కాపాడుకోవడంలో ఫుడ్ కీ రోల్ పోషిస్తుంది. మంచి ఆహారం తీసుకుంటే బ్యూటీఫుల్ స్కిన్ మీ సొంతమవుతుంది. అందుకే, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్‌తో నిండిన ఫుడ్ తీసుకోవడం మంచిది.
Also Read : Lipstick : లిప్‌స్టిక్ ఇలా పెడితే ఎక్కువసేపు ఉంటుందట..
నీరు తాగడం..
స్కిన్ అందంగా హైడ్రేటెడ్‌గా కనిపించాలంటే కచ్చితంగా 3 లీటర్ల నీరు త్రాగాలి. తగినంత నీరు తాగడం వల్ల స్కిన్ హైడ్రేటెడ్‌గా, అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.
ఒత్తిడి వద్దు..
అదే విధంగా ఒత్తిడి కారణంగా అనేక సమస్యలొస్తాయి. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. దీంతో ఆ ప్రభావం స్కిన్‌పై కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.
సన్ స్క్రీన్..
అదే విదంగా, కచ్చితంగా సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. మీరు బయటికి వెళ్ళినా, ఇంటో ఉన్నా కచ్చితంగా దీనిని అప్లై చేశాకే మిగతా కేర్ తీసుకోండి. దీంతో ముఖం ప్రమాదకరమైన సూర్య కిరణాల నుంచి రక్షణ పొందొచ్చు.
స్క్రబ్..
వారానికి కనీసం రెండు సార్లైనా ముఖాన్ని స్క్రబ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. దీంతో ముఖంపై ఉన్న మృతకణాలు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. అందంగా ఉంటుంది. ఇందుకోసం మీరు ఇంట్లో తయారు చేసిన స్క్రబ్స్ కూడా వాడొచ్చు.
Also Read : Tulsi for Acne : తులసి ఆకులతో ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు మాయం..
నిద్ర..
మంచి నిద్ర కూడా ముఖ్యమే. దీని వల్ల స్కిన్ అందంగా తయారవుతుంది. బౌన్సీగా అవుతుంది. చాలా చర్మ సమస్యలు దూరమయ్యేందుకు నిద్ర హెల్ప్ అవుతుంది. నిద్రలోనే చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఈ టైమ్‌లో స్కిన్ తనని తాను రిపేర్ చేసుకుంటుంది.
గమనిక:
నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More :
and