RAHU-VENUS CONJUNCTION IN ARIES మేషంలో రాహు-శుక్ర గ్రహాల కలయికతో ఈ 3 రాశులకు తిరుగనేదే ఉండదు...!

Rahu-Venus Conjunction in Aries వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారాలు, గ్రహాల సంయోగాలు చాలా కీలకంగా పరిగణించబడతాయి. ఈ నేపథ్యంలో మేష రాశిలో రాహువు-శుక్రుని అరుదైన కలయిక జరిగింది. ఇటీవలే మేషంలోకి ప్రవేశించిన శుక్రుడు రాహువుతో కలిసి సంయోగం చేయడం వల్ల ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ఈ రెండు గ్రహాలు లగ్న స్థానంలో ఉంటే ‘క్రోధ యోగం’ ఏర్పడుతుంది. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు లేవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతేకాదు రాహువు, శుక్రుని కలయిక వల్ల మూడు రాశుల వారికి వివిధ రంగాల్లో పురోగతి లభించనుంది. ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఆ రాశులేవి.. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

1)

ఈ రాశిలో రాహువు-శుక్రుని కలయిక వల్ల మేష రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీకు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మీరు కోరుకున్న ఆదాయం లభిస్తుంది. మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మీ ప్రేమ జీవితం విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Mesha Rasi Ugadi Rasi Phalalu 2023-24 శ్రీ ‘శోభకృత్’ ఏడాదిలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...!

మేష రాశిలో రాహువు-శుక్రుని కలయిక వల్ల మిధున రాశికి మంచి ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ఉద్యోగులకు కార్యాలయంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. ఇంతకుముందు పెట్టుబడి పెట్టిన రంగాల్లో మంచి ఫలితాలొస్తాయి. ఆర్థిక పరంగా మెరుగైన పరిస్థితులు వస్తాయి.

3)

ఈ రాశి వారికి రాహువు-శుక్రుని కలయిక వల్ల అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఆస్తులను పెంచుకుంటారు. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలొస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి.

గమనిక :

ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read

Latest Astrology News

and

Telugu News

2023-03-15T05:58:19Z dg43tfdfdgfd