SATURN REMEDIES 2023: శనితో ఏర్పడిన శక్తివంతమైన యోగం.. ఈ రాశులకు 3 నెలల వరకు ఊహించని డబ్బు, రాజయోగం, పదోన్నతి

Saturn Remedies 2023: ఇవాళ మార్చ్ 18వ తేదీన శనిగ్రహం అద్భుతమైన శుభ సంయోగం ఏర్పర్చనుంది. శని గ్రహాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అద్భుతమైన సమయం. శనిదేవుడు అత్యంత శక్తివంతమైన యోగం ఏర్పరుస్తుండటం వల్ల ఈ మూడు రాశులకు ఊహించని లాభాలుంటాయి. అంతటి అదృష్టవంతులై మూడు రాశులవాళ్లెవెరో తెలుసుకుందాం..

హిందూ జ్యోతిష్యం ప్రకారం శనిని న్యాయదేవతగా పిలుస్తారు. శని ఆగ్రహంగా ఉంటే పెను సమస్యలు ఎదురౌతాయంటారు. ఈ క్రమంలో శనిని ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇవాళ శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు మంచి అవకాశమంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇవాళ అంటే మార్చ్ 18వ తేదీ 2023న శని అత్యంత శక్తివంతమైన శుభ సంయోగం ఏర్పర్చనుంది. అంటే శనిని ప్రసన్నం చేసుకునే అవకాశమిది. ప్రత్యేకించి శనిదోషం నడుస్తున్నవాళ్లకు మంచి అవకాశం. కుండలిలో శనిదోషముండేవారికి కూడా మంచిది. కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. జ్యోతిష్యం ప్రకారం ఈ సమయంలో కర్కాటకం, వృశ్చిక రాశులపై శనిదోషముంది. మకరం, ధనస్సు, కుంభ రాశులపై సాడేసతి ఉంది. 

హిందూ పంచాంగం ప్రకారం ఇవాళ అంటే మార్చ్ 18వ తేదీ శనివారం నాడు చైత్ర కృష్టపక్షం ఏకాదశి తిధి శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం అధిపతి శనిగ్రహం. ఇవాళ శివయోగం ఏర్పడనుంది. మరోవైపు శని తన మూల త్రికోణ రాశి కుంభంలో ఉన్నాడు. అందుకే ఈ శుభ సంయోగం చాలా లాభదాయకంగా  ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశులకు  3 నెలల వరకూ శని కటాక్షం ఉంటుంది. దాంతో ఊహించని ధనలాభం, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి.

మకర రాశి

జ్యోతిష్యం ప్రకారం శని శక్తిమంతుడవడం మకర రాశి జాతకులకు అదృష్టాన్ని మార్చేయనుంది. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. కెరీర్ చాలా బాగుంటుంది.

తులా రాశి

తులారాశి జాతకులకు శని గ్రహం శక్తివంతంగా మారి గోచారం చేయడం అత్యంత శుభసూచకం కానుంది. ఈ జాతకం వారికి రిస్క్‌తో కూడిన పెట్టుబడులు కూడా లాభాల్నిస్తాయి.పెళ్లికానివారికి పెళ్లియోగం ఉంటుంది.

కుంభ రాశి..

శని కుంభరాశిలో శక్తివంతుడిగా గోచారం చేస్తుండటం వల్ల ఈ రాశి జాతకులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. శని కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. శని కుంభరాశిలో ప్రవేశించడం వల్ల కుండలిలో శశ మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఈ జాతకం వారికి గౌరవ మర్యాదలు, డబ్బు, ఉన్నతి అన్నీ లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. పెళ్లికానివారికి ఆ యోగం ఉంటుంది.

Also Read: Saturn Transit 2023: శని గ్రహం శతభిష ప్రవేశం,7 నెలలు ఈ 5 రాశులకు తిరుగుండదు

Also Read: Allu Arjun Telugu Pride : బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతోన్న మెగా, నందమూరి ఫ్యాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

2023-03-18T01:47:58Z dg43tfdfdgfd