SSY: మీ కూతురి కోసం సుకన్య సమృద్ది స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇవి తెలుసుకున్నారా మరి!

SSY: ఆడ పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడావో ప్రచారం చేపట్టింది. అందులో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. కేంద్రం ఆధ్వర్యంలోని ఈ స్కీమ్‌లో ఆడ పిల్లల తల్లిదండ్రులు ఇన్వెస్ట్ చేయవచ్చు. 10 ఏళ్లలోపు ఉన్న బాలికలకు అవకాశం ఉంటుంది. కుమార్తెకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు చేతికి అందుతాయి. ఈ స్కీమ్ ద్వారా అందే డబ్బులను కుమార్తె విద్య, వివాహ ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో 8 శాతం వడ్డీ రేటు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్ వల్ల ఆడ పిల్లలకు మంచి లబ్ది చేకూరుతున్నా.. ఇందులో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని తెలుసుకోవాల్సిన కీలక అంశాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

లాక్ ఇన్ పీరియడ్:

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో 21 ఏళ్ల సుదీర్ఘ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మెచ్యూరిటీ పీరియడ్‌కు ముందు ఇందులో ఇన్వెస్ట్ చేసిన డబ్బును విత్ డ్రా చేసుకోలేరు. అత్యవసర పరిస్థితులు లేదా ఇతర క్లిష్టమైన ఖర్చుల కోసం నిధులు పొందడం సాధ్యం కాకపోవచ్చు. అకాల మరణం వంటి అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే ప్రీ మెచ్యూర్ విత్ డ్రా చేసుకోవచ్చు.

ప్రీమెచ్యూర్ పెనాల్టీ:

సుకన్య సమృద్ది యోజన పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. పెట్టుబడిపై వచ్చే వడ్డీకి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, మెచ్యూరిటీ సమయానికి ముందే డబ్బును తీసుకుంటే ప్రీమెచ్యూర్ పెనాల్టీ చెల్లించాలి. పన్ను ప్రయోజనాలు సైతం కోల్పోతారు. సుకన్య సమృద్ధి యోజన కేవలం ఆడ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. కొడుకు లేదా ఇతర కుటుంబ సభ్యులకు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదు.

లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్:

ఈ పథకంలో కనీసంగా ఏడాదికి రూ.250 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అకౌంట్ తెరిచిన తేదీ నుంచి 15 ఏళ్ల వరకు తల్లిదండ్రులు కనీసం ఏడాదికి మినిమమ్ అమౌంట్ చెల్లించాలి. అకౌంట్ మెచ్యూరిటీ వరకు వడ్డీ లభిస్తుంది.

వడ్డీ రేటు:

సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ స్కీమ్ ఇతర పొదుపు పథకాల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్లు వంటి ఇతర ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లతో పోల్చినప్పుడు రాబడి తక్కువగా ఉంటుంది. అయితే, ఇతర పోస్టాఫీసు స్కీమ్స్‌తో పోలిస్తే ఎక్కువ వడ్డీ లభిస్తోంది.

Read Latest

Business News and Telugu New

100566244

100553918

100569140

2023-06-02T10:17:05Z dg43tfdfdgfd