(Ramesh, News18, East Godavari)
Summer Spot: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత ప్రశాంతమైన నగరంగా పేరుగాంచింది కాకినాడ. కాకినాడ పేరు చెబితే చాలు టక్కున గుర్తొచ్చేది కాకినాడ కాజా. ఇక్కడ దొరికే రుచులు దాదాపుగా ఎక్కడా ఉండవనేది కాకినాడపై అభిమానుల మాట. కాకినాడ నగరంస్మార్ట్ సిటీగా మారిన తర్వాత మరింత అందంగా మారింది. మరోపక్క కాకినాడకు ఆనుకుని ఉన్న బీచ్ ఈ సిటీకి మణిహారమనే చెప్పాలి. కాకినాడ-అచ్చంపేట నుండి కొద్ది దూరం వెళితే వాకలపూడి బీచ్ వస్తుంది. ఇక్కడ బీచ్ దాదాపుగా వైజాగ్ బిచ్‌ను తలపిస్తుందనే చెప్పాలి. విశాఖపట్నం తర్వాత ఆస్థాయిలో బీచ్ ఉన్న ప్రాంతం కాకినాడ అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కూడా దీని అభివృద్ధి పై దృష్టి సారించిందని చెప్పాలి.
గతంలో ప్రభుత్వాలు బీచ్ బాగు చేయడానికి నిధులు వెచ్చించాయి. కొంత మేరకు అభివృద్ధి జరిగినా అది ఎంత కాలమో నిలవలేదు. బీచ్ ఫెస్టివల్ జరిగే మూడు రోజులు తప్పితే అక్కడ పెద్ద హడావుడి జరిగేది కాదు.
కాని ఇప్పుడు బీచ్ సీన్ మొత్తం మారిపోయింది. నిత్యం జనం కిటకిట లాడుతున్నారు. ఉకపక్క వేసవి తాపంతో ఇబ్బందులు పడుతున్నవారికి కాకినాడ బీచ్ ఓ ఏసీలా మారింది. చల్లని గాలి కోసం సాయంత్రం అయితే చాలు బీచ్‌లోకి వెళిపోతున్నారు. సిటీకి అత్యంత దగ్గరగా ఉండటం, పరిసర గ్రామాలకు అందుబాటులో ఉన్న బీచ్‌ను ఆస్వాధీస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఇలా ప్రతీ ఒక్కరూ సముద్రపు గాలిని పీల్చి సేదతీరుతున్నారు. ఇటీవల కాలంలో ఇక్కడ బర్త్‌డే వేడుకలు, విందు , వినోదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.మనశ్శాంతి కోసం వస్తున్నవారందరికి బీచ్‌లో అందాలు విరబూస్తున్నాయి. దూర ప్రాంతాల నుండి సముద్రపు బీచ్ అందుబాటులో లేని పర్యాటకులు ఎక్కువగా కాకినాడ వస్తున్నారు. బీచ్ అందాలతో పాటు, స్మార్ట్ సిటీ అందాలను తిలకించి ఆనందంగా గడుపుతున్నారు.
ఇదీ చదవండి : సొంత ఇలాకాలో మంత్రి కేటీఆర్ కు షాక్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. ఎందుకంటే?
యువత ఎక్కువగా బీచ్‌లోనే గడుపుతుంది. ఇక్కడ అన్ని రకాల చిరుతిళ్లు కూడా దొరకడంతో అమ్మాయిల ఆసక్తి చూపుతున్నారు. చిన్న పిల్లలకు ఆడుకునే బొమ్మలు దగ్గర నుండి అన్ని రకాల బజ్జీలు, తినుబండారాలు ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా బీచ్‌లోఐస్ క్రిమ్ తినే వారికి కూడా ఇక్కడ ఎంతో ఉల్లాసం. ఎందుకంటే అన్ని రకాల ఐస్ క్రీమ్‌లను ఇక్కడ విక్రయిస్తున్నారు. విశాఖపట్నం నుండి నేరుగా కాకినాడ వెళ్లే మార్గంలో సిటీకి చేరుకాకుండా ఉప్పాడ మీదుగా కాకినాడ బీచ్‌కు వెళ్లవచ్చు. రాజమండ్రి నుండి వచ్చే వారు అచ్చంపేట జంక్షన్ వద్ద ఆగి, అక్కడ నుండి వాకలపూడి బీచ్‌కు చేరుకోవచ్చు. నిత్యం ఆటోలు అందుబాటులో ఉంటాయి.
2023-05-24T15:26:44Z dg43tfdfdgfd