SURYA-SHANI GOCHAR 2023: శత్రు గ్రహాల మహా సంచారం.. ఈ రాశుల వారికి ఊహించని డబ్బు!

These 4 zodiac signs will Promotion in Job after Sun and Saturn Transit 2023: వేద జ్యోతిష్యం ప్రకారం మరోకొద్ది రోజుల్లో జూన్ నెల ప్రారంభం కానుంది. జూన్ మాసం చాలా మందికి లాభదాయకంగా ఉంటుంది. అయితే కొంతమందికి ఈ నెలలో ధన నష్టం జరిగే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 15న సూర్యుడు మిథున రాశిలో సంచరించబోతున్నాడు. మరోవైపు జూన్ 17న స్వరాశి కుంభంలో శని తిరోగమనంలో ఉంటుంది. ఒకే మాసంలో సూర్యుడు మరియు శని స్థానాన్ని మార్చడం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మార్పు ఈ 4 రాశుల వారి జీవితాల్లో ప్రత్యేక మార్పు తీసుకురానుంది. ఈ రాశులు ఏవో ఓసారి చూద్దాం. 

మిధున రాశి:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 15న సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచార సమయంలో మిథున రాశి వారికి హోదా, ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. జీతం బాగా పెరిగే అవకాశం ఉంది. అయితే మీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తత పెరుగుతుంది. కాబట్టి జీవిత భాగస్వామితో సమన్వయం చేసుకోండి. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే వేగంగా అభివృద్ధి చెందుతుంది. 

సింహ రాశి:

సూర్యుడు మరియు శని సంచారం ఈ రాశి వారికి శుభ ఫలితాలను తీసుకురానుంది. ఈ సమయంలో సీనియర్ల పూర్తి సహకారం అందుతుంది. అన్ని రకాల ఇబ్బందులు మరియు సమస్యలు తొలగిపోతాయి. అనుకోకుండా ధనలాభం కలిగే అవకాశం ఉంది. మానసికంగా సంతోషం మరియు శాంతి లభిస్తుంది. శుభ కార్యాలలో ధన వ్యయం పెరుగుతుంది. మీ కుటుంబం లేదా దగ్గరి బంధువులతో కలిసి మాంగ్లిక్ కార్యక్రమంలో పాల్గొంటారు.

కన్యా రాశి:

ఈ రాశి వారికి సూర్యుడు మరియు శని సంచారం వలన వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఈ సమయంలో బంధువులతో సమావేశం ఉండవచ్చు. కార్యాలయంలో అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. పనుల్లో బిజీగా ఉంటారు. ఈ సమయంలో కుటుంబంతో కలిసి శుభ యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. కుటుంబంతో మంచి సమన్వయం ఉంటుంది.

 

మకర రాశి:

ఈ సమయంలో మకర రాశి వారికి సూర్యుడు మరియు శని సంచారము వలన ఊహించని విజయాలు లభిస్తాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్ష రాస్తే.. అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన ఏదైనా పని సక్సెస్ అవుతుంది. 

Also Read: Trikone Rajyog: శని శుభ గడియలు మొదలు.. 28 రోజుల తరువాత ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్!   

Also Read: Maruti Suzuki Jimny: ఇండియన్ మార్కెట్లోకి మారుతి సుజుకి జిమ్నీ.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

 

2023-05-24T15:33:37Z dg43tfdfdgfd