TRIGRAHI YOGAM: ఒకే రాశిలో మూడు గ్రహాల 'మహా సంగమం'.. ఈ రాశులకు తిరుగులేనంత ధనం..

Trigrahi Yog In Meen Rashi 2023: గ్రహాల మైత్రి కారణంగా శుభ మరియు అశుభ యోగాలు ఏర్పడతాయి. మార్చి 15న సూర్యభగవానుడు, మార్చి 16న బుధుడు మీనరాశిలోకి ప్రవేశించారు. ఇప్పటికే అదే రాశిలో బృహస్పతి కూర్చుని ఉన్నాడు. దీంతో మీనరాశిలో మూడు పెద్ద కలయిక కలయిక ఏర్పడినట్లయింది. ఈ గ్రహాల సంయోగం వల్ల శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఈయోగం వల్ల ఏ రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 

త్రిగ్రాహి యోగం ఈ రాశులకు వరం

మీనరాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీన రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. మీ లగ్న ఇంట్లో ఈ యోగం రూపొందుతుంది. దీని వల్ల మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో లాభాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి సపోర్టు లభిస్తుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 

వృశ్చికరాశి

ఈ రాశి వారికి కూడా ఈ యోగం అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి యొక్క ఐదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతుంది, దీంతో మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మికత మరియు పరిశోధన రంగానికి సంబంధించిన వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు. కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. పోటీపరీక్షల్లో సక్సెస్ అవుతారు. 

ధనుస్సు రాశి

మీనంలోని త్రిగ్రాహి యోగం ధనస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సంచార జాతకంలో నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Saturn Transit 2023: శని గ్రహం శతభిష ప్రవేశం,7 నెలలు ఈ 5 రాశులకు తిరుగుండదు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2023-03-18T02:48:02Z dg43tfdfdgfd