VASTU TIPS IN TELUGU: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips For compound wall : ఇంటి నిర్మాణం కోసం స్థలం కొన్నతర్వాత ఇంటి నిర్మాణం కన్నా ముందే ప్రహరీ గోడను నిర్మించుకోవడం శుభకరం అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. తూర్పుద్వారం ఉండే స్థలం అయితే ప్రహారీ గోడకు తూర్పు మధ్యనుంచి ఈశాన్య ప్రాంతం వరకూ గోడ కట్టకుండా వదిలేసి ముందు మిగిలిన దిక్కుల్లో నిర్మించాలి. ఇంటి నిర్మాణం పూర్తైన తర్వాత ఈశాన్య ప్రాంతంలో ప్రహరీ, గేట్లు ఏర్పాట్లు పూర్తిచేయాలి.  ముఖ్యంగా  ప్రహారీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అమోఘమైన ఫలితాలు పొందవచ్చంటారు. 

Also Read: వాస్తు ప్రకారం ఈ మూలలు పెరిగిన స్థలాలు అస్సలు కొనకూడదు

ప్రహరీ గోడ నిర్మాణానికి వాస్తు నియమాలివే

  • పశ్చిమ, దక్షిణ ప్రాంత ప్రహరీ గోడలను చాలా ధృడంగా నిర్మించుకోవాలి
  • దక్షిణ, పశ్చిమ గోడలను ఉత్తర, తూర్పు గోడలకన్నా చాలా ఎత్తుగా నిర్మించాలి
  • దక్షిణ, పశ్చిమ ప్రహరీ గోడలు ధృడంగా ఉంటే చాలా వాస్తుదోషాలు తొలగిపోతాయి
  • ప్రహారీ నిర్మాణం వల్ల పరిసర ప్రాంత వాస్తు దోషాలు ఇంటికి తగలవు
  • మీ ఇంటి చుట్టుపక్కలున్న వాస్తు దోషాలను నివారించుకోవడానికి ప్రహారీ గోడ నిర్మాణం మంచి అపాయం
  • మీ ఇంటికి దక్షిణంవైపు పల్లం ఉన్నా, గుంతలున్నా, బావులున్నా దక్షిణ ప్రహారీ గోడను బాగా ధృడంగా, బలంగా నిర్మించుకోవడం వల్ల ఆ దోషాలను హరిస్తాయి
  • ఇంటికి పశ్చిమంవైపు పల్లం, గుంతలు, బావులు ఉంటే పశ్చిమ ప్రహారీ గోడను బాగా ధృడంగా, బలంగా నిర్మించుకోవడం వలన ఆ దోషాలు తొలగిపోతాయి
  • ఈ ప్రహారీ గోడ వల్ల మరో మంచి ఫలితం ఏంటంటే..వీధుపోటు ఉన్న ఇళ్లకు ఈ దోషం నుంచి విముక్తి లభిస్తుంది . వీధిపోటు మంచిదే అయితే పర్వాలేదు కానీ చెడు దిక్కువైపు వీధిపోటు ఉన్నట్టేతే ప్రహరీ నిర్మించడం ద్వారా కొంత ఉపశమనం ఉంటుందంటారు వాస్తు శాస్త్ర నిపుణులు
  • దక్షిణం-పశ్చిమం ప్రాంతాల్లో  ప్రహరీని బాగా ధృడంగా ఎత్తుగా, మందంగా నిర్మించుకోవడం వల్ల గృహస్థుల జీవనము భద్రముగా ఉంటుంది
  • తూర్పు - ఉత్తర ప్రహరీ గోడలను తక్కువ ఎత్తులో నిర్మంచుకోవడం వల్ల ఆదాయము, కీర్తి ప్రతిష్టలు గృహస్థులకు లభిస్తాయి
  • ప్రహరీ గోడ పాతబడి కూలితే  ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మరమ్మత్తులు చేయించుకోవడం మంచిది
  • నైరుతి వైపు ప్రహరీ గోడ కూలితే ఏమాత్రం అశద్ధ చూపించవద్దు. ఆలస్యమైతే ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది
  • నైరుతిలో ప్రహరీ గోడ కూలడం జరగకూడదు..అందుకే నాలుగైదేళ్లకు ఓసారి ప్రహారీ గోడను పరిశీలించి లోపాలను సరిచేసుకోవాలి
  • నైరుతి వైపు ప్రహరీని మరమ్మత్తు చేయించే సమయంలో ఇంట్లో ఎవ్వరూ దూర ప్రయాణాలు చేయడం మంచిదికాదు, ఈతకు వెళ్లడం, పెద్ద పెద్ద భవంతులు ఎక్కడం కూడా అస్సలు మంచిదికాదంటారు పండితులు. ఈ విషయంలో గృహస్తులు అస్సలు నిర్లక్ష్యం చేయరాదు. 
  • ఇంట్లో ద్వారాల కన్నా ప్రహరీ ఎత్తుగా ఉండకూడదు.. అంటే ఇంటి ద్వారం దగ్గర నిలబడితే ప్రహరీ బయట భాగం కనిపించాలి. ఈ విధానం తూర్పు - ఉత్తర ద్వారాలున్న ఇళ్లకు సరిపోతుంది
  • దక్షిణం- పశ్చిమ వీధులన్న ఇళ్లకు ప్రహరీని గృహ ముఖ్య ద్వారంతో సమానంగా కానీ ఎత్తుగా నిర్మించుకున్నా దోషం ఉండదు

    ప్రహరీ నిర్మించేటప్పుడు...ఇంటికి దక్షిణం, పశ్చిమం వైపు తక్కువ స్థలం...తూర్పు, ఉత్తరంవైపు ఎక్కువ స్థలం ఉండేలా చూసుకోవాలి 

Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!

Note: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.

2023-06-02T09:50:17Z dg43tfdfdgfd