ప్యాడ్స్ వాడినప్పుడు దద్దుర్లు వస్తున్నాయా.. ఇలా చేయండి..

పీరియడ్స్ టైమ్‌లో రెగ్యులర్‌గా ప్యాడ్స్ మార్చడం చాలా ముఖ్యం. ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అయితే, ఎప్పుడు మార్చాలో తెలుసుకోవాలి.

పీరియడ్స్ టైమ్‌లో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడతారు. మానసికంగా, శారీరకంగా సమస్యలు ఎదుర్కొంటారు. అందులో ఒకటి శానిటరీ ప్యాడ్స్ వల్ల వచ్చే సమస్య కూడా ఒకటి. ప్యాడ్స్ వాడే వారికి చాలా మంది తొడలు, ఇతర ప్రాంతాల్లో దురద ఉంటుంది. ప్యాడ్స్ వాడడం వల్ల వచ్చే వేడితో దద్దుర్లు కూడా వస్తాయి. ఈ కారణాల వల్ల చాలా మంది శానిటరీ ప్యాడ్స్ నుంచి మెనుస్ట్రువల్ కప్‌కి చేంజ్ అవుతున్నారు.

డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..

శానిటరీ ప్యాడ్స్ వాడినప్పుడు కూర్చోవడం, నడవడం కూడా కష్టంగా మారుతుంది. ప్యాడ్స్ వాడేటప్పుడు ఇబ్బందులు రాకుండా డా. భారతి రమేష్( Senior Consultant - Obstetrician & Gynaecologist, Motherhood Hospitals, Banashankari, Bangalore) కొన్ని సలహాలు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి.

97743686

సరైన ప్యాడ్స్..

అదే విధంగా, ప్యాడ్స్ కూడా మంచివి ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల గాలి ప్రసరణ జరుగుతుంది. తేమని తగ్గించే కాటన్ వంటివి చాలా బాగుంటాయి. అలా కాకుండా సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వాడొద్దు.

ఇన్నర్ వేర్..

అదే విధంగా ఇలాంటి చికాకుని దూరం చేసేందుకు కాటన్ ఇన్నర్ వేర్ వాడొచ్చు. దీని వల్ల చాలా వరకూ సమస్యని తగ్గించుకోవచ్చు.

4 నుంచి 6 గంటలకి ఓ సారి..

సమస్యలు రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా ప్యాడ్స్ మార్చాలి. ఇలా చేస్తే ప్యాడ్స్ వాడినప్పుడు తేమ పెరగదు. ప్రతి 4 నుండి 6 గంటలకు ఓ సారి ప్యాడ్స్ మార్చాలి. ఇది తేమని నిరోధించడంలో సాయపడుతుంది.

పరిశుభ్రంగా..

మైల్డ్, సువాసన లేని సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయండి. దీనిని గట్టిగా స్క్రబ్ చేయొద్దు. దీని వల్ల చికాకు పెరుగుతుంది. గాఢంగా ఉండే సబ్బులు, పర్ఫ్యూమ్స్ ఉత్పత్తులు, చికాకు పెట్టే వైప్స్ వాడొద్దు.

Also Read : ఆ ప్రాంతాన్ని సబ్బుతో క్లీన్ చేస్తున్నారా.. జాగ్రత్త..

​ఆల్టర్నేటివ్..

ప్యాడ్స్ వాడడం వల్ల దద్దుర్లు పెరుగుతుంటే మీరు టాంపాన్స్, మెనుస్ట్రువల్ కప్స్ వంటి ఇతర ప్రోడక్ట్స్‌ని వాడొచ్చు. దీని వల్ల సమస్య తగ్గే అవకాశం ఉంది.

క్రీమ్స్ వాడడం..

ప్యాడ్స్ వాడడం వల్ల వచ్చే సమస్యల్ని తగ్గించేందుకు కొన్ని క్రీమ్స్ దొరుకుతాయి. అందులో జింక్ ఆక్సైడ్, పెట్రోలియం జెల్ వంటివి వాడొచ్చు. దీని వల్ల చికాకు తగ్గుతుంది.

డాక్టర్‌ని కలవడం..

సమస్య అలానే ఉంటే లేదా దురద పెరిగినా, నొప్పిగా ఉన్నా, ఏవైనా ద్రవాలు వచ్చినా వెంటనే డాక్టర్‌ని కలవడం ఉత్తమం. ఆయన మిమ్మల్ని పరీక్షించి అవసరమైన ట్రీట్‌మెంట్‌ని ఇస్తారు.

Also Read : వీటిని తింటే షుగర్, కొలెస్ట్రాల్.. రెండూ కంట్రోల్ అవుతాయట..

మొత్తం స్కిన్ కేర్..

కేవలం వెజినా ప్రాంతంలోనే కాదు. మీరు శరీరాన్ని మొత్తంగా శుభ్రంగా, తేమగా ఉంచాలనుకుంటే సరైన స్కిన్ కేర్ రొటీన్ పాటించాలి. చర్మానికి ఇబ్బంది కలిగించే కెమికల్స్ ఉండే ఉండే ప్రోడక్ట్స్‌ని వాడొద్దు.

ప్రతి ఒక్కరు శరీరం వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి, మీ అవసరాలను బట్టి స్కిన్ కేర్ రొటీన్ వాడండి.

గమనిక:

ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

​​​​​​​Read More :

Health News

and

Telugu News

2023-06-01T03:31:20Z dg43tfdfdgfd