రెటినాల్‌ఎంత మేలు?

చర్మ సంరక్షణలో రెటినాల్‌ ప్రాధాన్యం గురించి చాలా చెబుతుంటారు. అలాంటి క్రీమ్‌లు రాసుకోవచ్చా?

  • ఓ పాఠకురాలు

ప్రాథమికంగా ఇది విటమిన్‌-ఎలోని కొవ్వులో కరిగే పదార్థాల సమూహానికి చెందింది. కణాల పునరుద్ధరణలో ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని రెట్టింపుచేసే సామర్థ్యం ఉంది. ఒంటికి నిగారింపునిచ్చి, అసలు వయసు కనబడకుండా చేస్తుంది. ముడతలు, మచ్చలు మొదలైన వాటిని వేగవంతంగా దూరం చేస్తుంది. క్రీమ్‌, సీరమ్‌ రూపంలో రెటినాల్‌ లభిస్తుంది.

రోజు విడిచి రోజు కానీ, మూడురోజులకు ఒకసారి కానీ వాడొచ్చు. కాకపోతే కొందరికి రెటినాల్‌ పడదు. అలాంటివారు దూరంగా ఉండటమే మంచిది. పూసుకోగానే.. చర్మం కందిపోవడం, ఎర్రబారడం, నల్లబడిపోవడం, ఊడిపోవడం, దురద తదితర దుష్ప్రభావాలు కనిపిస్తాయి. వాడేముందు నిపుణులను సంప్రదించడం మంచిది. గర్భిణులు దూరంగా ఉండటం క్షేమం. మరీ ఎక్కువ కాలం వాడటం కూడా మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి.

– డాక్టర్‌ అనున్యా రెడ్డి ఇ.ఎన్‌.టి సర్జన్‌, ఎలర్జీ స్పెషలిస్ట్‌, ఫేషియల్‌ కాస్మటిక్‌ సర్జన్‌

2023-06-02T22:13:59Z dg43tfdfdgfd