సాయంత్రం పూట గుడ్లను తింటే ఏమౌతుందో తెలుసా?

గుడ్లు సంపూర్ణ ఆహారం. గుడ్డలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి గుడ్లను సాయంత్రం పూట తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. 

గుడ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడుకు ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇకపోతే గుడ్డును తినడానికి సరైన సమయం గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది దీనిని బ్రేక్ ఫాస్ట్ లో తినడం మంచిదని చెప్తుంటారు. అయితే గుడ్డును సాయంత్రం కూడా తినొచ్చు. ఇది కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈరోజు సాయంత్రం పూట గుడ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒత్తిడిని తగ్గిస్తుంది

సాయంత్రం పూట గుడ్లను తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటో తెలుసా? వాటిలో ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ట్రిప్టోఫాన్ మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తుంది. కాబట్టి ఇందుకోసం సాయంత్రం గుడ్లను తినాలి.

 

నిద్రను మెరుగుపరుస్తుంది

నిద్రను మెరుగుపరచడానికి మెలటోనిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మీ నాడీ కణాల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే నిద్రపోవడానికి మీ శరీరాన్ని సంకేతాలనిస్తుంది. వాస్తవానికి మెలటోనిన్ అనేది ఒక హార్మోన్. ఇది శరీర గడియారాన్ని సెట్ చేస్తుంది.  నిద్రలేమి సమస్యను పోగొట్టడానికి సహాయపడుతుంది. 

 

విటమిన్ డి ని పెంచుతుంది

విటమిన్ డి ఎక్కువగా ఉండే గుడ్లు మీ ఎముకలు, మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. సాయంత్రం పూట గుడ్లను తింటే అవి మంచి కొలెస్ట్రాల్ రూపంలో శరీరంలో నిల్వ అవుతాయి. ఉదయాన్నే  మీరు ఎండలో నిలబడితే వెంటనే శరీరం వాటి నుంచి విటమిన్ డిని తయారు చేయడం ప్రారంభిస్తుంది.

 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

సాయంత్రం పూట గుడ్లను తినడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. బరువు తగ్గడానికి ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది. మొదటిది ఇది మీ కడుపు కదలికను వేగవంతం చేస్తుంది. రెండోది దీనిలోని ప్రోటీన్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే రాత్రి భోజనాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇది మీ కండరాలను బలోపేతం చేస్తుంది. హార్మోన్ల పనితీరును కూడా సమతుల్యంగా ఉంచుతుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

2023-06-02T11:03:50Z dg43tfdfdgfd