AKSHAYA TRITIYA 2024 మీ రాశి ప్రకారం, అక్షయ తృతీయ వేళ వీటిని దానం చేస్తే.. మీ ఇంట కనకవర్షం కురుస్తుందట..!

Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ అంటే అందరికీ గుర్తొచ్చేది బంగారంతో పాటు ఖరీదైన వస్తువులే.. వీటినే ఎక్కువగా కొంటూ ఉంటారు. అయితే కేవలం కొనడం వరకే కాదు.. కొన్ని వస్తువులను తప్పనిసరిగా దానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిష్యం ప్రకారం, 12 రాశుల వారు ఏమి దానం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Akshaya Tritiya 2024 హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది వైశాఖ మాసంలో తదియ తిథి వేళ అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీ దేవిని ఆరాధించడం వల్ల తమ కుటుంబంలో సంపద, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో మే 10వ తేదీన శుక్రవారం నాడు అక్షయ తృతీయ పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున చాలా మంది బంగారం, కొత్త ఇల్లు, కొత్త వాహనాలు, ఆస్తికి సంబంధించిన వాటితో పాటు ఎన్నో ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ పర్వదినాన కేవలం విలువైన వస్తువులను కొనడమే కాదు.. కొన్ని రకాల వస్తువులను కూడా దానం చేసి.. సేవా కార్యక్రమాలను సైతం నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి, శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏ రాశి వారు ఎలాంటి వస్తువులను దానం చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...మేష రాశి(Aries)..

ఈ రాశి వారికి అంగారుకుడు(కుజుడు) అధిపతిగా ఉంటాడు. కాబట్టి మేష రాశి వారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున ఎర్రని పప్పు ధాన్యాలను, ఎర్రని వస్త్రాలను, ఎర్రని పువ్వులను దానం చేస్తే శుభ ఫలితాలొస్తాయి. ఇలా చేయడం వల్ల కుజుడి దోషం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది.​Akshaya Tritiya 2024 ఈసారి అక్షయ తృతీయ వేళ ధన యోగంతో సహా ఐదు శుభ యోగాలు.. ఈ 7 రాశులకు డబ్బే డబ్బు..!

వృషభ రాశి (Taurus)..

ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున గోమాతను, గోమాత పిల్లలు, బియ్యం, మీ సామర్థ్యం మేరకు విలువైన ఆభరణాలు, బ్లూ కలర్ డ్రస్సులను, మూడు కుండలలో నీరు, పాలు, కలిపి దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయి. అంతే కాదు వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది.

మిధున రాశి(Gemini)..

ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి మిధున రాశి వారు పప్పు ధాన్యాలు, తాజా కూరగాయలు, పచ్చని రంగు దుస్తులను, మీ సామర్థ్యం మేరకు బంగారాన్ని దానం చేయాలి. ఇవి దానం చేయలేని వారు కరక్కాయ, సత్తు, పచ్చిమిర్చి వంటివి ఏదైనా ఆలయంలో దానం చేయాలి. ఇలా చేయడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత స్థాయి మెరుగవుతుంది.

కర్కాటక రాశి(Cancer)..

ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ రాశి వారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున ముత్యాలు, తెల్లని దుస్తులు, పాలు సంబంధిత పదార్థాలు, బియ్యం, పంచదారతో పాటు మీ సామర్థ్యం మేరకు వెండి వస్తువులను దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది.

సింహ రాశి(Leo)..

ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ రాశి వారు అక్షయ తృతీయ వంటి పర్వదినాన ఎర్రని వస్త్రాలు, కొవ్వొత్తులు, సింధూరం, బార్లీ, రాగి, కర్పూరం వీటిలో ఏదైనా ఒక వస్తువు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కన్య రాశి (Virgo)..

ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండటం వల్ల కన్య రాశి వారు తాజా కూరగాయలు, పచ్చని రంగులో ఉండే గాజులు, పచ్చని రంగుల ఉండే దుస్తులను దానం చేయాలి. వీటితో పాటు దోసకాయ, పుచ్చకాయలను దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి.​Akshaya Tritiya 2024 ఈసారి అక్షయ తృతీయ వేళ ఎన్ని శుభ యోగాలో తెలుసా... ఈ పర్వదినాన ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట..!

తులా రాశి (Libra)..

ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. తులా రాశి వారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున నీలి రంగు దుస్తులు, నీలి రంగులో ఉండే గాజులు, పాల పదార్థాలను, సౌందర్య సాధనాలను దానం చేయాలి. అలాగే బాటసారులకు నీరు ఇవ్వాలి. పేదలకు పాదరక్షలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయి.

వృశ్చిక రాశి(Scorpio)..

ఈ రాశి వారికి అంగారకడు(కుజుడు) అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ రాశి వారు ఎర్రని గాజులు, గంధం, కేసరాలు, ఎర్రని రంగులో ఉండే దుస్తులను, లిప్‌స్టిక్ వంటి వాటిని దానం చేయాలి. పేదవారికి నీటితో నింపిన పాత్ర, గొడుగు లేదా ఫ్యాన్ దానం చేయడం వల్ల మీకు కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ధనస్సు రాశి (Sagittarius)..

ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ ధనస్సు రాశి వారు మతపరమైన పుస్తకాలు, పాత్రలు, తీపి అన్నం, శనగపప్పు, పసుపు రంగు దుస్తుల వంటి వాటిని దానం చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

మకర రాశి (Capricorn)..

ఈ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి మకర రాశి వారు నీరు, పాలు, నల్ల గుడ్డ, పెన్ను, ఫ్యాన్లు, పాదరక్షలు, ఇనుప పాత్రలు, నూనె, కూలర్ వంటి వాటిని దానం చేయడం వల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T14:08:10Z dg43tfdfdgfd