RAMA NAVAMI GURU GRAHA: శ్రీరామ నవమి వేళ అరుదైన శుభ యోగాలు.. ఈ 5 రాశులకు రామయ్య ప్రత్యేక ఆశీస్సులు..!

Rama Navami 2024: జ్యోతిష్యం ప్రకారం, శ్రీరామ నవమి వేళ కొన్ని అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి రామయ్య ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో తెలుసుకోండి...

Rama Navami 2024: ప్రతి సంవత్సరం ఛైత్ర మాసంలో శుక్ల పక్షం తొమ్మిదో రోజున అంటే ఛైత్ర నవమి తిథి నాడు శ్రీరామ నవమి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన బుధవారం నాడు శ్రీరామ నవమి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున రామాలయాల్లో శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అనేక సంవత్సరాల తర్వాత శ్రీరామ నవమి వేళ సర్వార్ధ సిద్ధి యోగం, రవి యోగం, గజకేసరి యోగం ఏర్పడనున్నాయి. అంతేకాదు గురుడు కూడా భరణి నక్షత్రం నుంచి కృత్తికా నక్షత్రంలోకి ఏప్రిల్ 17న మధ్యాహ్నం 2:57 గంటలకు ప్రవేశించనున్నాడు. ఈ శుభ యోగాల కారణంగా ఐదు రాశుల వారికి శ్రీరాముని ప్రత్యేక ఆశీస్సులతో విశేష ప్రయోజనాలు కలగనున్నాయి.మేష రాశి(Aries)..

ఈ రాశి వారికి శ్రీరామ నవమి వేళ రామయ్య ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ రాశిలో సూర్యుడు, గురువు సంచారం చేయడంతో మేష రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలను వింటారు. ఉద్యోగులకు కార్యాలయంలో కొంత పెద్ద బాధ్యతలు రావొచ్చు. ఉన్నతాధికారులు మీ పనిని ఎంతో అభినందిస్తారు. ఉద్యోగులు తమ ఉద్యోగంలో మంచి లాభాలను పొందుతారు. వ్యాపారులు భారీ ప్రయోజనాలు పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.​Weekly Horoscope ఈ వారంలో త్రిగ్రాహి యోగం కారణంగా తులా, మేషంతో సహా ఈ 7 రాశులకు ఆదాయం, కెరీర్ పరంగా పురోగతి..!

సింహ రాశి(Leo)..

ఈ రాశి వారికి శ్రీరామ నవమి నుంచి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. మీ కలలన్నీ నిజమయ్యే అవకాశం ఉంది. మీరు మంచి ప్యాకేజీతో కొత్త జాబ్ అవకాశాలను పొందుతారు. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించొచ్చు. మీరు పని చేసే రంగంలో మంచి విజయాలు సాధిస్తారు. మీకు పాత అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది.

తులా రాశి(Libra)..

ఈ రాశి వారికి శ్రీరామ నవమి వేళ శుభప్రదంగా ఉంటుంది. మీరు అన్ని రకాల భౌతిక సుఖాలను పొందుతారు. దీర్ఘకాలంగా ప్రణాళికా బద్ధంగా పని చేస్తున్న వారికి ప్రణాళికలు సఫలమవుతాయి. పెండింగులో ఉన్న మీ పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. ఆస్తి కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరుతుంది. మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందొచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.

కుంభ రాశి(Aquarius)..

ఈ రాశి వారికి శ్రీరామ నవమి నుంచి అన్ని రంగాల్లో మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఉద్యోగులు కచ్చితంగా ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి. శ్రీరాముని అనుగ్రహంతో మీ పనులన్నీ పూర్తవుతాయి. మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలను వింటారు.

మీన రాశి(Pisces)..

ఈ రాశి వారికి శ్రీరాముని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. రామయ్య ఆశీస్సులతో మీరు చేసే పనిలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. దీంతో మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. చాలా కాలంగా ఉన్న మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలొస్తాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. మీ కుటుంబంలో వివాదాలన్నీ పరిష్కరించబడతాయి. పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.Read Latest Astrology News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-16T07:49:17Z dg43tfdfdgfd