రాశిఫలాలు 01 మే 2024:ఈరోజు వృషభంలో గురువు సంచారం.. ఈ 5 రాశులకు కనక వర్షం ఖాయం..!

horoscope today 01 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గురువు మేషం నుంచి వృషభరాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి కనక వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి.

horoscope today 01 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో గురుడు వృషభ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విపరీత రాజయోగం పట్టనుంది. మరికొన్ని రాశుల వారికి వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

ఈ రాశి వారికి గురుడి సంచారం వల్ల ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ ఆస్తి విలువ పెరిగే అవకాశం ఉంది. మ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడుల వల్ల మంచి లాభాలొస్తాయి. మీ స్వల్పకాలిక రుణాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు గాయత్రీ చాలీసా పఠించాలి.​May Horoscope 2024 మే నెలలో అక్షయ తృతీయ, బుద్ధ పూర్ణిమ వేళ అరుదైన శుభ యోగాలు.. ఈ రాశులకు బంపరాఫర్...!

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాలి. మీరు ప్రత్యర్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలి.ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు గొప్పగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. మీరు రోజంతా చాలా ఆనందంగా గడపొచ్చు. మీ ఇంట్లో చిన్నారుల సందడి ఎక్కువగా ఉంటుంది. మీకు వారసత్వ ఆస్తి పెరిగే అవకాశం ఉంది. ఈ సాయంత్రం మీ ఇంటికి అతిథి రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. అయితే వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాలి.ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు విష్ణుమూర్తిని పూజించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

ఈ రాశి వారికి గురు గ్రహం ప్రభావంతో అనేక రంగాల్లో లాభాలొస్తాయి. ప్రారంభంలో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేసే ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు మంచి పురోగతి లభిస్తుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీకు లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. మీ తండ్రి నుంచి ఆస్తి కలిసొస్తుంది. మీరు అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు తులసికి నీరు సమర్పించి, దీపం వెలిగించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీకు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ బంధువుల నుంచి ప్రత్యేక బహుమతులను పొందొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం.ఈరోజు మీకు 67 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు అవసరమైన వారికి అన్నదానం చేయాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో ఈరోజు అన్ని రంగాల్లో విజయం లభిస్తుంది. మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి, ఆదాయం పెరగొచ్చు. విదేశీ సంబంధిత వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు మీకు 87 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు గోమాతకు రోటీ తినిపించాలి.​May Grah Gochar 2024 మే నెలలో గురుడితో సహా నాలుగు గ్రహాల సంచారం.. ఈ 5 రాశులకు ధన యోగం..!

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రతిభ గురించి కొంత సందేహం ఉంటుంది. ఈ కారణంగా మీరు అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు చాలా ఓపికగా ఉండాలి. మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహార అలవాట్లపై కూడా శ్రద్ధ వహించాలి. వ్యాపారులు కూడా జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు శ్రీకృష్ణునికి వెన్న, పంచదార మిఠాయి సమర్పించాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

ఈ రాశి నుంచి గురుడు సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారులు పెట్టే పెట్టుబడులకు మంచి లాభాలొస్తాయి. మీ ప్రేమ, పెళ్లి జీవితంలో సంతోషంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆస్తి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. దీంతో మీకు మనశ్శాంతి లభిస్తుంది.ఈరోజు మీకు 62 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు సిద్ధిదాత వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది. మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో అన్నదమ్ములతో అశాంతి నెలకొని ఉంటే, రేపు అది పరిష్కారమై మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఈరోజు ఏదైనా కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వినొచ్చు.ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : తులసి చెట్టుకు నీరు సమర్పించి దీపం వెలిగించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

ఈ రాశి నుంచి గురువు పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల మకర రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు ఆశించిన మేరకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది. ఈరోజు మీరు ఏ ప్రయత్నం చేసినా కచ్చితం విజయం సాధిస్తారు. మీరు సీనియర్లు, కుటుంబ సభ్యుల నుంచి ఆశీస్సులు పొందుతారు. మీ పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది.ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-30T19:06:00Z dg43tfdfdgfd