ANTARVEDI TEMPLE: అంతర్వేది లక్ష్మీ నరసింహునికి భక్తుల ఖరీదైన బహుమానం.. బంగారు కిరీటం విలువ ఎంతంటే!

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్ల అంతర్వేదిలో కొలువై ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామివారి విగ్రహానికి అలంకరణ నిమిత్తం నెల్లూరుకు చెందిన ఎవర్‌మార్క్‌ న్యూట్రాసిటికల్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ అధినేతలు అప్పల రంగనాథం, అప్పలరాజ్‌కుమార్‌, కవిత, అప్పల దిలీప్‌ చక్రవర్తి కల్పనలు బంగారు కిరీటాన్ని బహూకరించారు. ఈ కిరీటం విలువ రూ.9.70 లక్షలు కాగా.. 155 గ్రాముల బంగారంతో తయారు చేశారు. తొలుత అర్చక స్వాములు బంగారు కిరీటానికి సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు నిర్వహించి నరసింహస్వామివారి ఉత్సవ విగ్రహానికి అలంకరించారు.

సంప్రోక్షణ, పూజల తర్వాత బంగారు కిరీటాన్ని బహూకరించిన దాతలకు అర్చకులు, వేద పండితులచే మహదాశీర్వచనం జరిపించారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్‌ వి.సత్యనారాయణ, బోనం సారథి, బోనం రాజు, ఎవర్‌మార్క్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. స్వామివారికి బంగారు కిరీటం అందజేయడం ఆనందంగా ఉందన్నారు దాతలు. కోనసీమ కోంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా శ్రీలక్ష్మీనరసింహస్వామికి పేరుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-29T05:33:44Z dg43tfdfdgfd