11వ శతాబ్దం నాటి ఏకశిలా సీతారాములను దర్శిస్తే .. మీకు ఎంతో పుణ్యం..

11వ శతాబ్దం నాటి ఆ దివ్య ఆలయంలో సీతారాములు ఏకశిలపై నేటికీ దివ్య దర్శనమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం క్షేత్రంలో ఏ విధంగా ఏకశిలపై సీతారాములు దర్శనమిస్తారో.. అలాగే ఆ ఉమ్మడి జిల్లా కొండపై సీతారాములు దివ్య దర్శనమిస్తారు. 11వ శతాబ్దం నాటి కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరని విధంగా ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఆ దివ్య ప్రాంతంలో ఏడాదికి ఒకసారి నిర్వహించు ఆ కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్దాం ఆ విశేషాలు చూద్దాం.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ సమీపంలో రౌతులపూడి మండలం ములగపూడి గ్రామం రామగిరి కొండపై కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభుగా సీతారాములు కొలువై ఉన్నారు. ఈ సీతా రాములను కోదండరాముడిగా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఆనాటి కట్టడాలు ఆనాటి పూర్వపు ఇటుకలు ఇప్పటికే చెక్కుచెదరని విధంగా ఈ ఆలయంలో కనిపిస్తూ ఉంటాయి. బయట నుంచి చూడడానికి చిన్న ఆలయంగా కనిపించిన ఇటు సీతారాములు ఆంజనేయ స్వామి వారి విగ్రహం స్వయంభు విగ్రహాలుగా ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు.

దేశంలో ఎక్కడా ఇలాంటి వింత ఉండదు.. శ్రీరామనవమి నాడు జరిగేది ఇదే..

నిజానికి కోరిన కోర్కెలు తీర్చే శ్రీ కోదండ రాముడి ఆలయానికి వివాహం అవ్వని వారికి వివాహం, సంతానం లేని దంపతులకు పిల్లలు ఈ సీతారాములు అందిస్తారని ఎంతో విశ్వాసంతో వస్తుంటారన్నారు. ఇక్కడ విశేష పర్వదినాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవం సైతం శ్రీ రామగిరి ములగపూడి కొండపై అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏకశిలా సీతారాముల విగ్రహాలు ఎదురుగా చక్కని వేదికపై సీతారాములను వేయించింపచేసి అర్చక స్వాములు గణపతి పూజ, పుణ్యహవచనం, కంకణధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాలు ఘట్టాలు ఆధ్యాత్మిక పరంగా నిర్వహించారు. వేలాదిగా భక్తులు శ్రీరామ నామ జపం జపిస్తూ సీతారాముల కళ్యాణం మహోత్సవం భక్తిశ్రద్ధలతో తిలకించారు.

మరోపక్క ఈరామగిరి కొండపై కూచిపూడి, భరతనాట్యం వంటి కార్యక్రమాలు స్వామివారి కళ్యాణం కావునా నిర్వహించారు. చిట్టి పొట్టి చిన్నారులు ప్రత్యేక ఆధ్యాత్మిక పాటలు కొన్ని నృత్యాలు వేస్తూ అందరి మన్ననలను పొందారు. చుట్టూ ఎతైన కొండలు ఎటు చూసినా పచ్చని వాతావరణం నడుమ మధ్యలో రామగిరి కొండపై సీతారాములు కొలువై ఉన్నారు. సాక్షాత్తు భద్రాచలంకు ఎంత శక్తి ఉందో ఇక్కడ కూడా అంతే శక్తి ఈ సీతారాములకు ఉందని ఆలయ నిర్వహకుల పేర్కొంటున్నారు. మనకి కాకినాడ జిల్లా కత్తిపూడి నుంచి జాతీయ రహదారిగా మనం రౌతులపూడి ఆ తదుపరి ఈ ములగపూడి గ్రామానికి వచ్చి సీతారాముల దర్శనం చేసుకోవచ్చు.

2024-04-17T13:49:24Z dg43tfdfdgfd