14ఏళ్లుగా చల్లని సేవ.. వీరి సేవకు చేతులు జోడించాల్సిందే !

అసలే ఎండాకాలం. ఎవరికైనా అధిక దాహం సర్వసాధారణమే. అలా ఎండలో కొద్ది క్షణాలు వెళ్ళామంటే చాలు, ఖ చ్చితంగా మన దప్పిక మనం తీర్చుకోవాల్సిందే. అలా దప్పిక తీర్చుకొని పక్షంలో మనం పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఆ సమయంలో దాహం తీర్చుకోక పోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. అందుకే ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎందరో మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

ఇలా ఎన్నో ఏళ్లుగా ఎన్నో స్వచ్చంధ సంస్థల సభ్యులు ఎండాకాలం రాగానే చలివేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజల దాహార్తిని తీరుస్తూ తమ మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఎందరో మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. ఇలా సంగారెడ్డిలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో 14 సంవత్సరాలుగా ఏకధాటిగా ఎండాకాలంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం విశేషం.

పిల్లలకు కూచిపూడి నేర్పించాలనుకునే వారికి గుడ్ న్యూస్..

సంగారెడ్డిలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ను ఏర్పాటుచేసి ఎన్నో సేవా కార్యక్రమాలను విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగానే సంగారెడ్డి లోని కొత్త బస్టాండ్ సమీపంలో రేకుల షెడ్డుని ఏర్పాటు చేసి చలివేంద్రాన్ని 14 ఏళ్ల నుండి విద్యాపీఠం అధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అంటే ఎండాకాలం రాగానే ఇక్కడ చలి వేంద్రాన్ని పీఠం అధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ రహదారి గుండా రాకపోకలు సాగించే ప్రజలు ఇక్కడ తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు.

టి20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఎంపికలో రింకు సింగ్ కు అన్యాయం.. ఆవేశంలో అభిమానులు..

అంతేకాదు ఎక్కువగా ప్రయాణికులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. సమ్మర్ లో అసలే దాహపు కేకలు ఎక్కువ. అందుకే తమ విద్యాపీఠం అధ్వర్యంలో చలివేంద్రాన్ని 14 ఏళ్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు పీఠాధిపతి తెలిపారు. లోకల్18 తో స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. విద్యాపీఠం అధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రతి సమ్మర్ లో ఏర్పాటు చేస్తారని, ఈ సేవా కార్యక్రమాలు మరిన్ని సంగారెడ్డి జిలాల్లో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహిస్తుందన్నారు. ఏది ఏమైనా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి సమ్మర్ లో విద్యాపీఠం అధ్వర్యంలో 14 ఏళ్లుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం, ప్రశంసనీయం.

2024-05-03T14:04:36Z dg43tfdfdgfd