5 BENEFITS WITH APPLYING ICE CUBES: ప్రతిరోజూ రాత్రి ముఖానికి ఐస్‌క్యూబ్స్‌ రాసుకుంటే చాలు.. ఈ ఎండకాలం ఎలాంటి స్కిన్‌కేర్‌ అవసరమేలేదు..!

Beauty Benefits with Applying ice cubes: ఈ ఎండకాలం ముఖానికి సరైన జాగ్రత్తలు తీసుకోవకపోతే జీవం కోల్పోతుంది. ఇది సహజసిద్ధంగా ముఖాన్ని మెరిపిస్తుంది.  ముఖంపై పేరకున్న చెమటను తొలగించి పిగ్మంటేషన్‌ రాకుండా రోజంతా హైడ్రేషన్‌ ఇస్తుంది.ఈ ఎండకాలం మీ ముఖం వాపు, పొడిబారి, యాక్నే పేరుకున్నట్లు కనిపిస్తుంది. ఈ సమస్యలు రాకుండా నివారించడానికి ముఖాన్ని ఐస్‌క్యూబ్స్‌ మంచి రెమిడీ. మండే ఎండకాలం ఈ చల్లని ఐస్‌ క్యూబులను ముఖానికి రోజూ రాత్రి అప్లై చేసుకోవడం వల్ల 5 ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాం. ఐస్‌క్యూబులతో ముఖంపై రబ్‌ చేసుకోవాలి. దీంతో మీ చర్మం జీవం పోసుకుంటుంది. ఈ ఐస్‌ థెరపీతో చర్మానికి మంచి చికిత్సను అందిస్తుంది. ఐస్‌ క్యూబ్స్‌తో మన ముఖానికి కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

మెరిసే ముఖం.

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఐస్‌ క్యూబ్స్‌తో ముఖాన్ని రుద్దాలి. ఇలా చేయడం వల్ల ముఖం బ్లడ్‌ సర్క్యూలేషన్‌ మెరుగుపడుతుంది. ఇది మన చర్మంపై ఆక్సిజన్‌ స్థాయిలను కూడా పెంచుతుంది. అంతేకాదు మన ముఖానికి కావాల్సిన మినరల్స్‌, విటమిన్స్‌ అందిస్తాయి. ఐస్‌క్యూబ్స్‌ ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం ఉదయం చూసే సరికి మెరిసిపోతుంది తెలుసా?

ఎక్స్‌ఫోలియేట్..

ఐస్‌ క్యూబ్స్‌తో ముఖాన్ని రుద్దుకుంటే ఇది చర్మం ఎక్స్‌ఫోలియేట్‌ చేయడానికి మంచి ఎఫెక్టివ్‌ రెమిడీ. ముఖ రంధ్రాలను కూడా ఐస్‌ క్యూబ్స్‌ తో మసాజ్‌ చేస్తే తగ్గిపోతుంది. ఎండ వల్ల ముఖం పై పిగ్మెంటేషన్‌ తగ్గిపోతుంది.

వాపును తగ్గిస్తుంది..

ఈ ఎండలకు మీ ముఖం దురదగా, ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుంది. సూర్యుని హానికర కిరణాల వల్ల ముఖంపై ర్యాష్‌, అలెర్జీలు కూడా రావచ్చు. అయితే, ఐస్‌ క్యూబులతో ముఖంపై రబ్ చేసుకోవడం వల్ల దీని నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. రక్తనాళాలను విస్తరింపజేసి వాపు సమస్యలకు చెక్‌ పెడుతుంది.

ఇదీ చదవండి: వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా ట్రై చేయండి..

డార్క్‌ సర్కిల్స్..

ఐస్‌క్యూబ్స్‌ అప్లై చేస్తే ముఖం పేరుకున్న డార్క్‌ సర్కిల్స్‌ కూడా రావు. ముఖం పై ఉండే మచ్చలకు ఇది ఎఫెక్టీవ్‌ రెమిడీ. డార్క్‌ సర్కిల్స్‌కు ఐస్‌క్యూబ్స్‌ పెట్టడం వల్ల మంచి చికిత్స అందుతుంది. ఈ థెరపీ ముఖం వాపును కూడా తగ్గిస్తుంది. నల్లమచ్చలను కూడా తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.

ఇదీ చదవండి:  కొలెస్ట్రాల్ కట్ చేసే వెల్లుల్లి పసుపు పచ్చడి.. ఇలా తయారు చేసుకోండి..

వృద్ధాప్యం..

ఐస్‌ ముక్కలను ఇలా ముఖం పై అప్లై చేయడం వల్ల వృద్ధాప్యం కూడా ఆలస్యమవుతుంది. చల్లని ఐస్‌ ముక్కలు ముఖ చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. ముఖంపై కొందరికి వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయి. ఐస్‌క్యూబ్స్ తో రబ్‌ చేయడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-04T07:35:31Z dg43tfdfdgfd