ADULTERATED SALT: మీరు తినే ఉప్పు నిజమైనదా? కల్తీదా? ఇలా ట్రై చేయండి..!

Adulterated Salt: ఉప్పు మన ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా అనేక రకాల ఆహారాలను సంరక్షించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ మనం కొనుగోలు చేసే ఉప్పు అంతా స్వచ్ఛంగా ఉండదని చాలా మందికి తెలియదు. వాస్తవానికి, మార్కెట్లో లభించే చాలా ఉప్పు ఉత్పత్తులు కల్తీ చేయబడ్డాయి. ఈ కల్తీ ఉప్పులో సోడియం క్లోరైడ్ తో పాటు మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ వంటి హానికరమైన పదార్థాలు కలుపుతారు. ఈ కల్తీ పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో హానికరం. దీని వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. 

కల్తీ ఉప్పు వల్ల కలిగే నష్టాలు:

కల్తీ ఉప్పులో సోడియం క్లోరైడ్ తో పాటు మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ వంటి హానికరమైన పదార్థాలు ఉంటాయి. దీని కారణంగా జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా కడుపు మంట, నొప్పి, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటానికి కారణమవుతాయి. కల్తీ ఉప్పు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు సమస్యను పెంచుతుంది.  ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే మీరు  కల్తీ ఉప్పును ఎలా పరీక్షించాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం.

నకిలీ ఉప్పును గుర్తించడం ఎలా:

పత్తి పరీక్ష: 

ఒక గిన్నెలో నీటిలో కొంచెం ఉప్పు కరిగించి, దానిలో పత్తిముక్కను వేసి 5 నిమిషాలు నానబెట్టండి. ఉప్పు కల్తీ అయితే పత్తి ముక్క రంగు మారిపోతుంది.

నీటిలో కరిగించడం: 

ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉప్పు వేసి కరిగించండి. నీరు పారదర్శకంగా ఉంటే ఉప్పు స్వచ్ఛంగా ఉంటుంది. కల్తీ ఉప్పు నీటిలో కరిగేటప్పుడు పేడనం దిగువన గుల్లలు ఏర్పడతాయి.

మనం ఏమి చేయాలి:

అధికారికంగా అమ్మకమయ్యే బ్రాండెడ్ ఉప్పు కొనండి. దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటుంది.  ఉప్పు కొనుగోలు చేసేటప్పుడు దాని లేబుల్ ను జాగ్రత్తగా చదవండి. అయోడైజ్డ్ ఉప్పు వాడండి.ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఉప్పు వాడకాన్ని తగ్గించుకోండి. మీరు కల్తీ ఉప్ప కొనుగోలు చేసినప్పుడు వెంటనే  అధికారులకు ఫిర్యాదు చేయండి. అలాగే ఆరోగ్యనిపుణులు ప్రకారం ఉప్పును అతిగా కాకుండా మితంగా తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. 

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.  ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-05-06T04:42:41Z dg43tfdfdgfd