AKSHAYA TRITIYA - GAJAKESARI YOGAM: అక్షయ తృతీయ రోజున అద్బుతమైన గజకేసరి రాజ యోగం.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవమే..

Akshaya Tritiya - Gajakesari Yogam: దేవతలకు గురువైన బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మే 10న చంద్రుడు వృషభ రాశిలో ప్రవేశం వల్ల బృహస్పతి, చంద్రుడి కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతోంది. ఈ యేడాది అక్షయ తృతీయ రోజు మే 10న జరుపుకుంటారు. మరియు అదే రోజున బుధుడు మేషరాశిలో సంచరిస్తాడు. అక్షయ తృతీయ రోజున గజకేసరి రాజయోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికీ చాలా శుభ ఫలితాలను కలుగుతాయి. లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఈ రాశి వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవమే. ఇంతకీ ఏయే రాశుల వారికీ అదృష్టమో తెలుసుకుందాం..   

 

వృషభ రాశి..

బృహస్పతి, చంద్రుడి కలయిక వల్ల మీ మాటల్లో సౌమ్యత ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి గతంలో కంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది. మీ పని సంతోషకరమైన ఫలితాలను ఇస్తుంది. మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతోంది. ఉద్యోగస్తులు శుభ వార్తలు వింటారు. ప్రమోషన్ అందుకుంటారు. లక్ష్మి దేవి అనుగ్రహంతో డబ్బుకు లోటుండదు. మీ వ్యక్తిత్వం అందరి చేత ప్రశంసించ బడుతోంది.

కన్య రాశి..

కన్యా రాశి వారికీ గజకేసరి రాజయోగం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు స్నేహితుల సహాకారంతో ఆర్ధిక లాభం కోసం కొత్త అవకాశాలు ఉంటాయి. ఆర్ధికంగా బలంగా ఉంటారు. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు పుట్టుకొస్తాయి. కెరీర్‌లో పురోగతతి ఉంటుంది. వైవాహిక జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. భార్య నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

వృశ్చిక రాశి..

అక్షయ తృతీయ నాడు బృహస్పతి, చంద్రుడి కలయిక వల్ల వృశ్చిక రాశి వారికీ అనుకోని ధనలాభం కలగనుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ది ఉంటుంది. వస్తు మూలక సౌఖ్యాలు పెరుగుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వ్యాపార రంగాల్లో రాణిస్తారు. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి.

వృశ్చిక రాశి..

అక్షయ తృతీయ నాడు బృహస్పతి మరియు చంద్రుడు కలిసి వృశ్చిక రాశి వారికి నిద్రాభంగం కలిగిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అవకాశం ఉంటుంది. వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో విస్తరణ ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిపోతుంది.

Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Read More: WomanThrows Son: పసిబిడ్డను మొసళ్లకు ఆహరంగా వేసిన కసాయి తల్లి..కారణం ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-08T02:19:43Z dg43tfdfdgfd