AKSHAYA TRITIYA: అక్షయ తృతీయ రోజు బంగారం కొనకపోతే నష్టమా?

హిందూ సంప్రదాయంలో ప్రతిరోజూ విశేషమైనదే. ఒక్కో పండుగని ఒక్కోలా జరుపుకుంటాం..అయితే కొన్ని సెంటిమెంట్స్ మనచుట్టూ తిరుగుతాయి. అలాంటి పండుగల్లో ఒకటి అక్షయ తృతీయ. వైశాఖ మాసంలో మూడో రోజు..అంటే వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. అందుకే ఆ రోజు చేసే దాన ధర్మాలు, పుణ్యం అత్యధిక ఫలితాలనిస్తాయని చెబుతారు. అక్షయ తృతీయ రోజు బంగారం కూడా సెంటిమెంట్.

ఈ రోజు చేసే దానధర్మాలు అక్షయం అయినట్టే..పాపాలు అయినా అంతే..చిన్న పాపం చేసినా అది అక్షయం అవుతుంది. అక్షయ తృతీయ రోజు మొత్తం మంచి ముహూర్తంగానే భావిస్తారు. ఆ రోజు దుర్ముహుర్తాలు, వర్జ్యాలు, యమగండం లాంటివి పెద్దగా ప్రభావం చూపవు. రోజు మొత్తం ఏ క్షణం ఏం చేసినా శుభఫలితాలే వస్తాయని విశ్వసిస్తారు. ఆ రోజుకున్న ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే..ఆ రోజునే త్రేతాయుగం మొదలైంది, పరశురాముడు జన్మించింది కూడా ఆ రోజునే.

అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి డబ్బులు లేవా? ఇవి కొన్నా లక్ష్మీకటాక్షం పొందొచ్చు

అలాంటి రోజున అందరూ బంగారం కొనాలి అని ఒక ప్రచారం ఉంది దాని గురించి లోకల్ 18 ప్రతినిధి అయినా కేశవేణి ప్రవీణ్ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగరం గ్రామంలోని సతీ సమేత త్రిమూర్తుల హరిహర దేవాలయం స్థాపిత అధిపతి శ్రీశ్రీ శ్రీ హరిహరానంద స్వాములవారిని అడుగగా అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని ప్రచారం చేస్తుంటారు. ఆ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చంటుందంటారు. ఇదే అదనుగా బంగారం షాపుల వాళ్లు కూడా అందరిని ఆకర్షించేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తారు.

అక్షయ తృతీయ రోజు బంగారం షాపులన్నీ కిటకిటలాడిపోతుంటాయి. అక్షయ తృతీయ రోజు బంగారం షాపుల్లో మహిళామణుల బారులు చూస్తుంటే ఇక్కడ బంగారం ఉచితంగా పంచుతున్నారా అనేంత అనుమానం వస్తుంది. అంతలా పోటీపడి మరీ కొనేస్తారు. కొందరైతే అప్పు చేసి మరీ బంగారం కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చేస్తారు. వాస్తవానికి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు.

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ మూడు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమేనట

ఇదంతా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం మాత్రమే అని శ్రీ శ్రీ శ్రీ హరిహరణందా స్వామి వారు వివరించారు. స్వామి వారి యొక్క శిష్యుడు అయినా సింగిరాల శ్రీనివాసులు మాట్లాడుతూ చాలామందికి తెలియని విషయం ఏంటంటే...కలిపురుషుడి ఐదు నివాస స్థానాల్లో బంగారం ఒకటి, బంగారం అహంకారానికి హేతువు. అంటే బంగారం కొని కోరి కలిపురుషుడిని ఇంట్లో పెట్టుకుంటున్నారు అని లోకల్ 18 తో వివరించారు.

2024-05-07T09:48:32Z dg43tfdfdgfd