ALLERGY HOME REMEDIES: ఇంట్లో ఉండే ఈ పదార్థాలతో అలర్జీ సమస్యకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు!

Allergy Home Remedies In Telugu: వాతావరణం మారే కొద్దీ చర్మంలో కూడా అనేకమార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామందిలో శీతాకాలంతో పోలిస్తే ఎక్కువగా వేసవిలో చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అలర్జీ ఒకటి. ఇది ఏ సీజన్ అయినా సులభంగా చర్మానికి అంటుకొని తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది అలర్జీ కారణంగా ముందుగా చర్మం పైరంగు మారి చిన్న చిన్న మార్పులు వస్తుంటాయి. ఆ తర్వాత దద్దుర్లు మంట దురద మొదలై తీవ్ర చర్మ సమస్యకు దారి తీసే అవకాశాలున్నాయి. నిజానికి ఇప్పటికే చర్మ  చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్య నిపుణులను సంప్రదించి ఉపశమనం పొందడం ఎంతో మేలు. అయితే తరచుగా వేసవికాలంలో అలర్జీ వంటి సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని హోమ్ రెమెడీస్‌ను వినియోగించి సులభంగా ఉపశమనం పొందవచ్చు. 

సులభంగా సమ్మర్‌లో అలర్జీ సమస్య నుంచి ఇలా ఉపశమనం పొందండి:

పెరుగు:

వేసవిలో ఎక్కువగా అలర్జీ సమస్యతో బాధపడుతున్న వారు ఎలాంటి రసాయనాలతో కూడిన ఔషధాలను వినియోగించకుండా కూడా సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం చేయాల్సిందల్లా కేవలం అలర్జీ ప్రభావిత ప్రాంతంలో పెరుగును అప్లై చేయడం. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ చర్మ సమస్యలనుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా అలర్జీని సులభంగా తొలగించేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది.

కలబంద:

ఈ అలర్జీ సమస్య నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు కలబంద కూడా ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు అమినోయాసిడ్స్ చర్మాన్ని రిఫ్రెష్‌గా చేసేందుకు ప్రభావంతంగా సహాయపడతాయి. దీంతోపాటు అలర్జీ వంటి పెద్ద పెద్ద చర్మవ్యాధుల నుంచి తొందరగా ఉపశమనం కలిగించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

నిమ్మకాయ:

అలర్జీ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నిమ్మకాయ రసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సిర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, చర్మంపై మచ్చలను తొలగించేందుకు ప్రభావంతంగా కృషి చేస్తాయి. దీంతోపాటు చర్మంపై ఉన్న అలర్జీని తొలగించేందుకు కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

తేనె:

తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని వివిధ రకాల సమస్యల నుంచి రక్షించేందుకు ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ప్రత్యేకమైన మూలకాలు అలర్జీ వంటి జిడ్డు వ్యాధులను తొలగించేందుకు కూడా దోహదపడతాయి. కాబట్టి తరచుగా వేసవిలో ఈ అలర్జీ సమస్యతో బాధపడేవారు తప్పకుండా చర్మానికి దీనిని అప్లై చేయండి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

2024-04-24T15:57:44Z dg43tfdfdgfd