ALOE VERA BEAUTY TIPS: అలోవెరా జెల్‌ చర్మానికి ఎన్ని లాభాలో.. ఇవి తప్పకుండా తెలుసుకోండి!

Aloe Vera Beauty Tips: చర్మ సమస్యలతో బాధపడేవారు అలోవెరా జెల్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని ఆరోగ్యం ఉంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ అలోవెరా జెల్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Aloe Vera Beauty Tips In Telugu: భారత్‌ వ్యాప్తంగా గత నెల నుంచే వేసవి ప్రారంభమైంది. దీని కారణంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. దీంతో చాలా మందిలో చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమందిలో వేసవి కాలంలో చర్మం నల్లగా, నిర్జీవంగా, పొడిబారడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు వారు మార్కెట్‌లో లభించే ఖరీదైన స్కిన్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఇక నుంచి రసాయనాలు కలిగిన ప్రోడక్ట్స్‌ వినియోగించనక్కర్లేదు. వీటికి బదులుగా అలోవెరాలోను వాడడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలోవెరాలో విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రభావంతంగా సహాయపడతాయి. అలాగే చర్మాన్ని మెరిపించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. అయితే ఈ అలోవెరాను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

అలోవెరా జెల్:

అలోవెరా జెల్‌ను చర్మానికి, జుట్టుకు అప్లై చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని మూఖానికి అప్లై చేయడం వల్ల చర్మం ఎంతో ఆందంగా తయారవుతుంది. అలాగే ఇందులో ఉండే గుణాలు మొటిమలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. తరచుగా అలోవెరా జెల్‌ను చర్మానికి వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

అలోవెరా జెల్‌ను మూఖానికి వినియోగించే ముందు తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీనిని అప్లై చేసుకోవడానికి ముందు చల్లని నీటితో బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూఖానికి అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉంచి, బాగా మసాజ్ చేసి నీటితో శుభ్రం చేయాల్సి ఉంటుంది. 

కలబంద ఫేస్‌ మాస్క్‌:

కలబంద ఫేస్‌ మాస్క్‌ను వినియోగించడం వల్ల కూడా సులభంగా చర్మం నల్లగా, నిర్జీవంగా, పొడిబారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఫేస్‌ మాస్క్‌ను తయారు చేసుకోవడానికి రెండు చెంచాల అలోవెరా జెల్, రెండు చెంచాల తేనె, నిమ్మరసాన్ని గిన్నెలో మిక్స్‌ చేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే! 

ఈ కలబంద ఫేస్‌ మాస్క్‌ను వినియోగించే ముందు నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మాస్క్‌ను అప్లై చేసి 25 నిమిషాల పాటు బాగా మసాజ్‌ చేసి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తరచుగా చేయడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-29T12:16:44Z dg43tfdfdgfd