APRIL BORN PEOPLE: మీరు ఏప్రిల్ నెలలో పుట్టారా? అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి

April Born People: ప్రస్తుతం ఏప్రిల్ నెల నడుస్తోంది. ఈ నెలలో ఎంతోమంది పుట్టిన రోజులు జరిగి ఉంటాయి. ఇంకా జరగబోతున్నాయి కూడా. ఏప్రిల్ నెలలో పుట్టే వారి వ్యక్తిత్వం, వారి లక్షణాలు, బుద్ధి ఎలా ఉంటుందో పాశ్చాత్య జ్యోతిష్యులు అంచనావేసి చెబుతున్నారు. ఏప్రిల్ నెలలో క్వీన్ ఎలిజిబెత్ 2, విలియం షేక్స్‌పియర్ వంటి గొప్ప జాతకులు జన్మించారు. వీరే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది ఏప్రిల్ నెలలో పుట్టి ఉంటారు. అలాంటి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో పాశ్చాత్య జ్యోతిష్యులు ఇలా చెబుతున్నారు.

ఏప్రిల్ నెలలో పుట్టిన వారు...

ఏప్రిల్ నెలలో పుట్టిన వారు పనులపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. మాటలు తక్కువగా మాట్లాడతారు. వీరు మాట్లాడటం కన్నా చేతల్లోనే చూపిస్తారు. ఎప్పుడూ కూడా ఎనర్జిటిక్ గా పని చేస్తారు. వీరిలో చురుకుదనం ఎక్కువ. అలాగే కొత్తదనాన్ని ఇష్టపడతారు. ప్రతి విషయాన్ని సృజనాత్మకంగా ఉండాలని కోరుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి వేచి ఉంటారు. వీరికి విశ్రాంతి అంటే నచ్చదు. చాలా అరుదుగా విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు.

ఏప్రిల్ నెలలో పుట్టిన వారికి భావోద్వేగాలు ఎక్కువ. సున్నిత మనస్కులుగా ఉంటారు. బయటకి మొండి వారిలా కనిపిస్తున్నా, కఠినంగా మాట్లాడుతున్నా నిజానికి వారి మనసు చాలా సున్నితం. చిన్న చిన్న విషయాలకి కూడా బాధపడుతూ ఉంటారు. అయితే వీరు మెదడు కన్నా గుండెకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. హృదయం ఏం చెబితే అదే వింటారు. ఏప్రిల్ నెలలో పుట్టిన వారిని ఎవరైనా కూడా నమ్మవచ్చు. వీరు విశ్వసనీయమైన వారు. స్నేహానికి, బంధుత్వాలకు విలువిస్తారు.

మిగతా నెలల వారితో పోలిస్తే ఏప్రిల్ నెలలో ఉన్నవారు ప్రతి విషయంలోనూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి నాయకులయ్యే లక్షణాలు కూడా ఉంటాయి. టీమ్‌ను ఎలా ముందుకు నడిపించాలో తెలిసినవారుగా ఉంటారు. అంతేకాదు తమ పక్కన ఉన్న టీమ్ మెంబెర్స్ పై ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటారు. తమను కాపాడేది తమ పక్కన ఉన్న వారేనని నమ్ముతారు. మంచి మార్గంలో నడిపించే శక్తి తమ పక్కన ఉన్నవారికి ఉందని భావిస్తూ ఉంటారు.

వీరికి జాలి, దయ ఎక్కువ. మనుషులతో చాలా దయగా ప్రవర్తిస్తారు. అలాగే మూగజీవాల పట్ల కూడా అంతే దయను చూపిస్తారు. ఎదుటివారు చెప్పే బాధలు వింటూ ఉంటారు. అలాగే ఓదార్చడానికి ముందుంటారు.

ఏప్రిల్ నెలలో పుట్టిన వారు మంచి మనుషులని చెప్పవచ్చు. ఏప్రిల్ అనే పదం లాటిన్ పదమైనా ఎపేరిరే అనే పదం నుంచి పుట్టుకొచ్చింది. అంటే అర్థం ‘తెరవడం’ అని. అంటే కొత్త కాలానికి, కొత్త సమయానికి ద్వారం తెరుచుకునే కాలం అని. అందుకే ఏప్రిల్ నెలలోనే వసంతం వికసిస్తుంది. ప్రకృతి కొత్త చిగుళ్ళు వేస్తుంది. ఏప్రిల్ నెలలోనే ఎక్కువగా ఉగాది పండుగ కూడా వస్తూ ఉంటుంది.

2024-04-16T14:10:37Z dg43tfdfdgfd