ASTROLOGY - KUJA GOCHAR: మేష రాశిలో కుజ సంచారంతో ఈ రాశి వారిపై ధనలక్ష్మి కటాక్షం.. అనుకోని ధనలాభం..

Astrology - Kuja Gochar: జూన్ మొదటి వారంలో కుజుడు మీన రాశి నుంచి మేషంలోకి ప్రవేశించనున్నాడు. కుజుడు మేషరాశి సంచారం వల్ల ఈ రాశుల వారికి ధన లక్ష్మి కటాక్షం కలగబోతున్నట్టు జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.

మేషరాశి

అంగారకుడు తన సొంత ఇల్లైన మేషరాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశుల వారికీ అనుకోని అదృష్టం లభించనుంది. వ్యాపారస్తులకు అనుకోని ధనలాభం కలగనుంది. మీ కెరీర్లోనే అత్యున్నత శిఖరాలను అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకోని శక్తి మిమ్మల్ని నడిపిస్తోంది. కుటుంబ సభ్యుల సహాకారం ఉంటుంది. కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరిస్తున్నాయి.

ధనుస్సు రాశి..

కుజుడు మేష రాశి ప్రవేశం వల్ల ధనుస్సు రాశి వారు విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో అనుకూల శక్తుల వల్ల చేయాలనుకున్న పనులన్ని సకాలంలో పూర్తి చేస్తారు. ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానిసిక ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. పని మరియు వ్యక్తిగత జీవితంపై సమతూకం పాటించాలి.

మీనరాశి..

కుజుడు మేషరాశిలో ప్రవేశం వల్ల మీన రాశి వారికి అత్యంత అనుకూలమైన వాతావరణం నిండి ఉంటుంది. మీ ఆర్ధిక స్థితిగతులు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాల్సి రావడం లేదు. జీవిత భాగస్వామి నుండి పూర్తి సహాయ సహకారులు అందుతాయి. ఫ్యామిలీలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Read More: WomanThrows Son: పసిబిడ్డను మొసళ్లకు ఆహరంగా వేసిన కసాయి తల్లి..కారణం ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-08T02:49:46Z dg43tfdfdgfd