ASTROLOGY: ఈ 7 రాశుల వారిలో ధనదాహం.. ఏం చేసైనా డబ్బు సంపాదిస్తారు

ప్రస్తుతం మేష రాశిలో బుధ, గురు గ్రహాలు కలవడం జరిగింది. ఈ కలయిక ఏప్రిల్ 10 వరకూ కొనసాగుతుంది. ఈ రెండు శుభ గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు సాధారణంగా కొన్ని రాశుల వారిలో అధికార దాహాన్ని, ధన దాహాన్ని పెంచడం జరుగుతుంది. ప్రస్తుతానికి మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారి మీద ఈ జంట గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం (Aries): ఈ రాశిలో గురు, బుధ గ్రహాలు కలుసుకోవడం వల్ల ఈ రాశివారిలో విపరీతంగా అధికార తాపత్రయం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పోటీతత్వాన్ని, శ్రద్ధను పెంచే అవకాశం ఉంటుంది. ప్రతిభా పాటవాలను మరింత మెరుగుపరచుకుంటారు. అవసరమైతే ఉద్యోగం మారడానికి కూడా సిద్ధపడతారు. అన్ని మార్గాలను తనకు అనుకూలంగా మార్చుకుని, రాబడి పెంచు కునే అవకాశం కూడా ఉంటుంది. ఏదో విధంగా ఆదాయం పెంచుకునే అవకాశం కూడా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (Gemini): ఈ రాశివారికి లాభ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల కలయిక వల్ల వ్యక్తిగత పురోగతి మీదా, పదో న్నతుల మీదా, ఆర్థిక వ్యవహారాల మీదా శ్రద్ధ పెంచడం జరుగుతుంది. ఎక్కువగా లాభదాయక పరిచయాల మీదే దృష్టి పెట్టడం జరుగుతుంది. ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం మీద దృష్టి సారిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలతో పాటు రాబడి పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాల్లో కూడా లాభాలను పెంచుకుంటారు. సాధారణంగా వీరి ప్రయత్నాలు సఫలం అవుతాయి.(ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (Cancer): ఈ రాశికి దశమ స్థానంలో, అంటే ఉద్యోగ స్థానంలో రెండు శుభ గ్రహాలు కలవడం వల్ల అధికారం కోసం లేదా పదోన్నతి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసే అవకాశముంటుంది. పదోన్నతి విష యంలో సహచరులతో పోటీ పడడం కూడా జరుగుతుంది. నిరుద్యోగులు గట్టి పట్టుదలతో ఆశించిన ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ, పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆర్థికప్రయత్నాలు కూడా జోరందుకుంటాయి. ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
సింహం (Leo): ఈ రాశివారికి భాగ్య స్థానంలో బుధ, గురువులు కలిసినందువల్ల కొంత యత్నపూర్వకంగానూ, కొంత అప్రయత్నంగానూ అధికారాన్ని చేజిక్కించుకునే వకాశముంది. ఈ యోగం ఈ రాశికి చెందిన రాజకీయనాయకులు, రియల్టర్లు, వడ్డీ వ్యాపారులకు మరింత శుభ ఫలితాలనిచ్చే అవ కాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి అధికార లాభం కలగడంతో పాటు, ఆర్థిక లాభాలు కూడా కలిగే సూచనలున్నాయి. ఆదాయ వృద్ది విషయంలో వీరు ఏ అవకాశాన్నీ వదిలిపెట్టరు.(ప్రతీకాత్మక చిత్రం)
తుల (Libra): ఈ రాశికి సప్తమ స్థానంలో గురు, బుధులు కలవడం వల్ల వీరికి తప్పకుండా కొద్ది ప్రయత్నంతో అధికార యోగంతో పాటు ఆర్థిక యోగం కూడా పట్టే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ వీరిలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అధికారాన్ని, ఆదాయ వృద్ధిని ఈ రాశివారు పట్టుదలగా సాధించు కుంటారు. ఈ రాశివారు విలాస జీవితం గడపడం, సౌకర్యాలను పెంచుకోవడం వంటివి జరుగుతాయి. ఆస్తివివాదాన్ని సానుకూలంగా పరిష్కరించుకుంటారు. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (Sagittarius): ఈ రాశివారిలో కొద్ది రోజుల పాటు డబ్బు తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్నీ ఆదాయ కోణంలోనే చూడడం జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలను పెంచు కుంటారు. అనేక అవకాశాలను అంది పుచ్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి కోసం, ఆధికారం కోసం ప్రయత్నిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారికి అనుకోకుండా అధికారం దక్కడంతో పాటు, ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
మీనం (Pisces): ఈ రాశికి ధన స్థానంలో గురు, బుధులు కలవడం వల్ల ఆర్థిక ప్రయత్నాల్లో విజయాలను సాధిస్తారు. జీవిత భాగస్వామికి కూడా ఆర్థిక యోగం పడుతుంది. ఈ రాశికి గురువు ఉద్యోగ స్థానాధిపతి కూడా అయినందువల్ల తప్పకుండా ఈ రాశివారిలో అధికార తాపత్రయం పెరుగుతుంది. అధికారం కోసం, ఆదాయ వృద్ధి కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ఎక్కువగా కష్టపడ డానికి కూడా సిద్ధపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)

2024-03-29T13:01:23Z dg43tfdfdgfd