BANANA PRICE: వావ్.. అరటి గెల రూ.100 మాత్రమే..

అరటిని పేదవారి ఆపిల్ అని పిలుస్తారు. అరటి పండు సరసమైన ధరలో లభించే పోషక విలువలు కలిగిన పండు. కాబట్టి ప్రతిరోజూ అరటిపండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అరటిపండులో చాలా విటమిన్లు ,మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వేసవికి అరటిపండు ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అరటిపండ్లతో పెద్ద సమస్య ఏమిటంటే అవి త్వరగా కుళ్ళిపోతాయి.

కాబట్టి మీరు డజన్ల కొద్దీ అరటిపండ్లను ఇంట్లో కొంటే వాటిని త్వరగా తినాలి. ఎందుకంటే అవి కుళ్ళిపోతాయి. కార్తీక మాసంలో తమకు ఎక్కువగా లాభాలు వస్తాయని అరటి వ్యాపారస్తులు అంటున్నారు. సీజన్లో అయితే అరటిపండు గెల 500 వరకు కూడా ధర ఉంటుందని అంటున్నారు. వేసవి వచ్చిందంటే అరటిపండు ధర చాలా తగ్గుముఖం పడుతుందని తెలిపారు. అధిక శాతం నష్టాలు కూడా ఏర్పడతాయని అన్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పాడైపోవడం జరుగుతుందని తెలిపారు.

చల్లటి కబురు.. ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు!

ఉమ్మడి విశాఖపట్నం నర్సీపట్నం నియోజకవర్గంలో అంతటా కూడా వేల ఎకరాల్లో ఈ అరటి తోట వేయడం జరుగుతుంది. సీజన్లో రైతులు మంచి లాభాలు తీసుకుంటారు. కానీ ఎండాకాలం కావడంతో ధరలు బాగా తక్కువ ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం అరటి గెల 100 నుండి 150 రూపాయలు మాత్రమే ఉందని అంటున్నారు. ఎవరికైనా కావాలనుకుంటే నర్సీపట్నంలోని మార్కెట్ కు వస్తే తక్కువ ధరకే అరటి గెలలు అమ్మకం చేయడం జరుగుతుందని తెలిపారు.

శుభవార్త.. రూ.1,300కు పైగా పతనమైన బంగారం ధర, వెండి రూ.2,500 ఢమాల్!

వారానికి రెండుసార్లు మార్కెట్లో అమ్మకాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. చేతికొచ్చిన పంట రెండు రోజులు లేట్ అయితే ఎండవేడికి పాడైపోవడం జరుగుతుందని అంటున్నారు. ఆరు నెలలపాటు గాలులకు తట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడి కష్టపడి పండించిన పంట మార్కెట్ కి తీసుకువెళ్తే ఎవరూ తీసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులకు వ్యాపారస్తులకు కూడా అరటి గెల తక్కువగా ఉన్నప్పటికీ లాభాలు రావడం లేదని అంటున్నారు. వేసవి కాలంలో పెళ్లి ముహూర్తాలు కూడా తక్కువగా ఉంటాయి. ఏప్రిల్ నెలలో కొంచెం ఉన్నప్పటికీ మే జూన్ నెల అంతా కూడా ఇంకా ధరలు తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నారు.

2024-04-28T05:28:29Z dg43tfdfdgfd