BENEFITS OF MINT LEAVES : సమ్మర్​లో పుదీనా నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో.. బరువు, వేడిని తగ్గించుకునేందుకు ఇలా చేసేసుకోండి

Benefits of Drinking Mint Water in Morning : సమ్మర్​లో వేడిని తగ్గించి.. రిఫ్రెష్​ని ఇచ్చే డ్రింక్​లలో పుదీనా వాటర్ ఒకటి. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పుదీనా నీటిని తాగమంటున్నారు ఆరోగ్య నిపుణులు. కూల్ డ్రింక్స్​లకు బదులుగా దీనిని తాగితే సమ్మర్​ వేడిని తగ్గించుకోవడంతో పాటు.. ఆరోగ్యానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అంటున్నారు. మరి ఈ పుదీనా నీటిని ఎలా తయారు చేయాలి? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా నీటిని ఎలా చేసుకోవాలంటే..

పుదీనా వాటర్ విశ్రాంతిని, హైడ్రేషన్​ను ఇస్తుంది. దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి దీనిని ఎవరైనా హ్యాపీగా తాగవచ్చు. చక్కెర కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మధుమేహమున్నవారు తీసుకోవచ్చు. మరి ఈ పుదీనా నీటిని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. 

కావాల్సిన పదార్థాలు 

నీరు 

నిమ్మకాయ - 1

పుదీనా ఆకులు - అరకప్పు

కీరదోస - 1 

తయారీ విధానం

ముందుగా కుండలో నీరు పోయాలి. దానిలో పుదీనా ఆకులు, కీరదోస, నిమ్మకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. అన్ని బాగా మిక్స్ చేయాలి. కుండ లేనివారు ఓ గిన్నె లేదా జార్​లో వీటిని వేసి ఫ్రిడ్జ్​లో పెట్టుకోవచ్చు. ఈ నీటిని చల్లగా తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. సమ్మర్​లో రోజంతా పుదీనా నీటిని తాగడం వల్ల రిఫ్రెష్​గా ఉండడంతో పాటు.. హైడ్రేటెడ్​గా ఉంటారు. దీనివల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటంటే..

టాక్సిన్లను బయటకు పంపిస్తోంది..

శరీరంలో అనవసరమైన, చెడు కొవ్వు పేరుకుపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బరువు పెరిగిపోతుంటారు. రోజూ ఉదయాన్నే పుదీనా నీటిని తీసుకోవడం వల్ల టాక్సిన్లు బయటకు పోతాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు బయటకు వెళ్లిపోవడం వల్ల హెల్తీగా ఉంటారు. బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది.

బరువు తగ్గాలనుకుంటే.. 

బరువు తగ్గాలని చూస్తున్నారా? అయితే మీరు రోజూ పుదీనా నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో కేలరీలు తక్కువ ఉంటాయి. దీనిని తాగడం వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అతిగా తినడం తగ్గుతుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీలో.. పుదీనా నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైందని పేర్కొన్నారు. 

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

సమ్మర్​లో జీర్ణసమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. పుదీనా నీరు జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి లక్షణాల నుంచి ఉపశమనం అందిస్తుంది. ఇది జీర్ణకండరాలను రిలాక్స్ చేసి.. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుందని ఓ అధ్యయనం తెలిపింది.

హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.. 

హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు రోజూ ఉదయాన్నే దీనిని తీసుకోవచ్చు. ఇది శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించి.. హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. అంతేకాకుండా పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేసే హార్మోన్లపై మంచి ప్రభావం చూపిస్తుంది. పీరియడ్స్ సమయంలో కూడా దీనిని తీసుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. 

దీనిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుదీనా ఆకులలోని సాలిసిలిక్ యాసిడ్, విటమిన్ ఎ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనా నీటిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి కడుపులో మంట లేకుండా చేస్తాయి. మొటిమలు అరికట్టడంలో హెల్ప్ చేస్తాయి. టాక్సిన్స్​ కూడా బయటకు పంపిస్తాయి కాబట్టి.. చర్మం క్లియర్​గా ఉంటుంది. 

సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా?

పుదీనా వాటర్ దాదాపు అన్ని మంచి ఫలితాలే ఇస్తుంది. చెడు ప్రభావాలు ఏమి ఉండవంటున్నారు. అయితే వీటిని మీ డైట్​లో చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. 

Also Read : టేస్టీ, క్రంచీ ఓట్స్ వడలు.. నూనె పీల్చుకోకుండా ఉండాలటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

2024-04-24T05:50:15Z dg43tfdfdgfd