BUDH MARGI: ఇంతకు ముందెప్పుడూ లేని సంతోషం.. ఈ రాశుల వారికి రేపటి నుంచి ప్రారంభం

Budh Margi:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు తరచుగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుంటాయి. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో సంయోగం చెందవచ్చు. ఈ గ్రహాల సంచారం, కలయిక ప్రత్యేక రాశులపై ప్రభావం చూపుతుంది. కొందరు శుభ ఫలితాలు పొందితే, మరికొందరు అశుభాలను ఎదుర్కొంటారు. అయితే 2024 ఏప్రిల్‌ 25న సాయంత్రం 5.49 గంటలకు బుధుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు (Budh Margi).

కన్యారాశి, మిథునరాశిలో బుధుడు ఆధిపత్యం చెలాయిస్తాడు, బలంగా ఉంటాడు. అందుకే బుధుడు ఈ రెండు రాశుల్లో ఉన్నప్పుడు శక్తివంతంగా ఉంటాడు. అయితే రాశిచక్రంలో మీనం బలహీనమైన రాశి కావడంతో బుధుడు ప్రభావం కోల్పోతాడు. రేపు చోటుచేసుకునే ఈ గ్రహ గమనం, 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

* మేష రాశి (Aries):

మీ పనిని మరింత ప్రొఫెషనల్‌గా చేసుకోవడం అవసరం కావచ్చు. అవసరమైన దిద్దుబాట్లు చేయడానికి మీకు విశ్వం సహాయం చేస్తుంది. పనిలో ఒత్తిడికి లోనవుతారు. మీకు అవసరమైన సంతృప్తి పొందకుండా ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఒక ప్రయాణంలో మీరు చేసిన ప్రయత్నాల నుంచి ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యమైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి, లేదంటే నష్టాలు రావచ్చు.

---- Polls module would be displayed here ----

* వృషభం (Taurus):

పనిలో ముందుకు సాగుతారు. మార్పును అంగీకరించడం వల్ల అభివృద్ధి, సంతృప్తి లభిస్తాయి. కొత్త మార్గాలను పరిశోధించడం మంచిది, ఇది ఇతర అవకాశాలకు దారి చూపుతుంది. మీరు ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందవచ్చు. డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. సంపాదిస్తున్న డబ్బు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి, ఆస్తులను నిర్మించడానికి ఉపయోగించవచ్చు.

* మిథునం (Gemini):

కెరీర్‌లో స్థిరపడిన, మంచి భవిష్యత్తు కోసం చూస్తున్న వారికి, ఈ సంవత్సరం అదృష్టవంతంగా ఉండవచ్చు. ఆశ్చర్యం, సంతృప్తి కలిగించే అనేక అవకాశాలను అందిస్తుంది. మీనరాశిలో బుధుడు ప్రత్యక్ష చలనంలో ఉన్నందున, విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. లాభదాయకమైన బిజినెస్ వెంచర్లను కొనసాగించే అవకాశాలు తలెత్తవచ్చు. పని సంబంధిత మిషన్ల కోసం విదేశాలకు వెళ్లవచ్చు. మీరు పెట్టుబడులు తెలివిగా పెట్టి, ఆస్తులను పెంచుకుంటారు. ఆర్థిక పరిధులు ఓపెనప్‌ అవుతాయి.

* కర్కాటకం (Cancer):

మీరు ఉద్యోగం చేస్తుంటే, చేయడానికి ఎదురు చూస్తుంటే మీరు ట్రావెల్‌ చేయడానికి అద్భుతమైన అవకాశాలు ఉండవచ్చు. స్థానికంగా కాకుండా, వేరే చోట పని కనుగొనవచ్చు. ఉన్నతాధికారులతో కలిసి కష్టపడి పనిచేయడానికి మీరు చేసిన ప్రయత్నాలకు తగిన క్రెడిట్ లభించకపోవచ్చు. దీనితో తక్కువ సంతృప్తి చెందవచ్చు. మీ సహోద్యోగులు అసూయ పడవచ్చు, ఇది మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఈ సమయంలో మీరు పరిమిత, తక్కువ సంపాదన సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు. మీరు డబ్బు సంపాదించగలిగినప్పటికీ, ఎక్కువ ఆదా చేయడం కష్టం.

* సింహం (LEO):

మీ కెరీర్ ప్రయాణంలో, ప్రయాణం, అభ్యాసానికి అవకాశాలు ఉన్నప్పటికీ, మీరు పురోగతికి పరిమిత అవకాశాలను కనుగొనవచ్చు. కష్టపడి పనిచేసినప్పటికీ, మీరు ఆశించినంత సంతృప్తిని పొందలేరు. ఆశయం మిమ్మల్ని నడిపిస్తుంది, కానీ విజయం సవాళ్లతో రావచ్చు. ఆర్థికంగా, మీనరాశిలో బుధుడు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు డబ్బు సంపాదించడం కష్టంగా ఉండవచ్చు. మీరు మరింత ఆదా చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ మీ మొత్తం సంపదను పెంచుకోవడం కష్టం.

* కన్య (Virgo):

వర్క్‌లో, ఉద్యోగ వృద్ధిని కోరుకునే వారికి చాలా ఆప్షన్లు ఉన్నాయి. మీ లక్ష్యాలకు అనుగుణంగా కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడం ద్వారా లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో ముందుకు సాగడం ద్వారా మీరు సంతృప్తిని పొందవచ్చు. విదేశాలలో పని చేసే అవకాశాలు కూడా కనిపించవచ్చు. కెరీర్ సంతృప్తి, వ్యక్తిగత వృద్ధిని అందిస్తుంది. ఈ కాలంలో మీరు లాభదాయకమైన వ్యాపారాల ద్వారా చాలా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది.

* తుల (Libra):

మీకు ఉద్యోగం ఉంటే, ఈ సమయంలో మీరు అదృష్టాన్ని, గొప్ప విజయాన్ని పొందవచ్చు. సేవా దృక్పథంతో, మంచి ఆదాయాన్ని సంపాదించడం, నిర్వహించడం సులభం. ఈ కాలం మీ జీవితంలో ఒక సంపన్న దశను సూచిస్తుంది, కాబట్టి మీ పొదుపును పెంచుకోవడం గురించి ఆలోచించండి.

* వృశ్చికం (Scorpio):

మీరు వృత్తిపరమైన వృద్ధి కోరుతుంటే, వాటికి ఇది సరైన సమయం కావచ్చు. ప్రస్తుత ఉద్యోగం పట్ల మీ అసంతృప్తి మార్పులకు దారితీయవచ్చు. మీరు ఆర్థిక లక్ష్యాలపై ఫోకస్‌ చేసినా, మీన రాశిలో బుధుడు ప్రత్యక్షంగా ఉన్న సమయంలో మీరు పెద్దగా వృద్ధిని చూడలేరు.

* ధనుస్సు (Sagittarius):

కెరీర్ గ్రోత్‌కు అవకాశాలు రావచ్చు. ఈ ప్రయాణం మీకు స్ఫూర్తినిస్తుంది, సంతృప్తి దొరుకుతుంది. అయినప్పటికీ, మీన రాశిలో బుధుడు ఉన్న సమయంలో మీ సంపాదన సామర్థ్యం మితంగా ఉండవచ్చు, లాభాలు వచ్చే అవకాశః ఉన్నప్పటికీ పొదుపు చేయడం సవాలుగా ఉంటుంది.

* మకరం (Capricorn):

మీ ఉద్యోగంలో ముందుకు సాగడానికి, దానిలో ఎక్కువ ఆనందాన్ని పొందేందుకు అనుకూలమైన స్థితిలో ఉంటారు. విదేశీ అవకాశాలు మరింత సంతృప్తిని అందిస్తాయి. ఈ సమయంలో డబ్బు బాగా సంపాదించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి.

* కుంభ రాశి

మీరు ఉద్యోగంలో ఉంటే, ఉన్నత స్థానానికి చేరుకోవడానికి, ప్రవర్తను మెరుగుపరచుకోవడానికి ఇది మంచి క్షణం. అయితే, మీ ప్రయత్నాలను ఉన్నతాధికారులు అంగీకరించకపోవచ్చు. ఆర్థికంగా, మీ ఖర్చులు పెరగవచ్చు. ఈ కాలంలో పొదుపు చేయడం కష్టమవుతుంది.

* మీనం (Pisces):

మీనంలో బుధుడు ఉన్నప్పుడు, మీ ఉద్యోగాన్ని జాగ్రత్తగా నిర్వహించడం అవసరం కావచ్చు. మీరు ఎక్కువ అవకాశాలు, సంతృప్తి కోసం కెరీర్ మార్పును పరిగణించవచ్చు. ఈ సమయంలో చెల్లింపులు, పెట్టుబడుల ద్వారా గణనీయమైన ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం నైతిక సూత్రాల ఆధారంగా బలపడుతుంది.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)

2024-04-24T10:43:33Z dg43tfdfdgfd