BUY A FLAT: ఇల్లు కొనడం కంటే.. అద్దెకు ఉండటమే బెటరా? ప్రముఖ వ్యాపారవేత్త ఆసక్తికర వ్యాఖ్యలు!

Buy A Flat: సొంత ఇంటిని నిర్మించుకోవాలని చాలా మంది కలలుగంటుంటారు. కష్టపడి సంపాదించిన డబ్బుకు కొంత లోన్ తీసుకుని తాము కలలుగన్న ఇంటిని నిర్మించుకుంటారు. ఇటీవలి కాలంలో విలాసవంతమైన ఇళ్ల కోసం ఎక్కువ మంది చూస్తున్నారు. తమ కుంటూ సొంత గూడు ఉండాలనేది అందరు చెబుతుంటారు. అయితే, సొంతింటి కంటే అద్దె ఇంట్లో ఉండటమే బెటర్ అనే వారూ ఉన్నారు. చాలా కాలంగా ఈ విషయంపై చాలా మంది వ్యాపారవేత్తలు సినీ నటులు తమ అభిప్రాయాల్ని పలు వేదికలపై పంచుకున్నారు. తాజాగా ఈ విషయంపై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఓ పోడ్ కాస్ట్‌లో పాల్గొన్న శంతను దేశ్ పాండే.. తాను గురు గ్రామ్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నట్లు వెల్లడించారు. ' ప్రస్తుతం నేను గురు గ్రామ్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నా. అందుకు రూ. 1.5 లక్షలు అద్దె చెల్లిస్తున్నా. నేనుంటున్న అపార్ట్‌మెంట్ విలువ రూ. 7.5 కోట్ల నుంచి రూ. 7.8 కోట్ల మధ్య ఉండవచ్చు. దానిని కొనాలంటే అందులో కనీసం 70 శాతం లోన్ తీసుకోవాలి. అప్పుడు నెలకు ఈఎంఐ రూ. 6- 7 లక్షల వరకు కట్టాల్సి వస్తుంది. దీని ప్రకారం చూసుకుంటే ఈఎంఐ చెల్లించాల్సిన మొత్తంలో కేవలం నాలుగో వంతు ఖర్చుతోనే అదే ఇంట్లో నివసిస్తున్నా.' అని పేర్కొన్నారు శంతను దేశ్ పాండే. అయితే, హైదరాబాద్ లో ఇంటి రెంట్లు భిన్నంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

అద్దె ఇంట్లో ఉండడం వల్ల కొన్ని వెసులు బాట్లు ఉన్నాయన్నారు శంతను దేశ్ పాండే. ఆఫీసుకు సమీపంలోనే తాను నివసించడం కోసం చాలా సార్లు ఇల్లు మారినట్లు గుర్తు చేశారు. ఎంత పెద్ద అద్దె ఇంట్లో ఉంటున్నా మారడానికి తక్కువ రోజులే పడుతుందన్నారు. సులభంగా మరో ఇంటికి మారి పోవచ్చని తెలిపారు. అయితే, అద్దె ఇల్లే బెటర్ అంటున్న శంతను దేశ్ పాండే అభిప్రాయంతో కొందరు ఏకీభవించారు. మరి కొందరు మాత్రం ఆయనను వ్యతిరేకిస్తున్నారు. సొంత ఇంట్లో ఉండే సౌకర్యం వేరని, అద్దె ఇంట్లో అది దొరకదని అభిప్రాయపడుతున్నారు. అలాగే అద్దె చెల్లించే బదులు నెల వారీగా ఈఎంఐలు చెల్లించడం ద్వారా ఆస్తులను సృష్టించుకోవచ్చని చెబుతున్నారు. సొంత ఇల్లు ఉండడం ద్వారా అనేక రకాల సౌకర్యాలు ఉంటాయని, తమకు నచ్చినట్లు జీవించవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే, కొందరు అద్దె ఇళ్లకే జై కొడుతున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-02T04:36:12Z dg43tfdfdgfd