CBSE CLASS 10TH 12TH : ఇకపై ఏడాదికి రెండుసార్లు 10, 12వ తరగతి పరీక్షలు..!

CBSE Board Exams : సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) బోర్డు పరీక్షలను ప్రతిఏటా రెండుసార్లు నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది. పదో తరగతి, ఇంటర్ చదివే విద్యార్థులకు ఏడాదిలో రెండు సార్లు పరీక్షల నిర్వహణకు కేంద్ర విద్యాశాఖ కసరత్తు వేగవంతం చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలుకు వ్యూహ రచన చేయాలని సీబీఎస్ఈ (CBSE)ని కేంద్ర విద్యాశాఖ కోరినట్లు సమాచారం. ఈ పరీక్షల్లో సెమిస్టర్ విధానాన్ని తెచ్చే ఆలోచన లేదని తెలుస్తోంది. ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై వచ్చేనెలలో ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లతో సీబీఎస్ఈ అధికారులు సంప్రదించనున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్ల షెడ్యూల్ మీద ఎలాంటి ప్రభావం పడకుండా రెండోసారి బోర్డు పరీక్షల నిర్వహణకు అకడమిక్ క్యాలండర్ సిద్ధం చేసే పనిలో సీబీఎస్ఈ అధికారులు నిమగ్నమైనట్లు ప్రాథమిక సమాచారం.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా సీబీఎస్ఈ పరీక్షల్లో మార్పులు తేవాలని ఇస్రో మాజీ చైర్మన్ కే కస్తూరి రంగన్ సారథ్యంలోని నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ముసాయిదా కమిటీ సూచించింది. 11,12 తరగతుల విద్యార్థులకు సెమిస్టర్ విధానాన్ని కూడా ప్రతిపాదించింది. అయితే.. విద్యార్థులు ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. జాతీయస్థాయి ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ సంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులు ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని.. విద్యార్థులు తాము సాధించిన ఉత్తమ స్కోర్ ఎంచుకోవచ్చుని వెల్లడించారు.

CBSE Result 2024 : సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదేCBSE Results 2024 : సీబీఎస్ఈ 10వ తరగతి , సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. CBSE Results 2024 విడుదలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్జ్యుకేషన్ (CBSE).. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ.. ఏక్షణమైనా ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాత ట్రెండ్‌ పరిశీలిస్తే.. సీబీఎస్ఈ ఫలితాలు (CBSE Class 10th and 12th Result).. ఏప్రిల్- మేలో విడుదలవుతాయి. CBSE Results 2024 డేట్, టైమ్ వివరాలను సీబీఎస్ఈ ప్రకటించాల్సి ఉంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-28T13:11:49Z dg43tfdfdgfd