CHATURGRAHI YOG MAY 2024: చతుర్గ్రాహి యోగంతో 3 రాశులవారికి లాభాలే లాభాలు!

 

Chaturgrahi Yog May 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం సమయం సందర్భాన్ని బట్టి గ్రహ సంచారం చేస్తూ ఉంటుంది. దీని కారణంగా 12 రాశుల వారిపై మంచి చెడు రెండు ప్రభావాలు పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలుస్తాయి. ఇలా వివిధ గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు శక్తివంతమైన సంయోగాలు ఏర్పడుతూ ఉంటారు. దీనికి కారణంగా కూడా రాశుల వారిపై ప్రతికూల సానుకూల ప్రభావాలు ఏర్పడతాయి. ఇదిలా ఉండగా బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించబోతోంది. వచ్చే ఏడాది వరకు ఇదే రాశిలో ఉండబోతుంది. అలాగే గ్రహాలకు అధిపతి అయిన శక్తివంతమైన సూర్యగ్రహం కూడా మే 14 తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో వృషభరాశిలోకి సంచారం చేయబోతోంది. ఇప్పటికే ఆ రాశిలో శుక్రుడు సంచార దశలో ఉన్నాడు. మే 31వ తేదీ వరకు ఇదే గ్రహంలోకి బుధుడు కూడా సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా మే 31న ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని, ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన చతుర్గ్రాహి యోగం ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.

వృషభ రాశి:

వృషభ రాశి వారికి మే 31వ తేదీన ఏర్పడే చతుర్గ్రాహి యోగం కారణంగా అనుకూల ప్రభావం ఏర్పడుతుంది. దీని కారణంగా ఎలాంటి కఠినమైన పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు. అలాగే కుటుంబంలోని సోదరులతో బంధం మరింత మెరుగు పడుతుంది. అలాగే చాలా కాలం వరకు నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు వీరు ఈ సమయంలో కొత్త కొత్త ఆస్తులను కూడా కొనుగోలు చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో తెలివితేటలు పెరగడం కారణంగా పనుల్లో మెరుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త జాబ్ ఆఫర్స్ లభించే ఛాన్స్ ఉంది. దీంతోపాటు వ్యాపారాలు చేస్తున్న వారికి పెద్ద పెద్ద ఒప్పందాలు జరుగుతాయి.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి కూడా ఈ ప్రత్యేక చతుర్గ్రాహి యోగం కారణంగా దరిద్రం నుంచి విముక్తి లభిస్తుంది. మనసులో సానుకూల వాతావరణ ఏర్పడి అన్ని రకాల పనులు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. మనసు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఇక వ్యాపారాలు చేస్తున్నవారు విదేశీ ఒప్పందాలతో బిజీ బిజీగా జీవనం కొనసాగిస్తారు. అలాగే ఒప్పందాల్లో విజయాలు కూడా సాధిస్తారు. ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఎంతో లాభదాకంగా ఉంటుంది. అలాగే కెరీర్ కు సంబంధించిన విషయంలో కూడా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో పాటు వీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇక కుటుంబ జీవితం విషయానికొస్తే ఈ యోగం కారణంగా ఆనందంగా, సంతోషంగా కొనసాగిస్తారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మకర రాశి:

మకర రాశి వారికి ఈ చతుర్గ్రాహి యోగం ఐదవ స్థానంలో ఏర్పడబోతోంది. దీనికి కారణంగా వీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లగలుగుతారు. దీంతోపాటు కొంత ఒత్తిడించి గురైనప్పటికీ అన్ని పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వీటిని పరిష్కరించుకోవడానికి కఠినమైన పనులు కూడా చేయగలుగుతారు. దీంతో పాటు వీరు కొత్త ఆస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎప్పటి నుంచి ఒక వ్యాపార రంగంలో నష్టాలను ఎదుర్కొంటున్న వారికి ఈ సమయం కొంత ఉపశమనం కలిగిస్తుంది ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ తో పాటు జీతాలు కూడా పెరుగుతాయి. గతంలో నిలిచిపోయిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-05-08T05:05:09Z dg43tfdfdgfd