COLD COFFEE RECIPE: చల్ల చల్లని కోల్డ్ కాఫీ రెసిపీ.. ఇలా 5 నిమిషాల్లో రెడీ!

Cold Coffee Recipe: చాలా మందికి వేసవి కాలంలో కోల్డ్ కాఫీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకుని తాగడండి. తయారీ విధానం తెలుసుకోండి.  

 

Cold Coffee Recipe In Telugu: వేడిగా ఉండే వేసవిలో చల్లని, రిఫ్రెష్‌మెంట్ కోసం చాలా మంది కూల్‌ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. కొంతమందైతే కోల్డ్ కాఫీని తీసుకుంటూ ఉంటారు. సమ్మర్‌లో కోల్డ్ కాఫీ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే రోజంతా శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. అయితే చాలా మంది మార్కెట్‌లో లభించి ఖరీదైన కాఫీ షాపుల్లో దీనిని విక్రయిస్తారు. ఇక నుంచి ఇలా చెయ్యన్నక్కర్లేదు. ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకుని ఆనందించండి.. 

కోల్డ్ కాఫీ రెసిపీ కావలసినవి పదార్థాలు:

2 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి

1/2 కప్పు వేడి నీరు

1/2 కప్పు పాలు

2 టేబుల్ స్పూన్ల చక్కెర (రుచికి పరిపడ)

1/4 టీస్పూన్ వనిల్లా ఎసెన్స్ 

4 ఐస్ క్యూబ్స్

2 స్కూప్స్ వనిల్లా ఐస్ క్రీం

చాక్లెట్ షేవింగ్స్ లేదా కోకో పొడి కోసం గార్నిష్ 

తయారీ విధానం:

ఒక గిన్నెలో కాఫీ పొడి, వేడి నీటిని కలిపి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాఫీ పూర్తిగా కరిగే వరకు 2 నుంచి 3 నిమిషాలు నానబెట్టండి.

ఒక షేకర్ లేదా గ్లాసులో కాఫీ మిశ్రమాన్ని, పాలు, చక్కెర, వనిల్లా ఎసెన్స్ మిక్స్‌ చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత మిశ్రమాన్ని బాగా కలపడానికి షేక్ మెషన్‌ను వినియోగించాల్సి ఉంటుంది .

ఆ తర్వాత మరో గాజులలో ఐస్ క్యూబ్‌లను పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. 

షేక్ చేసిన కాఫీ మిశ్రమాన్ని గాజులలో పోయాల్సి ఉంటుంది.

వనిల్లా ఐస్ క్రీం ఒక స్కూప్‌తో టాప్ చేసి కాఫీపై వేసుకోవాలి.

చాక్లెట్ షేవింగ్స్ లేదా కోకో పొడితో గార్నిష్ చేసి వెంటనే సర్వ్ చేసి తీసుకోండి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

చిట్కాలు:

కాఫీ మరింత ఘాటమైన రుచి కోసం, కాఫీ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో 30 నిమిషాలు లేదా ఒక రాత్రంతా ఉంచవచ్చు.

మీకు ఇష్టమైన ఫ్లేవర్ కోసం వనిల్లా ఎసెన్స్‌కు బదులుగా చాక్లెట్ సిరప్, కారామెల్ సిరప్ లేదా నట్ సిరప్‌ను కూడా వినియోగించవచ్చు.

డైరీ ఉత్పత్తులు నచ్చకపోతే, మీరు పాలకు బదులుగా బాదం పాలు లేదా ఓట్ పాలు ఉపయోగించవచ్చు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-05-07T14:17:48Z dg43tfdfdgfd