COW : గో మూత్రంతో స్నానం.. ఆవు పేడే సన్‌స్క్రీన్‌ లోషన్ గా వాడుతారు.. ఎక్కడో తెలుసా..?

మన దేశంలో గో మాతను అత్యంత గౌరవనీయమైన జంతువుగా భావిస్తారు. గోమాతను పూజిస్తే సనల దేవతలను ఆరాధించినట్లేనని అనుకుంటారు. హిందూ ధర్మం ప్రకారం ఆవుపాలు, నెయ్యి, వెన్న, గోమూత్రం, గోమయం అన్నీ శ్రేష్ఠమైనవిగానే భావిస్తారు. అందుకే యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే సమయంలోనూ గోమయం, గోమూత్రంతో శుద్ధి చేసిన అనంతరం యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఆవులకి అంత ప్రాధాన్యత. ఇలాంటి ఆవులు ఏ ఇంట ఉంటే ఆ ఇంట సిరుల పంటే అని చెబుతారు. అందుకే రైతులు చాలామంది ఆవులను పెంచుతుంటారు.

ఇదీ చదవండి : నీళ్లు తాగడానికి జిరాఫీ ఎంత కష్టపడాలో తెలుసా.. ఈ వీడియో చూడండి.. అయ్యో పాపం అంటారు..!

ఆవు పాలు శ్రేష్ఠమైనవి భావిస్తుంటారు. అందుకే పిల్లలు, పెద్దలు వీటిని వాడుతుంటారు. ఇక ఆవు పేడ అద్భుతమైన సహజ ఎరువుగా ఉపయోగిస్తుంటారు. అయితే భారతదేశం లాగానే ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో ఆవులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆ విధంగా ఆఫ్రికా ఖండంలోని దక్షిణ సూడాన్ దేశంలో అక్కడ నివసించే గిరిజనుల సమూహం స్నానానికి గోమూత్రాన్ని వినియోగిస్తున్నారు. సూర్యరశ్మి నుండి రక్షించడానికి వారు ఆవు పేడను సన్‌స్క్రీన్‌గా కూడా ఉపయోగిస్తారు.

దక్షిణ సూడాన్‌లోని అంకోల్ వాట్సీ జాతి పశువులు 8 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. వీటి విలువ USD 500 అంటే భారతీయ కరెన్సీలో రూ. 41,000. ముండారి అనే గిరిజనులలో ఈ రకమైన పశువులు సర్వసాధారణం. వారు దానిని తమ గొప్ప ఆస్తిగా మాత్రమే కాకుండా గౌరవ చిహ్నాలుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఆవులను రక్షించడానికి గిరిజనులు ఆయుధాలు ఉంచుకుంటారు. ముఖ్యంగా గోవులకు రక్షణగా మెషిన్ గన్‌లతో కూడిన గార్డులను నియమించారు. అక్కడ గోమూత్రాన్ని స్నానాలకే కాకుండా ఇళ్లలో చల్లుకోవడానికి, పళ్లు తోముకోవడానికి కూడా ఉపయోగిస్తారు.

గోమూత్రంలోని అమ్మోనియా గిరిజనుల జుట్టును నారింజ రంగులోకి మార్చింది. ముండారి తెగ వారు ఉపయోగించే అంకోల్ వట్సీ అనే మాంసం కోసం చాలా తక్కువ సంఖ్యలో ఆవులను చంపుతారు. దీనికి ప్రధాన కారణం దాని అధిక ధర. గిరిజనులకు వివాహాల సమయంలో ఈ అంకోల్ వట్సీ ఆవులను కట్నంగా ఇస్తారు.

2024-03-28T17:29:32Z dg43tfdfdgfd